India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 18 నుంచి 20 వరకూ ప్రీ పీహెచ్డీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. ఎస్కేయూ లోని కెమిస్ట్రీ గ్యాలరీలో పరీక్షలు జరుగుతాయన్నారు. అలాగే మే 4 నుంచి ఎస్కేయూ పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఆరంభమవుతాయని తెలిపారు.

యల్లనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులురాలిగా విధులు నిర్వహిస్తున్న విజయకుమారిని సస్పెండ్ చేసినట్లు ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాస రావు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వివరాలు వాట్సాప్ గ్రూపులలో నిబంధనలకు విరుద్ధంగా పంపడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

అనంతపురం JNTU పరిధిలో నిర్వహించిన M.Tech 1వ, 3వ సెమిస్టర్ (ఆర్21) రెగ్యులర్, సప్లిమెంటరీ, M.Tech 1వ, 3వ సెమిస్టర్ (ఆర్17) సప్లిమెంటరీ, M.Tech 2వ సెమిస్టర్ (ఆర్21), (ఆర్17) సప్లిమెంటరీ ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ బి.చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. పరీక్ష ఫలితాల కోసం www.jntua.ac.in ను సంప్రదించాలని సూచించారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో తాగునీరు, విద్యుత్ సరఫరా, జాతీయ ఉపాధి హామీ పథకం పనులు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంగళవారం సాయంత్రం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ అరుణ్ బాబు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్సి మల్లికార్జున, డ్వామా పీడీ విజయేంద్ర బాబు పాల్గొన్నారు.

నార్పల మండల కేంద్రంలో ఈనెల 18న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించనున్నారు. సభ ఏర్పాట్లను సింగనమల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి శైలజనాథ్, డీసీసీ అధ్యక్షులు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన పనుల గురించి నాయకులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరు మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని కోరారు.

చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం పెట్రోల్ బంక్ వద్ద ఓ వాహనం ఢీకొని విద్యుత్ లైన్మెన్ మురళీ అక్కడికక్కడే మృతి చెందాడు. ధర్మవరం నుంచి స్వగ్రామం నాగసముద్రం గేట్‌కు బైక్‌పై వస్తుండగా. పెట్రోల్ బంక్ దగ్గర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మురళీ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ వాహనాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. మురళీ ప్రస్తుతం బసినేపల్లి జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆటో డ్రైవర్ సాకే జయప్ప(50) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. డి.చెర్లోపల్లి గ్రామానికి చెందిన సాకే జయప్ప ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం బత్తలపల్లి నుంచి స్వగ్రామానికి ఆటోలో వెళుతుండగా బత్తలపల్లి సమీపాన కుక్కను తప్పించబోయి ఆటో బోల్తాపడింది. ఆ ప్రమాదంలో గాయాపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

సాధారణ ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల కొరకు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ అధికారులు పోస్టల్ బ్యాలెట్ కొరకు ఫారం-12 దరఖాస్తులు పూర్తి చేసి 24, 25 తేదీలలో రిటర్నింగ్ అధికారికి అందజేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

ధర్మవరం పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి హత్య కేసులో నిందితులను రెండో పట్టణ సీఐ అశోక్ కుమార్ గంటల వ్యవధిలోని అరెస్టు చేశారు. మంగళవారం తెల్లవారుజామున రైల్వే స్టేషన్ నుంచి వస్తున్న శ్రీనివాసరెడ్డిని ఆటో నడుపుతున్న లోకేంద్ర, విష్ణు అనే వ్యక్తులు కిరాయి విషయంలో గొడవపడి కట్టెలతో దారుణంగా కొట్టి హత్య చేసినట్లు వెల్లడించారు. సీఐ మంగళవారం సాయంత్రం నిందితులను అరెస్టు చేశారు.

కడప యోగివేమన యూనివర్సిటీలో విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది.
కదిరికి చెందిన సుల్తానా యోగి వేమన యూనివర్సిటీలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదువుతోంది. తోటి విద్యార్థినులు మెస్‌కు వెళ్లిన సమయంలో హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.