India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలంలో విషాద ఘటన జరిగింది. శివారెడ్డి భార్య పవిత్ర (32) ఏడు రోజుల బాలింత లివర్ ఇన్ఫెక్షన్తో మృతి చెందారు. ఆమె వారం రోజుల క్రితం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం దద్దుర్లు, ఇన్ఫెక్షన్తో ఆమె బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు వైద్యుల సూచనలు మేరకు బెంగళూరుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తాడిపత్రిలో పోలీసుల తీరు దుర్మార్గంగా ఉందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. తాను తాడిపత్రికి వెళ్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో తమ నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కొన్ని చోట్ల వారి ఇళ్లను కూడా కూలుస్తున్నారని వాపోయారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, అధికారులు చట్టానికి లోబడి పనిచేయాలని హితవు పలికారు.
నాటుసారా రహిత అనంత జిల్లాను తయారు చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో నవోదయం 2.0పై ఎస్పీ జగదీశ్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్ణాటక సరిహద్దులో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది చురుకుగా పనిచేయాలన్నారు. అందరూ సమష్ఠిగా కృషి చేసి, లక్ష్యం చేరుకోవాలని సూచించారు.
అనంతపురం జిల్లాలో ఇవాళ (బుధవారం) శివరాత్రి ఉత్సవాలు జరగనున్న ప్రధాన శివాలయాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ప్రజలందరు శివరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ఆలయాల వద్ద పోలీసుల సూచనలు పాటిస్తే ఏ ఇబ్బందీ లేకుండా కార్యక్రమాలు సజావుగా సాగుతాయని వెల్లడించారు.
ప్రజలు సైబర్ మోసాలతో ఎంతో మంది ఇబ్బంది పడ్డారని ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో సైబర్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ముఖ్యంగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ మోసాలపై వివరించాలన్నారు. అనుమానితుల నుంచి ఫోన్ కాల్స్ వస్తే పోలీసులను సంప్రదించాలన్నారు.
గ్రామాల్లో సచివాలయ మహిళా పోలీసులు ఇంటింటికీ వెళ్లి సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించాలని ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. అనంతపురం జేఎన్టీయూ ఆడిటోరియంలో మహిళా పోలీసులకు వర్క్‌షాప్ నిర్వహించారు. అందరూ గ్రామాల్లో తప్పనిసరిగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా మహిళలకు సెల్ ఫోన్, మొబైల్ యాప్స్ ద్వారా జరిగే నష్టాలను వివరించాలన్నారు.
☛ తాడిపత్రిలో సినీ నటి మాధవీలతపై కేసు నమోదు
☛ హిందూపురం మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతి
☛ మంత్రి పయ్యావుల కేశవ్ చొరవతో HLCకి నీరు విడుదల
☛ ఉల్లికల్లులో ఉరివేసుకొని హరి అనే వ్యక్తి ఆత్మహత్య
☛ తాడిపత్రి మండలంలో ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
☛ ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన అనంతపురం కలెక్టర్
☛ గుత్తి-తాడిపత్రి మధ్య డ్రోన్ నిఘా
☛ అనంతపురంలో రైలు కింద పడి యువకుడి మృతి
అనంతపురం జిల్లా తాడిపత్రిలో సినీ నటి మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి మహిళలను కించపరిచేలా ఆమె మాట్లాడారని ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు చేశారు. దీంతో మాధవీలతపై కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ పోలీసులు తెలిపారు.
జనసేన ఆవిర్భావ వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. అనంతపురం పార్లమెంట్‌కు టీసీ వరుణ్, హిందూపురం పార్లమెంట్‌కు చిలకం మధుసూదన్ రెడ్డి నియమితులయ్యారు. వీరు నియోజకవర్గాల నేతలతో సమన్వయం చేసుకుని మార్చి 14న పిఠాపురంలో జరగనున్న ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
శింగనమల నియోజకవర్గం నార్పలలో మట్టి పవన్ అనే యువకుడి <<15562592>>హత్య<<>> కేసులో ఐదుగురికి జీవిత ఖైదు శిక్ష పడిన విషయం తెలిసిందే. 2020లో పవన్‌ను స్టీల్ రాడ్డు, కర్రలతో దారుణంగా కొట్టి హత్య చేశారు. ముద్దాయిల్లో ఒకరైన సుధాకర్ దాడి దృశ్యాలను చిత్రీకరించాలని స్నేహితులకు సూచించారు. ‘ఈ వీడియో చూసినవారు మనమంటే భయపడాలి. సుధాకర్ అంటే ఒక బ్రాండ్’ అంటూ చితకబాదారు. ఇప్పుడు ఆ వీడియో ఫుటేజీ సాక్ష్యంగానే జడ్జి తీర్పు చెప్పారు.
Sorry, no posts matched your criteria.