India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈనెల 14, 15వ తేదీల్లో నిర్వహించే గుత్తి కోట ఉత్సవాల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. గురువారం టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో వెన్యూ, స్టాల్స్ సిద్ధం చేయడం, రోడ్ల ప్యాచ్ వర్క్, తాగునీరు, లైటింగ్, పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, హెరిటేజ్ వాక్, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కామర్స్ పరీక్ష జరిగింది. ఈ రోజు పరీక్షలకు సెట్-I ప్రశ్నపత్రాన్ని వాడినట్లు RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. జనరల్ విద్యార్థులు 5,223 గాను 4,937 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు 286 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షలను CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించామన్నారు.

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సంక్షేమమే పరమావధిగా పార్టీ అడుగులు వేస్తుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. అనంతపురంలోని జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లాలో గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించే అధికారాన్ని కలెక్టర్ ఆనంద్‌కు కట్టబెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2 నాటికి ముగియనుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక డీపీఓలు రూపొందించిన జాబితా మేరకు కలెక్టర్ అధికారులకు పంచాయతీల బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు జిల్లాల వారీగా ర్యాంకులు ప్రకటించారు. సంక్షేమ పథకాలు, అధికారుల పనితీరుపై అనంతపురం జిల్లా రాష్ట్రస్థాయిలో 24వ స్థానంలో నిలిచింది. జిల్లాలో ప్రజల సంతృప్తి స్థాయి 64.6 నుంచి 66.6 శాతానికి పెరిగింది. పనితీరులో మరింత పురోగతి సాధించి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం కింద 2,75,642 మంది రైతుల అర్హుల జాబితాను అధికారులు ప్రకటించారు. జిల్లాకు రూ.163.26 కోట్లు కేటాయించగా అందులో అన్నదాత సుఖీభవ పథకానికి రూ.110.26 కోట్లు, పీఎం కిసాన్‌కు రూ.53.01 కోట్లు విడుదల చేయనున్నారు. జిల్లాలో అత్యధికంగా శింగనమల నియోజకవర్గంలో 54,338 రైతులకు అందించనున్నారు.

అనంతపురం నగరపాలక సంస్థ విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకునేందుకు సొంతంగా సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జస్వంత్ తెలిపారు. ఏటా రూ.10 కోట్ల వ్యయాన్ని ఆదా చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రూ.20 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ విన్నపం మేరకు సీఎం చంద్రబాబు ఈ ప్లాంట్ కు సహకారం అందించారు.

అనంతపురం జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతోందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పేర్కొన్నారు. గ్యాస్ కొరత వస్తుందనే ఉద్దేశంతో వెంట వెంటనే వినియోగదారులు ఆన్‌లైన్‌లో గ్యాస్ బుకింగ్ చేయడానికి వెబ్ పోర్టల్ అనుమతించదన్నారు. సింగిల్ సిలిండర్ 21 రోజులు, డబుల్ సిలిండర్ 30 రోజుల వ్యవధి అన్నారు.

క్యాన్సర్ నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం అన్ని PHC, పట్టణ, ప్రాంతీయ, కమ్యూనిటీ ఆసుపత్రులలో జరిగినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్‌ఛార్జ్ అధికారి డా.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 1,649 మంది 14 ఏళ్ల బాలికలను గుర్తించామన్నారు. అందులో నేడు 1,245 మంది బాలికలకు వ్యాక్సిన్ వేశామన్నారు. వ్యాక్సిన్ అనంతరం వైద్యులు అమ్మాయిలకు ధ్రువపత్రాలు పంపిణీ చేశారన్నారు.

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కామర్స్ పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు సెట్-III ప్రశ్న పత్రాన్ని వాడామని RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. జనరల్ విద్యార్థులు 4,069 గాను 3,937 మంది హాజరు కాగా 132 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,468 గాను 1,331 మంది హాజరు కాగా 137 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షలను CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించామన్నారు.
Sorry, no posts matched your criteria.