India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పామిడి మండలం పాలెం తండా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రమేశ్ నాయక్ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. పలువురు గిరిజన నాయకులు, కూటమి నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. రమేశ్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు. నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అనంతపురం నగరానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు వెన్నపూస రవీంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఉమ్మడి జిల్లాలోని పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ ఉదయ శ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న కురుగుంట బాలికల గురుకుల పాఠశాలలో డెమో నిర్వహించి ఎంపిక చేస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఒరిజినల్ సర్టిఫికెట్‌లతో హాజరుకావాలని కోరారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి రూ.15లక్షలు వసూలు చేసి మోసం చేసిన ముగ్గురు వ్యక్తులను గుత్తి పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలుకు చెందిన సునీత, అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రసాద్ రెడ్డి, బాబ్జాన్ సాహెబ్‌లు గుత్తికి చెందిన నిఖిల్‌తో పాటు మరి కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారు. ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితులను అరెస్ట్ చేశారు.
సైబర్ నేరాల నేపథ్యంలో సెల్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జగదీశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, ఉద్యోగులు, ఉన్నత హోదాలలో ఉన్న వారు సైతం సైబర్ ఉచ్చులో పడుతున్నారని తెలిపారు.
ఇంట్లో కన్న కొడుకే బంగారు గొలుసును చోరీ చేసిన ఘటన ఎల్లనూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 3 నెలల క్రితం రూ.2.10 లక్షల విలువ చేసే బంగారు చైన్ పోయినట్లు పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నాగయ్య.. ఆమె కొడుకు శంకర్ చోరీ చేసినట్లు తేలింది. ఈ మేరకు సీఐ సత్యబాబు వివరాలు వెల్లడించారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగంపై పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన ముగ్గురిని వైసీపీ సస్పెండ్ చేసింది. బాచన్నపల్లి కె.బాబు(బులెట్ బాబు), నాగే నాయక్, పాటూరి శంకర్ రెడ్డి (కలిగిరి శంకర్ రెడ్డి)ని సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించినట్లు అనంతపురం డీఈవో ప్రసాద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.50 ఫైన్‌తో డిసెంబర్ 2వ తేదీ వరకు, రూ.200తో డిసెంబర్ 9, రూ.500తో 16వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చవచ్చునని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది సోమవారం విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు అన్ని రకాల వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. లైసెన్సు, రికార్డులు లేని వాహనదారులకు జరిమానా విధించారు. కొందరిపై కేసు నమోదు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఒకేసారి 74 మంది పోలీస్ కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు అధికారులు స్థానచలనం కల్పించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ వి.రత్న సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఒకేసారి 74 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Sorry, no posts matched your criteria.