India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కదిరి నియోజక వర్గానికి చెందిన పవన్ కుమార్ రెడ్డికి టీడీపీ రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించినందుకు చంద్రబాబు, లోకేశ్, నియోజక వర్గం అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్, చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కలిశారు. మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిసి తన విజయానికి సహాయం అందించాల్సిందిగా అభ్యర్థించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ధర్మవరం పట్టణం పోతుకుంటకు చెందిన డీ.హమీదా జిల్లా రెండో ర్యాంకు సాధించింది. పట్టణంలోని ఓ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతూ 987/1000 మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. చదువు మధ్యలో తండ్రి చనిపోవడంతో నిరాశ చెందకుండా పట్టుదలతో చదివి తన తల్లి, అన్న ప్రోద్బలంతో ఉన్నతమైన ర్యాంకును సాధించి అందరిచేత ప్రసంశలు అందుకుంది.

గుత్తి జీఆర్పీ పరిధిలోని జక్కలచెరువు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి రైలు నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న జీఆర్పీ ఎస్‌ఐ నాగప్ప.. పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టారు.

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి నియోజవర్గ కేంద్రాలకు నియోజవర్గ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తున్నట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. మే 13న జిల్లాలో పోలింగ్ జరుగనుండగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎంలను జీపీఎస్ ట్రాకింగ్ వాహనాల ద్వారా పోలీస్ బందోబస్తు మధ్య తరలిస్తున్నామన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు ఈ నెల 18 నుంచి 24వ తేదీలోపు చెల్లించాలని డీఐఈఓ రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ప్రథమ ఇంటర్ విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షకు 24వ తేదీలోపు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.

తాడిపత్రి మండలంలో ఇంటర్ విద్యార్థి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని ఇందు ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఫెయిల్ అవుతాననే ఉద్దేశంతో ఫలితాలు వచ్చే రోజు ఉదయమే పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జిల్లాలో అక్రమ మద్యం ఛాయలు కూడా ఉండకుండా గట్టి నిఘా వేసి చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అమిత్ ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని సెబ్ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఆరంభం నుంచి జిల్లాలో సెబ్ విభాగం అధికారులు, బృందాలు జరిపిన దాడులు, నమోదైన కేసులు, నిందితుల అరెస్టులు, బైండోవర్లు, NDPL & DPL సీజర్స్, నాటుసారా స్వాధీనంపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు.

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభ మందిరంలో శనివారం సాయంత్రం తమిళనాడు, కేరళకు చెందిన సత్యసాయి భక్తులు సత్య సాయి బాబాపై భక్తి గేయాలను ఆలపించారు. రెండు రాష్ట్రాలకు చెందిన భక్తులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్నారు.

ధర్మవరం పట్టణం యాదవ వీధికి చెందిన ఒక చిరు వ్యాపారి కూతురు ఓలేటి వర్షిత సత్యసాయి జిల్లా మొదట ర్యాంక్‌ను సాధించింది. పట్టణంలోని ఓ కళాశాలలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్‌లో 466/470 మార్కులు సాధించి ఔరా అనిపించింది. ఇంటర్ ఫలితాలలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. తమ కూతురుకి చదువు చెప్పిన అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.