Anantapur

News March 7, 2026

100% పంటల సాగు వివరాలు ఈ-క్రాప్‌లో నమోదు: JDA రవి

image

రబీ 2025-26 సీజన్ ఈ-క్రాప్ సవరణ కోసం ఇది చివరి అవకాశం ఈనెల 16న జరగుతుందని, ఆ తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవని JDA రవి తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 100% పంటల సాగు వివరాలు ఈ-క్రాప్‌లో నమోదు చేశామన్నారు. ఖరీఫ్-2025కు సంబంధించి మన జిల్లాలో ఇప్పటివరకు 100 శాతం సర్వేలో భాగంగా 5,91,938 రైతుల LP నంబర్లలో సర్వే చేశామన్నారు.

News March 7, 2026

రేకులకుంటలో అంగన్వాడీ కేంద్రం తనిఖీ

image

బుక్కరాయసముద్రం మండలం రేకులకుంటలో అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆనంద్ తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో వయసుకు తగ్గ ఎత్తు, బరువు పిల్లలు ఉన్నారా, లేదా అని పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారా అంటూ ఆరా తీశారు. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు మంచి భోదన అందజేయాలన్నారు.

News March 7, 2026

అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

image

అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్‌ను శనివారం జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్‌లో వడ్డించే అల్పాహారం నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. క్యాంటీన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా మెలగాలని సిబ్బందికి సూచించారు. అక్కడ అందుతున్న సేవలపై నేరుగా ప్రజలను అడిగి ఆరా తీశారు. పేదలకు నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.

News March 7, 2026

సమన్వయంతో విజయవంతం చేయండి: కలెక్టర్

image

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఐసీడీఎస్, డీఆర్డీఏ, మెప్మా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డీఆర్డీఏ, మెప్మా సంబంధిత శాఖల సమన్వయంతో ప్రతీ సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు.

News March 6, 2026

నిధులు విడుదల చేయండి: మంత్రి, ఎమ్మెల్యేలు

image

అనంతపురంలోని నడిమి వంక, మరువ వంక ప్రొటెక్షన్ వాల్స్ కోసం రూ.79.46 కోట్ల కేటాయించాలని సీఎం చంద్రబాబుకు MLA దగ్గుపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అలాగే మున్సిపాల్టీలో అభివృద్ధి పనుల కోసం పెండింగ్‌లో ఉన్న రూ.18.84 కోట్ల విడుదల చేయాలని కోరారు. శిల్పారామంలో మౌళిక వసతుల కల్పన కోసం రూ.9.95 కోట్లు కేటాయించాలని సీఎంను విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని MLA తెలిపారు.

News March 6, 2026

అనంత విద్యార్థులకు ఇన్‌ఫోసిస్‌లో ఉద్యోగాలు

image

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటారు. Infosys కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 8మంది ఎంపికయ్యారు. వీరికి రూ.6.25 లక్షల వార్షిక వేతనం లభించినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ చిత్ర తెలిపారు. ఎంపికైన వారిని వీసీ హంచాటే సుదర్శనరావు, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు. విద్యార్థులు తమ నైపుణ్యాలతో మంచి అవకాశాలు దక్కించుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.

News March 5, 2026

బుక్కరాయసముద్రం: 10 నుంచి ఉచిత శిక్షణ

image

బుక్కరాయ సముద్రం ఆర్డీటీ స్కూల్లో ఈ నెల 10వ తేదీ ఇగ్నైట్ వ్యాపార శిక్షణ నిర్వహిస్తున్నట్లు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో చంద్రమౌళి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులను వ్యాపారవేత్తలుగా మార్చడానికి ఐదు రోజులు శిక్షణ అందిస్తున్నామన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు గల దివ్యాంగులు ఈ శిక్షణకు అర్హులని చెప్పారు. ఉచిత వసతి, భోజనం సదుపాయాలు కల్పిస్తామన్నారు.

News March 5, 2026

తాడిపత్రిలో రైలు పట్టాలపై పడుకుని..!

image

తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్డు రైల్వే గేట్ సమీపంలో ఓ వ్యక్తి గురువారం హల్‌చల్ చేశాడు. రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన గూడ్స్ రైలు పైలట్ అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేశాడు. అనంతరం ఆ వ్యక్తిని హెచ్చరించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పుట్లూరు రోడ్డు రైల్వే గేట్ సుమారు 10 నిమిషాలు ఆలస్యంగా తెరుచుకుంది.

News March 5, 2026

అనంత: పక్కాగా జనగణన

image

అనంతపురం జిల్లాలో 16వ జనగణన కార్యక్రమాన్ని సమగ్రంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ అధికారులకు సూచించారు. జనగణన ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు మొదటి దశలో హౌస్ లిస్టింగ్ నిర్వహించి ప్రతి ఇంటి వివరాలు నమోదు చేయాలని చెప్పారు. డేటా సేకరణలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించి ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.

News March 5, 2026

సీఎంతో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం

image

అమరావతి ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పెండింగ్ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతపురం ప్రగతికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీఎం కీలక దిశానిర్దేశం చేశారు.