India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాయదుర్గం పట్టణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని బళ్లారి రోడ్డు సీతారామాంజనేయ కళ్యాణమండపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్వామా హాలు నుంచి సీతారామాంజనేయ కళ్యాణ మంటపానికి మార్చినట్లు కలెక్టర్ అధికార వర్గాలు తెలిపాయి. ప్రజలు ఈ స్థల మార్పును గమనించాలని కోరారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
గుత్తి ఆర్ఎస్‌లో చెత్త పడేసే విషయంలో ఇరువర్గాల మధ్య ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. ఇంటిముందు చెత్త పడేశారని వంశీ, అతని తల్లి సాయమ్మపై రిజ్వానా, రసూల్ కత్తితో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వంశీ, సాయమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం రెఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
అనంతపురంలోని JNTU-OTPRIలో శనివారం ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శన రావు పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉద్యోగం కోసం కాకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ వీసీతో పాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
గుత్తి మండలం చెర్లోపల్లి సేవాఘడ్‌లోని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్‌ను శనివారం అనంత ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ దర్శించుకున్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనంతరం కలెక్టర్‌కు ఆలయ కమిటీ సభ్యులు డోలు, కత్తిని అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలను లోకల్ ఫెస్టివల్‌గా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
అనంతపురం JNTUలోని మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు కళ్యాణి రాధ, ఓం ప్రకాశ్‌ను శనివారం ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు. NIT-Rలో ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో వారు ప్రదర్శించిన టెక్నికల్ పేపర్ మీద వారికి NIT-R నుంచి సర్టిఫికెట్, అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చెన్నారెడ్డి మాట్లాడుతూ.. రానున్న రోజులలో మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు.
ఫిబ్రవరి 17న రాయదుర్గం పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 17న ఉదయం 9 గంటలకు ఏపిడి డ్వామా కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తామని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అనంతపురంలో మేధావులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేసిందన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ, మౌలిక సదుపాయాల కల్పనను సమన్వయం చేసుకుంటూ సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. సినీ నటి మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ తనను కించపరిచేలా మాట్లాడారని, ఆయన అనుచరులు, అభిమానులు తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
యాడికి మండలం కుర్మాజీపేటకు చెందిన లారీ డ్రైవర్ రాజు మృతిచెందారు. స్థానికుల వివరాల మేరకు.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద మట్టి లోడ్ చేస్తున్న సమయంలో రాజు ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. లారీపై నుంచి కింద పడిన వెంటనే స్థానికులు గమనించి పిడుగురాళ్ల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరూ తమ గళం వినిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. గుంతకల్లు పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన సమావేశం నిర్వహించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నాయకులు పోరాడాలని సూచించారు. ఎంతో మంది పేదలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.