India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 703 లైసెన్స్ హోల్డర్లు ఉండగా, 654 లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ చేయించామని ఎస్పీ అన్బురాజన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. లైసెన్స్ ఉన్నప్పటికీ ఎన్నికలు ప్రక్రియ ముగిసే వరకు ఆయుధాలు పోలీస్ శాఖ వద్ద డిపాజిట్ చేయాలని సూచించారు.
అనంతపురం జిల్లాలో పాఠశాల, జూనియర్ కళాశాల విద్యా ప్రిన్సిపల్
సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ ఈ నెల 23వ తేదీన పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం పంపించారు. జిల్లాలోని పలు పాఠశాలలను ఆయన తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై ఆయన అక్కడికక్కడే చర్యలు తీసుకొంటామన్నారు.
అనంతపురం జిల్లాలో అనధికారికంగా ఆయుధాలు వున్నట్లు తెలిస్తే 9440796800 లేదా పోలీసు స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 9392918293 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ అన్బురాజన్ కోరారు.
జిల్లాలో 703 మంది వద్ద 734 ఆయుధాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 654 ఆయుధాలు డిపాజిట్ చేసినట్లు తెలిపారు. 77 ఆయుధాలు బ్యాంక్ సెక్యూరిటీ దగ్గర ఉన్నాయన్నారు.3 మాత్రంమే డిపాజిట్ చేయాల్సి ఉందని వెల్లడించారు.
తాడిపత్రిలో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని జయనగర్ కాలనీకి చెందిన రమాదేవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు వెంటనే తాడిపత్రి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ధర్మవరం పట్టణం ఇందిరానగర్‌కు చెందిన వంశీకృష్ణ అనే యువకుడు గురువారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పి వంశీకృష్ణను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. వంశీకృష్ణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని పోలీసులు జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో జల్లెడ పట్టారు. రహదారులు, ప్రధాన కూడళ్ళలో వెళ్తున్న బస్సులు, లారీలు, కార్లు ,ఆటోలు, ద్విచక్ర వాహనాలను తనిఖీలు నిర్వహించారు.
అనంతపురం లోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలో 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజులు చెల్లింపునకు ఈనెల 26 వరకు గడువు పొడిగించినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవి రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గడువులోపు ఫీజు చెల్లించాలన్నారు.
రైలు ఢీకొని విధ్యార్థి మృతిచెందిన ఘటన బుధవారం జరిగింది. రైల్వే పోలీసుల వివరాలు.. ఎన్పీకుంట మండలం వంకమద్దికి చెందిన పవన్(17) తిరుపతిలో ఇంటర్ పరీక్షలు రాసి 3రోజుల క్రితం తలుపుల(M) ఎగువపేటలోని మేనమామ ఇంటికి వచ్చాడు. బుధవారం కదిరికి వచ్చిన అతడు హెడ్‌ఫోన్ పెట్టుకుని రైల్వేపట్టాలపై నడుచుకుంటూ మాట్లాడుతుండగా రైలు ఢీకొంది. ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు.
రాయదుర్గం రూరల్ మండల పరిధిలోని కొంతానపల్లిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న ఇరు వర్గాల ఘర్షణలో 13మందిపై కేసు నమోదుచేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. పొలం విషయంలో కొందరు వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారన్నారు. ఇరు వర్గాల దాడిలో పలువురు గాయపడ్డారు. పరస్పర ఫిర్యాదుల మేరకు 13 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనంతపురం నగరంలోని పాతూరు మార్కెట్లో కూరగాయల ధరల వివరాలు… టమాటాలు (మేలు రకం) ₹20, రెండో రకం ₹10, మిరపకాయలు ₹50, ఉల్లిపాయలు (మేలు రకం) ₹25, రెండో రకం ₹15, ఆలుగడ్డలు ₹35, బీన్స్ ₹60, క్యారెట్ (మేలు రకం) ₹42, రెండో రకం ₹30, వంకాయలు ₹30, బెండకాయలు ₹40, ముల్లంగి ₹40, బీట్ రూట్ ₹40, బీరకాయలు ₹40, చౌళేకాయలు ₹40, కాకరకాయలు ₹40, క్యాబేజీ ₹40, మునక్కాయలు ₹60, నిమ్మకాయ (వంద) ₹350, అల్లం (కొత్తది) ₹140.
Sorry, no posts matched your criteria.