India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లాలో 5 ప్రాంతాలలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన స్థానంలోని ప్రధాన శాస్త్రవేత్త సహదేవరెడ్డి, వాతావరణ విభాగం శాస్త్రవేత్త నారాయణస్వామి సోమవారం తెలిపారు. శింగనమల 40.8, యాడికి 40.2, గుంతకల్ 40.1, బొమ్మనహల్ 40, శెట్టూరు 39.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు వారు తెలిపారు.
నల్లమాడ మండలం కొట్టాలపల్లికి చెందిన అమర్నాథ్ రెడ్డిని కేవలం వ్యక్తిగత కారణాలతోనే గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని ప్రాథమిక విచారణలో వెల్లడైందని డీఎస్పీ వాసుదేవన్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి అమర్నాథ్ రెడ్డి హత్య జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ వాసుదేవన్ మాట్లాడుతూ.. హత్యలో ఎటువంటి రాజకీయ కోణం లేదని, కేవలం వ్యక్తిగత కారణాలతోనే చంపి ఉండవచ్చన్నారు.
నల్లమాడ మండల పరిధిలోని కుటాలపల్లిలో టీడీపీ నాయకుడు అమర్నాథ్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని తోట వద్ద నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
టీడీపీ అధిష్ఠానం ప్రకటించిన మూడో జాబితాలో గుమ్మనూరు జయరామ్‌కు చోటు దక్కలేదు. గుంతకల్లు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆయనకు ఐవీఆర్ఎస్ సర్వేలో అనుకూలత లేదని సీటు నిరాకరించినట్లు సమాచారం. ఇప్పటికే గుంతకల్లులో పార్టీ కార్యాలయం స్థాపించి గుమ్మనూరు సోదరులు ప్రచారాలు సైతం నిర్వహించారు. అయితే అక్కడి స్థానిక నేతల నుంచి వ్యతిరేకత, ఐవీఆర్ఎస్ సర్వేల ఆధారంగా గుమ్మనూరుకు టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది.
రొళ్ల మండలం దొడ్డేరి పంచాయతీలో ANM, వైద్యుల నిర్లక్ష్యం పసికందు(నెల)ను బలి తీసుకుంది. పంచాయతీ పరిధిలోని పిల్లిగుండ్లు గ్రామానికి చెందిన రాధమ్మ, దొడ్డ హనుమ దంపతులకు జన్మించిన పసికందుకు ANM వరలక్ష్మి ఈనెల 23న 3 వ్యాక్సిన్‌లు వేశారు. అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున పసికందు మరణించింది. తమ బిడ్డ మరణానికి ANM, వైద్యులే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.
తాడిపత్రి మండలంలోని గంగాదేవిపల్లికి నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగరాజు ఐచర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇటీవల నంద్యాలలో పెళ్లి సంబంధం కుదిరింది. కొన్ని కారణాలతో ఆ సంబంధం ఆగిపోయింది. దీంతో యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై తెల్లవారుజామున ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు.
ఈ నెల 26, 28వ తేదీన జరగాల్సిన ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం 25న నిర్వహిస్తున్నట్లు డీవీఈవో వెంకట నాయక్ తెలిపారు. 26న రసాయన శాస్త్రం, చరిత్ర 28న బాటనీ, జువాలజీ, కామర్స్ సబ్జెక్టుల మూల్యాంకనం జరగాల్సి ఉండగా ఆయా సబ్జెక్టులను 25నే నిర్వహిస్తున్నట్లు వివరించారు. అధ్యాపకులు, అధికారులు హాజరుకావాలని కోరారు.
అనంతపురం జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 1,284 మద్యం కేసులు నమోదయ్యాయని అనంతపురం ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 1,272 మందిని అరెస్టు చేసి 206 వాహనాలు సీజ్ చేశామన్నారు. ఎన్నికల దృష్ట్యా జిల్లాలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. జిల్లా సరిహద్దుల్లో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి చెక్ పోస్టులో ఆరుగురు సిబ్బంది పనిచేస్తారని వెల్లడించారు.
వైసీపీ నాయకుల మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. నల్లమాడ మండలం దొన్నికోటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పుట్టపర్తి టీడీపీ, జనసేన, ఉమ్మడి అభ్యర్థికి పల్లె సిందూరకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కనగానపల్లి మండలంలోని మద్దెలచెరువు తండాలో మాజీ మంత్రి పరిటాల సునీత పర్యటించారు. లంబాడి మహిళల సంప్రదాయ దుస్తులతో ఎన్నికల ప్రచారం నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం మద్దెలచెరువు తండాకు చెందిన మహిళలు సునీతకు తమ సంప్రదాయ దుస్తులు అందజేసి కాసేపు పాటలు పాడారు.
Sorry, no posts matched your criteria.