India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఇన్‌ఛార్జ్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామ ఎండీయూ ఆపరేటర్ బండారు కొండయ్య, తాడిపత్రిలోని కో- ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ సీనియర్ క్లర్క్ టీ.రమేశ్ రెడ్డి ఉన్నారు.
అనంతపురం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గౌతమిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంటనే వారికి కేటాయించిన విధుల నుంచి తప్పుకోవాలని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్‌కి జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.
తాడిపత్రి వైసీపీ మాజీ సమన్వయకర్త VR రామిరెడ్డి కుమారులు మంగళవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. VR రామిరెడ్డి 2014 ఎన్నికల్లో తాడిపత్రి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో కలిసి VR రామిరెడ్డి కుమారులు VR వెంకటేశ్వర రెడ్డి, VR విగ్నేశ్వర రెడ్డి టీడీపీలో చేరారు.
అనంతపురం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గౌతమిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంటనే వారికి కేటాయించిన విధుల నుంచి తప్పుకోవాలని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్‌కి జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.
ధర్మవరంలో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు అంతం చేయడానికి ఈ నెల 4న ప్రజల ముందుకు వస్తున్నట్లు కూటమి అభ్యర్థి సత్యకుమార్ తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు అనంతపురం నుంచి ర్యాలీగా బయల్దేరతామన్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ధర్మవరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటానని, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని సత్యకుమార్ కోరారు.
అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌లను బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలను జారీ చేసింది. అలాగే బదిలీ అయిన అధికారులు తమ కింది వారికి తక్షణం బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని కోరింది. బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకు విధుల్లో పాల్గొనకూడదని ఆదేశించింది.
ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్ TDP అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి చర్చించినట్లు సత్యకుమార్ ‘X’లో పోస్ట్ చేశారు. YCP అరాచకపాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. మోదీ నేతృత్వంలో, పవన్ సహకారంతో.. చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కానున్నట్లు వివరించారు. అంధకారం తొలిగి వెలుగులు ప్రసరించనున్నట్లు సత్యకుమార్ పేర్కొన్నారు.
సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరాంజనేయులును వ్యతిరేకిస్తున్న నియోజకవర్గ నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వ్యక్తిని చూసుకోకుండా వ్యవస్థను చూసి పనిచేయాలని జగన్ కోరినట్లు తెలిసింది. జగన్‌ను కలిసిన వారిలో శింగనమల నియోజకవర్గం వైసీపీ నాయకులు నార్పల సత్యనారాయణ రెడ్డి, తరిమెల గోకుల్ రెడ్డి, చెన్నంపల్లి రాజన్న, చాములూరు రాజగోపాల్, తదితరులు ఉన్నారు.
చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురంలో సోమవారం రాత్రి యువ రైతు దొడ్డి నారాయణ(45) గుండెపోటుతో మృతిచెందారు. నారాయణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. సోమవారం రాత్రి తన పొలానికి వెళ్లగా హఠాత్తుగా గుండెలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. దీంతో భార్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
అనంతపురం జిల్లాలో 2,89,131 మంది లబ్దిదారులకు మొత్తం రూ.86.58 కోట్లు నిధులు పించన్ మంజూరైనట్లు పీడీ నరసింహారెడ్డి తెలిపారు. ఇందులో వృద్ధులు 1,45,839 మందికి గాను రూ.43.75 కోట్లు, వితంతువులు 66,868 మందికి రూ.20 కోట్లు, విభిన్న ప్రతిభావంతులు 46,664 మందికి రూ.13.99 కోట్లు, చేనేతలు 6,793 మందికి రూ.2 కోట్లు, ఒంటరి మహిళలు 6,744 మందికి రూ.2 కోట్లు 3వ తేదీ నుంచి లబ్ధిదారులకు అందించనున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.