India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో ఈ ఏడాది లోనే తొలిసారి 44.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకుల కుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. తాడిపత్రి, శింగనమలలో 44.0 డిగ్రీలు, గుంత కల్లు, కదిరిలో 43.5, పుట్లూరు, చెన్నేకొత్తపల్లి 43.4, ధర్మవరం 43.3, సెట్టూరు, పుట్టపర్తి 43.0, తలుపుల 42.9, యల్లనూరు 42.7, కూడేరు 42.6, అనంతపురం 42.5, ఉష్ణోగ్రత నమోదైంది.

అనంతలోని రూడ్సెట్ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు ఉచితంగా టైలరింగ్, బ్యూటీ పార్లర్ శిక్షణ కల్పిస్తున్నట్లు డైరెక్టర్ ఎస్. విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 20 నుంచి 30 రోజుల పాటు శిక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి కల్పిస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు చెందిన వారు 19 నుంచి 45 సం. వయస్సు ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని హుస్నాబాద్ సమీపంలోని ఓ వర్గం శ్మశాన వాటిక వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘర్షణ చోటు చేసుకుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు గొడవకు దిగారు. బందోబస్తుకు వెళ్లిన ఏఎస్ఐ, పలువురు కానిస్టేబుల్ లపై ఆందోళన కారులు దాడులు నిర్వహించారు. దీంతో గాయపడ్డ పోలీసులను ఆసుపత్రికి తరలించారు.

అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరిని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ శనివారం సస్పెండ్ చేశారు. గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామ వాలంటీరు పి.రమేశ్, యాడికి మండలం రాయలచెరువు-7 అంగన్‌వాడీ వర్కర్ పి.అనసూయ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇదిలా ఉండగా.. ఎఫ్‌ఎస్, ఎస్‌ఎస్ టీముల ద్వారా ఇప్పటి వరకు రూ.2,05,00,563 నగదు సీజ్ చేశారు.

ఎన్నికలకు అన్నిరకాల పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టామని
జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతపురం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
 ఎన్నికల సంసిద్ధత, ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్ఠంగా అమలు, ముందస్తు ఏర్పాట్లు, తదితర అంశాలపై  కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

అనంతపురం జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా నూతన కలెక్టర్, ఎన్నికల అధికారి డా.వి.వినోద్ కుమార్‌ని శనివారం రాయదుర్గం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిని కరుణకుమారి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో ఆమెతో పాటు గుంతకల్లు, తాడిపత్రి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు వి.శ్రీనివాసులు రెడ్డి, రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు.

అనంతపురంలో టమాటా ధర కొండెక్కింది. కిలో ధర రూ.50కు చేరింది. నెలలుగా కిలో రూ.20లు దాటని ధర అమాంతం పెరిగింది. టమాటా సాగు చేస్తున్న రైతులు, టోకు వ్యాపారులను పెరిగిన టమాటా ధర ఆనందం కల్గిస్తుంటే.. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉరవకొండ పట్టణంలోని మల్లేశ్వర ఆలయ సమీపంలో నివసిస్తున్న దునోజ్ కుమార్(18) మూడు రోజుల కిందట వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఉన్న ఒక కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు మల్లికార్జున, రేణుకమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు.

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో సమ్మెటివ్-2 పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతాయని డీఈఓ మీనాక్షి తెలిపారు. 1 నుంచి 9వ తరగతులకు – ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. 6 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయన్నారు. ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని డీఈఓ ఆదేశించారు.

సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూమ్ నుంచి రోజు వారి నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు పంపించాలని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఎన్నికల నివేదికల సమర్పణ, సి విజిల్, సువిధ యాప్, కంట్రోల్ రూమ్ నిర్వహణ, తదితర అంశాలపై ఎన్నికల కంట్రోల్ రూమ్ నుంచి నివేదికలు పంపించాలన్నారు.
Sorry, no posts matched your criteria.