India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పరిగి మండలం ఎర్రగుంట్ల సచివాలయ పరిధిలో పనిచేస్తున్న సర్వేయర్ రాజేశ్వరి సోమవారం రాత్రి మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సర్వేయర్ మృతి పట్ల తోటి ఉద్యోగులు సంతాపం తెలిపారు.

పుట్టపర్తి టౌన్ క్రోధినామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ఈ ఉగాది అందరి జీవితాల్లో ఉషస్సులు నింపాలని కలెక్టర్ అరుణ్బాబు, ఆకాంక్షించారు. క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీస్, జిల్లా యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కొత్త ఆలోచనలతో ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని పిలుపునిచ్చారు. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.

శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్‌కు హాజరైన ప్రతి ఒక్కరితో పాటు మినహాయింపు పొందిన వారు కూడా ఎన్నికల శిక్షణకు తప్పక హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల వద్ద జరిగే శిక్షణకు కచ్చితంగా హాజరుకావాలన్నారు. హాజరు కాని వారిపై ఎన్నికల నియమ నిబంధనలు ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలకు, జిల్లా పోలీస్ సిబ్బందికి ఎస్పి మాధవరెడ్డి శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగతో అందరి జీవితాల్లో వెలుగు రావాలని, చీకట్లను పారద్రోలి ప్రజల జీవితాల్లో మరిన్ని కాంతులు వెదజల్లాలని కోరారు. ఎన్నికల దృష్ట్యా నియమ నిబంధనలతో పండుగలు జరుపుకోవాలని , గొడవలకు అల్లర్లకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు.

ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే విధంగా అందరూ సహకరించాలని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం హిందూపురంలో సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో కలిసి కవాతు నిర్వహించారు. శాంతి భద్రతలను కాపాడడానికి కేంద్ర బలగాల పోలీసులతో కవాతు నిర్వహించామని ఎస్పీ తెలిపారు.

పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ అమిత్ బర్దర్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్ఐ, ఆ పైస్థాయి పోలీసు అధికారులతో కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నియమ నిబంధనలను తూ.చా తప్పకుండా పాటించాలని, ఎంసీసీ ఉల్లంఘనపై సకాలంలో చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎన్నికల కోడ్‌ను ప్రతి ఒక్కరూ పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

శింగనమల నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ పామిడి శమంతకమణి, ఆమె కుమారుడు బలపనూరు అశోక్ వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా పత్రాన్ని మీడియాకు విడుదల చేశారు. వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడికి రాజీనామా పత్రాన్ని పంపుతున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

పెనుకొండ మండల జెడ్పీటీసీ గుట్టూరు శ్రీ రాములు గుండె పోటుతో సోమవారం మృతి చెందారు. గతంలో ఆయన 2005లో పెనుకొండ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీలో క్రియాశీలకంగా పని చేశారు. గత కొంత కాలం కిందట గుండె పోటుకు గురయ్యారు. అయితే హఠాత్తుగా ఆయన మృతి చెందారు.

అనంతపురం ఆర్టీసీ బస్టాండులోని బస్సు ప్లాట్‌ఫాం మీదకు దూసుకొచ్చింది. హిందూపురం డిపోకు చెందిన బస్సు అనంతపురం బస్టాంపు వద్దకు చేరగానే డ్రైవర్ బ్రేక్ వేసినా పడకపోవడంతో ప్లాట్‌ఫాం పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వైద్య విద్యార్థిని వీణ కాలికి స్వల్ప గాయాలయ్యాయి.

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 25 ఏపీ మోడల్ స్కూల్‌లలో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఒక్కో పాఠశాలలో ఆరో తరగతికి 100 సీట్లు కేటాయించారు. మొత్తం 25 పాఠశాలల్లో 2500 సీట్లు గాను, 5137 దరఖాస్తులు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 21న ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి అర్హులైన వారికి సీట్లు కేటాయిస్తారు.
Sorry, no posts matched your criteria.