India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లాలో మంగళవారం పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన బయోలాజికల్ సైన్స్ పరీక్షకు 3,074 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవింద నాయక్ తెలిపారు. మొత్తం 31,330 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 30,944 మంది, 5,057 మంది ప్రైవేట్ విద్యార్థులకు గాను 2,369 మంది హాజరయ్యారని తెలిపారు.
ఎన్నికల సమయంలో ప్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై నిఘా ఉంచి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ పోలీస్ వ్యవస్థ చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన 15 మంది వాలంటీర్లు, ముగ్గురు మున్సిపల్ సిబ్బందిని తొలగిస్తూ కలెక్టర్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. వారిలో బొమ్మనహాళ్ మండలం డి.హోన్నూరుకు చెందిన వాలంటీర్లు, తాడిపత్రి పురపాలికకు చెందిన ఒప్పంద ఉద్యోగులు రామరాజు, వెంకటరమణ, మధుసూదన్‌రెడ్డి ఉన్నారు. ఇప్పటి వరకు 36 మంది వాలంటీర్లు, ఐదుగురు రేషన్‌డీలర్లు, ఏడుగురు ఒప్పంద ఉద్యోగులు, ఒక రెగ్యులర్ ఉద్యోగిని తొలగించారు.
ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సమీక్ష నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారులతో పాటు సెక్టార్ అధికారులతో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ కొండయ్యలు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా బీవీ వెంకటరాముడును నియమిస్తూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీచేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ కార్యదర్శి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
హిందూపురం పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నానని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. బీజేపీ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని ఆయన భావించారు. అయితే పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థి బీకే.పార్థసారథిని కూటమి ఖరారు చేసింది. ఆశించిన టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని పరిపూర్ణానంద నిర్ణయించుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నామినేషన్ వేస్తానంటున్నారు.
రంజాన్ మాసం సందర్భంగా కదిరిలో ముస్లిం మైనార్టీల కోసం ఏప్రిల్ 1న ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ విందులో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన వేదికను పరిశీలించేందుకు సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం సోమవారం కదిరికి విచ్చేశారు. కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీఎస్ మక్బూల్ అహ్మద్‌తో కలిసి కదిరి-మదనపల్లి రోడ్‌లోని పీవీఆర్ ఫంక్షన్ హాలును పరిశీలించారు.
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు రామిరెడ్డి మరణించిన సందర్భంగా.. ఈరోజు (మంగళవారం) ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.పుల్లారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు సహకరించాలని కోరారు.
కదిరి పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాల అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శేష వాహనంపై స్వామి వారిని ఊరేగింపు నిర్వహించారు. ఆలయంలో అర్చకులు విశేష పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం మాడవీధుల్లో ఊరేగింపు చేశారు. ఊరేగింపు సందర్భంగా భక్తులు పూజలు చెల్లించుకున్నారు.
రాయదుర్గంలోని మధుగులమ్మ దేవాలయం వద్ద ఓ సోమవారం సాయంత్రం చిన్నారిని గుర్తుతెలియని తల్లిదండ్రులు వదిలి వెళ్ళారు. పాప ఏడుపును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు దేవాలయం వద్దకు చేరుకొని రోడ్డుమీద ఏడుస్తున్న రెండు ఆ చిన్నారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.