India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మడకశిర మండలంలో ఈనెల 18 పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు మడకశిరలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ధర్మవరం పట్టణం కొత్తపేట రైల్వే స్టేషన్ ఎదురుగా శ్రీనివాస రెడ్డి(58) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి దారుణంగా హత్య చేశారు. ధర్మవరం రెండో పట్టణ పోలీసులు సంఘటనా ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. హత్యకు గల కారణాల గురించి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం అత్యధికంగా తాడిపత్రిలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు బీ.సముద్రం వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త సహదేవ రెడ్డి తెలిపారు. పెద్ద వడుగురు మండలంలో 41.8 డిగ్రీలు, బొమ్మణహల్‌లో 41.6, శెట్టూరులో 41.2, చెన్నేకొత్తపల్లి, శింగనమల, గుత్తి, విడపనకల్ మండలాల్లో 40.2, ధర్మవరంలో 40.8, యాడికిలో 40.6, గుంతకల్లులో 40.3, బీ.సముద్రం మండలంలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు.

తాడిపత్రి రూరల్ యు.పి.ఎస్ పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సంయుక్తంగా ఏడేళ్ల చిన్నారిని కాపాడారు. వివరాల్లోకి వెళ్తే తిప్పాయిపల్లెకి చెందిన ఏడేళ్ల చిన్నారి అవంతిక ఆడుకుంటూ రెండు ఇళ్ల గోడల మధ్య ఉన్న చిన్న సందులో ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న సీఐ లక్ష్మికాంత్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి తాడిపత్రి అగ్నిమాపక సిబ్బందితో పాపను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.

ధర్మవరం పట్టణం బ్రాహ్మణ వీధికి చెందిన కే.మహబూద 465/470 మార్కులతో సత్యసాయి జిల్లా రెండవ ర్యాంకు సాధించింది. పట్టణంలోని ఓ కళాశాలలో ఎంపీసీ మెుదటి సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించింది. విద్యార్థిని మహబూద మాట్లాడుతూ.. ఇంజినీర్ కావడమే లక్ష్యంగా తన చదువును కొనసాగిస్తానని తెలిపారు.

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ పట్టణ వైసీపీ కన్వీనర్ నరేశ్ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బీఎస్పీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించలేని పక్షంలో హిందూపురం నుంచి జగన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.

అనంతపురంలోని టీటీడీ కళ్యాణమండపంలో సివిల్స్ పరీక్షలపై నారాయణ ఐఏఎస్ అకాడమీ ఆదివారం ఒకరోజు ఉచిత వర్క్ షాప్ నిర్వహించింది. కార్యక్రమంలో తెలంగాణ రిటైర్డ్ డీజీ ఏకే ఖాన్ మాట్లాడుతూ.. సాధన కోసం వీలైనంత త్వరగా ప్రిపరేషన్ ప్రారంభించాలన్నారు. ఇందుకోసం ఇంటర్ డిగ్రీ నుంచే దృష్టి సారిస్తే లక్ష్యం సులభతరమవుతుందని తెలిపారు. నారాయణ IAS అకాడమీ DGM, R & D H.శివనాథ్, తదితరులు పాల్గొన్నారు.

ధర్మవరం పట్టణం పోతుకుంటకు చెందిన ఏ.మాధురి సత్యసాయి జిల్లా రెండవ ర్యాంకును సాధించింది. ధర్మవరంలోని ఓ కళాశాలలో ఎంపీసీ విభాగంలో 987/1000 మార్కులు సాధించింది. తండ్రి ఆర్టీసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

గుంతకల్ పట్టణంలోని 4, 6, 18, 30వార్డులకు చెందిన, నెలగొండ, నాగసముద్రం, నక్కనదొడ్డి, N. కొట్టాల, N. వెంకటాంపల్లి గ్రామాలకు చెందిన 200మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను గుంతకల్ మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలకు అందజేశారు. మళ్లీ సీఎంగా జగన్‌ను గెలిపించడానికి తాము రాజీనామా చేసినట్లు తెలిపారు.

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా అనంతపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ మహిళా నాయకురాలు బుల్లె శివబాల నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన నారా లోకేశ్, అచ్చెన్నాయుడికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.