Anantapur

News March 20, 2024

శ్రీసత్యసాయి: ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష

image

ఎన్నికల సంసిద్ధతపై సత్యసాయి కలెక్టర్ కార్యాలయ అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, డీఆర్ఓ కొండయ్య తదితరులతో ఎన్నికల కమిషనర్ పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.

News March 19, 2024

రొళ్ల మండలంలో యువతి మృతి

image

రొళ్ల మండలం కాకి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన శివన్న, రాధమ్మ దంపతుల కుమార్తె మేఘన (19) మంగళవారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రొళ్ల ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిరకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2024

కారు-బైక్ ఢీ.. ఓ యువకుడి స్పాట్ డెడ్

image

కూడేరు మండలం ఉదిరిపికొండ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిని జల్లిపల్లి గ్రామానికి చెందిన పవన్ (22)గా స్థానికులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

ఈనెల 30న హిందూపురం బస్సు యాత్రలో CM జగన్

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో ఈ నెల 30న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి టి.ఎన్. దీపిక తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలో బస్సు యాత్ర, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బస్సు యాత్రకు జిల్లా వైసీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News March 19, 2024

అనంత: ఫోన్ హ్యాక్ చేసి రూ.1,73,100లు చోరీ

image

గార్లదిన్నె మండలం పెనకచర్ల డ్యాం గ్రామానికి చెందిన షేక్ జిలాన్ బాషాకు అనంతపురంలో యాక్సెస్ బ్యాంకు అకౌంట్ ఉంది. శనివారం రాత్రి ఖాతా నుంచి రూ.1,73,100 దొంగలించినట్లు బాధితుడు వాపోయాడు. దీనిపై సైబర్ క్రైమ్ నంబర్ 1030తోపాటు గార్లదిన్నె పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ లింకు పంపించి క్లిక్ చేయగానే ఫోను హ్యాక్ చేసి దొంగలించినట్లు పేర్కొన్నారు.

News March 19, 2024

ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నియామకం..

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించినట్టు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. పెనుకొండకు సబ్ కలెక్టర్, హిందూపురానికి జాయింట్ కలెక్టర్, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాలకు ఆయా ఆర్డీవోలు, మడకశిరకు అహుడా కార్యదర్శి గౌరీ శంకర్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. హిందూపురం పార్లమెంటుకు కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు.

News March 19, 2024

అనంత: దొంగతనానికి వచ్చి..  విగత జీవిగా మారాడు

image

బత్తలపల్లి సమీపంలోని నార్సింపల్లి రోడ్డు వద్ద సోమవారం పొలంలో విద్యుత్ తీగలు చోరీ చేయడానికి వచ్చి శ్రీరాములు(32) అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడని బత్తలపల్లి ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. బాధితుడు పుట్టపర్తి మండలం ఎనుములపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించమన్నారు. కుటుంబ సభ్యులతో గొడవపడి గత ఆరు నెలలుగా ఇంటికి వెళ్లడం లేదన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 19, 2024

అనంత: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

image

చెన్నై కొత్తపల్లి హైవేపై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బెంగళూరు నుంచి అంబులెన్స్‌లో ఓ వ్యక్తి మృతదేహాన్ని తాడిపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి చెన్నై కొత్తపల్లి సమీపంలో ముందు వెళ్తున్న బస్సుని అంబులెన్స్ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

News March 19, 2024

REWIND: అనంతపురం MPగా హైదరాబాద్ రాజు

image

హైదరాబాద్ రాజు మన అనంతపురం ఎంపీగా పని చేశారని మీకు తెలుసా? ఇది నిజమే. హైదరాబాద్ సంస్థానం 1948లో భారత దేశంలో విలీనమైంది. ఆ తర్వాత నిజాం చివరి పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్(6వ నిజాం) 1957లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కర్నూలు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అలాగే 1962లో అనంతపురం ఎంపీగా ఎన్నికయ్యారు. రానున్న ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో కామెంట్.

News March 19, 2024

ఈవిఎం గోడౌన్లను పరిశీలించిన కలెక్టర్

image

అనంతపురంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ లో ఉన్న ఈవీఎం గోడౌన్లను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమి తనిఖీ చేశారు. జిల్లా స్థాయి అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.