India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డయల్ 100కు ఫోన్ చేసి ఓ యువతి సాయం కోరడం చర్చనీయాంశమైంది. ‘సార్.. నా బాయ్ ఫ్రెండ్ నా నంబర్ బ్లాక్ చేసి మాట్లాడట్లేదు. వాడితో మాట్లాడి అన్‌బ్లాక్ చేయించండి’ అని గుత్తి ఆర్ఎస్‌కు చెందిన యువతి కోరింది. కంట్రోల్ రూమ్ వారు స్థానిక పోలీసులకు తెలపడంతో కానిస్టేబుల్ సుధాకర్ ఆమెను సంప్రదించారు. అయితే తన ఇంటికి రావొద్దని, వాడితో మాట్లాడి అన్‌బ్లాక్ చేయించాలని కోరడంతో బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడేందుకు యత్నించారు.
అనంతపురానికి చెందిన ఓ.ప్రణతి గురువారం డాక్టరేట్ డిగ్రీ పొందారు. హైదరాబాదులోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్(CESS)లో ప్రొఫెసర్ బలరాములు పర్యవేక్షణలో ‘పట్టణ, గ్రామీణ రాజకీయాలలో మహిళల పాత్ర’ అనే అంశంపై ప్రణతి చేసిన పరిశోధనకు డాక్టరేట్ ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న ఆమెను సిబ్బంది అభినందించారు.
వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా అనంతపురానికి చెందిన చిట్లూరు రమేశ్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రమేశ్ గౌడ్ మాట్లాడుతూ.. వైసీపీలో తనకు రాష్ట్రస్థాయి పదవిని కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయాన్ని గురువారం వాధ్వానీ ఫౌండేషన్ వారు సందర్శించారు. అనంతరం జేఎన్టీయూలో ఫాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలను(FDP) నిర్వహించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ వీసీ హెచ్.సుదర్శన రావు మాట్లాడుతూ.. విద్యార్థులలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు బోధన సిబ్బందికి FDPలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య పాల్గొన్నారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు క్రమబద్ధీకరణ పథకం కింద ఇంటి పట్టా మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లి గ్రామంలో క్రమబద్ధీకరణ పథకం-2025 కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఇంటి పట్టా మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు.
అనంతపురం జిల్లాలో దక్షిణ కాశీగా పిలవబడుతూ తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రానికి ఓ విశిష్టత ఉంది. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. అయితే అలంకరణలో ఉన్న సమయంలో దర్శనానికి వెళ్లే భక్తులకు ఆ దృశ్యాన్ని చూసే భాగ్యం కలగదు. పై ఫొటోలో శివలింగం కింద నీటిని స్పష్టంగా చూడొచ్చు.
విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ సీనియర్ నేత ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడని ప్రజలు నమ్మి ఓటు వేశారని, అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.
శింగనమల మండలం బండమీద పల్లికి చెందిన శెట్టిపల్లి శశిధర్ రెడ్డి జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ప్రతిభ చూపారు. 99.97 పర్సంటేజ్‌తో సాధించారు. 1వ తరగతి నుంచి వరకు 10వ తరగతి వరకు అనంతపురం నారాయణ స్కూల్లో చదివారు. ఇంటర్ హైదరాబాద్‌లో చదువుతున్నాడు. ప్రతిభ చూపిన విద్యార్థిని గ్రామస్థులు, తల్లితండ్రలు అభినందించారు.
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో బుధవారం ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శన రావును TCS అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ‘Corporate Social responsibility’ కింద యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంల గురించి ఇన్‌ఛార్జ్ వీసీతో కలిసి చర్చించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, యూనివర్సిటీ డైరెక్టర్లు సత్యనారాయణ, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో ఉద్యానవన పంటలను సాగు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.