Anantapur

News April 13, 2024

రేపు అనంతపురం నగరానికి సినీ నటుడు బాలకృష్ణ రాక

image

అనంతపురం నగరంలో ఆదివారం అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రానున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకడానికి పట్టణ టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

News April 13, 2024

ఇంటర్ ఫలితాలు.. పామిడి విద్యార్థికి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు

image

అనంత జిల్లా పామిడికి చెందిన రామచంద్ర నాయక్, రమాదేవి దంపతుల కుమార్తె గీతాంజలి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాలలో 433/440 (బైపీసీ) మార్కులు పొంది రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. ఆమె మాట్లాడుతూ.. తన తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ ఫలితం సాధించగలిగానని తెలిపింది. ఆమెకు కుటుంబసభ్యులు, పట్టణ ప్రజలు అభినందనలు తెలిపారు.

News April 13, 2024

శ్రీ సత్యసాయి: ఇంటర్ ఫలితాలలో టాపర్‌గా నిలిచిన రైతు కూలీ బిడ్డ

image

బత్తలపల్లి మండలానికి చెందిన చెలిమి రామ్మోహన్, ఆదెమ్మల కుమార్తె గౌతమి మండల టాపర్‌గా నిలిచింది. ధర్మవరంలోని కళాశాలలో చదువుతూ ఎంపీసీ మొదటి సంవత్సరంలో 465/470 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు రైతు కూలీలుగా జీవనం సాగిస్తూ తమ బిడ్డను చదివిస్తున్నారు. మండల టాపర్‌గా నిలిచిన గౌతమిని కురుబ కార్పొరేషన్ ఛైర్మన్ కోటి బాబు అభినందించారు.

News April 13, 2024

బాలకృష్ణ నేటి పర్యటన షెడ్యూల్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేపట్టనున్నారు. కదిరిలో ఉదయం 9:30 గంటలకు ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో పూజలు చేయనున్నారు. 11.30 గంటలకు దర్గాలో ప్రార్థనలు, 3 గంటలకు జమ్మిమాను సర్కిల్‌లో ప్రసంగం ఉంటుంది. 5.30 గంటలకు కదిరి నుంచి కొత్తచెరువు మీదుగా పుట్టపర్తికి చేరుకుని 6.30 గంటలకు ప్రసంగించనున్నారు.

News April 13, 2024

ఉరవకొండ మండలంలో రోడ్డు ప్రమాదం

image

ఉరవకొండ మండలం పెన్నహోబిలం సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన బొలెరో వాహనం నిలిపి మధ్యలో రాళ్లు పెట్టడంతో ఉరవకొండ నుంచి మదనపల్లికి బైక్‌పై వెళ్తున్న గిరీష్ బాబు, ఆంజనేయులు వాటిని ఎక్కించి కిందపడ్డారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బోలెరో డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

News April 13, 2024

ఎన్నికల విధులకు హాజరు కాకుంటే సస్పెన్షన్ తప్పదు: కలెక్టర్

image

ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది విధులకు హాజరు కాకపోతే సస్పెండ్ చేస్తామని సత్యసాయి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల రిటర్నింగ్ అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బందికి ఇప్పటికే ఒక విడత శిక్షణ పూర్తి చేశామని, మరోసారి శిక్షణ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

News April 13, 2024

అనంత: పెన్నానది నీటిలో మృతదేహం లభ్యం

image

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం సమీపంలోని పెన్నానదిలో శుక్రవారం ఓ గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. అక్కడి స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వ్యక్తి వివరాల కోసం విచారణ చేపట్టినట్లు అర్బన్ సీఐ సురేష్ బాబు తెలిపారు.

News April 13, 2024

శ్రీ సత్యసాయి: ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యాయత్నం

image

చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన చైతన్య, ధర్మవరం మండలం నిమ్మలకుంటకు చెందిన మానస అనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేశారు. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో వారు ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది సూపర్ వాస్మోల్ ద్రావణాన్ని తాగారు. వారిని కుటుంబ సభ్యులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది.

News April 13, 2024

మొదటి విడత ఈవీఎం రాండమనైజేషన్ ప్రక్రియ పూర్తి: కలెక్టర్

image

ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఈవీఎం రాండమనైజేషన్ ప్రక్రియ నిర్దేశిత వైబ్ సెట్ లో పూర్తి అయిందని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఈ ఎం ఎస్ 2 వ నిర్దేశిత వెబ్ సైట్ లో మొదటి విడత ఈవీఎం రాండమనైజేషన్ ప్రక్రియ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి అయిందని కలెక్టర్ పేర్కొన్నారు.

News April 12, 2024

రోజువారి నివేదికలను ఎన్నికల కమిషన్ కు పంపించాలి: కలెక్టర్

image

ఎన్నికల కంట్రోల్ రూమ్ నుంచి రోజు వారి నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు పంపించాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఎన్నికల నివేదికల సమర్పణ, సీ విజిల్, సువిధ యాప్, కంట్రోల్ రూమ్ నిర్వహణ, తదితర అంశాలపై కంట్రోల్ రూమ్ నుంచి రోజు వారి నివేదికలను కమిషన్‌కు పంపించాలని తెలిపారు.