India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు పర్యటన ఖరారైంది. ఈ నెల 8న పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఆయన పర్యటించనున్నారు. ఇటీవల ప్రత్యర్థుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ పర్యటన వేళ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైసీపీ కీలక నేతలు శనివారం సమావేశం నిర్వహించి చర్చించారు.

అనంతపురం జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్టోగ్రతలు గరిష్ఠంగా 36.5 డిగ్రీల సెల్సియస్ ఉండగా.. కనిష్ఠ ఉష్ణోగ్రత 21.1 డిగ్రీలుగా కొనసాగుతుందన్నారు. దీంతో గాలివేగం స్వల్పంగా పెరగడం వల్ల ఆగ్నేయం దిశగా గంటకు 8 నుంచి 12 కిలోమీటర్లు వీస్తాయని, ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

తాడిపత్రిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. హర్షత్ విజయవాడలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాడు. 2 ఇయర్ క్లాసులకు కాలేజీకి రావాలని కాల్ వచ్చింది. కుమారుడు వెళ్లననడంతో తల్లి మందలించి పంపింది. కాలేజీకి వెళ్లకుండా మళ్లీ ఇంటికి వచ్చాడు. తల్లి ఏం అనకుండా కూలీ పనులకు వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా <<15994650>>ఉరి వేసుకుని<<>> కనిపించాడు. ఇతని తండ్రి దక్షిణాఫ్రికాలో పనిచేస్తున్నారు.

కదిరి మండలం బోయరామన్నగారిపల్లి గ్రామానికి చెందిన చంద్రకళ (18) శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు.. తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా యువతి 45 రోజుల క్రితం కూటాగుళ్లకు చెందిన చిన్న అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు మాట్లాడలేదని మనస్తాపం చెంది ఉరేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడును శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలపై నివేదికను అందజేశారు. పలు సమస్యలపై చర్చించినట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు చెప్పారు. ఆమె వెంట స్థానిక నేతలు ఉన్నారు.

అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం అనంతపురం డివిజన్‌కు సంబంధించి జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్స్ కమిటీ, డీఎల్సీ/డీఎల్ఎన్సీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ నిర్వహించారు. నిషేధిత జాబితాలో ఉన్న డాటెడ్ ల్యాండ్స్ (చుక్కల భూములు) సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రతివారం షెడ్యూల్ చేసుకుని జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.

పెళ్లై 6 నెలలు గడవకముందే వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువారం సాయంత్రం ఉరవకొండ మండలం రాకెట్ల PABR జలాశయంలో మునిగి కార్తీక్ (25) మృతి చెందాడు. తెలిసిన వారు పిలిస్తే జలాశయం వద్ద వ్యవసాయ మోటర్ దింపడానికి వెళ్ళాడు. జలాశయం లోపలికి వెళ్లిన తరువాత చేపల కోసం వేసిన వల చిక్కుకొని ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పరిటాల-తోపుదుర్తి కుటుంబాల మధ్య పొలిటికల్ హీట్ నెలకొంది. కొన్నిరోజులుగా సునీత, తోపుదుర్తి సోదరులు పరస్పరం సంచలన ఆరోపణలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈనెల 8న YS జగన్ పాపిరెడ్డిపల్లికి వస్తుండగా పరిటాల రవి హత్య వెనుక జగన్ హస్తం ఉందంటూ సునీత సంచలన ఆరోపణ చేశారు. వందలాది మందిని చంపించిన నీ భర్త దేవుడా? అంటూ చంద్రశేఖర్ ఇటీవల ప్రశ్నించారు. విమర్శ ప్రతి విమర్శలతో రాప్తాడు రాజకీయం హీటెక్కింది.

ప్రభుత్వం 117 జీఓను ఉపసంహరించుకున్న నేపథ్యంలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్‌లో మండల విద్యాశాఖ అధికారులతో పాఠశాలలు పునఃవ్యవస్థీకరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. పాఠశాలల పునఃవ్యవస్థీకరణ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలన్నారు.

లక్ష్య, ముస్కాన్, కయకల్ప లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని, జిల్లాలోని వైద్య అధికారులు, సిబ్బందికి క్వాలిటీ శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం DMHO కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మెడికల్ ఆఫీసర్లతో జిల్లా నాణ్యత హామీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. క్వాలిటీ అస్సూరెన్స్ కమిటీ మీటింగ్ ప్రతి 3 నెలలకు ఒకసారి మొదటి గురువారం నిర్వహించాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.