India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 15న ప్రారంభించిన స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఫ్రీ బస్సు ప్రయాణాన్ని అనంతపురం జిల్లాలో రికార్డు స్థాయిలో మహిళలు వినియోగించుకున్నారు. జిల్లాలో 303 బస్సులను స్త్రీ శక్తి పథకానికి అధికారులు వర్తింపజేశారు. 4,12,054 మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసి రూ.2,17,48, 677 మేర లబ్ధి పొందారు. స్త్రీలతో పాటు ఉచితాలకు వినియోగించిన బస్సుల్లో 75,5,354 మంది పురుషులూ ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.
గుత్తిలో ఆదివారం చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కేజీ రూ.160 ఉండగా. మటన్ రూ.700 నుంచి రూ.750 వరకు ఉందని షాప్ నిర్వాహకుడు షఫీ తెలిపారు. అనంతపురంలో కేజీ చికెన్ రూ.140 ఉండగా, గుంతకల్లులో రూ.150గా ఉంది. గుత్తిలో రెండు రోజుల క్రితం కేజీ చికెన్ రూ.170 పలికింది. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.
సివిల్, APSP కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎస్పీ జగదీశ్ కీలక సూచనలు చేశారు. ఈ నెల 25న జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 8 గంటలకు అభ్యర్థులు హాజరు కావాలన్నారు. సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషన్‌తో పాటు జతపరచిన అన్ని ధ్రువపత్రాల ఒరిజినల్స్, గెజిటెడ్ అధికారితో సంతకం చేయించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను తీసుకురావాలని సూచించారు.
అనంతపురం జేఎన్టీయూ ఆరు ISO సర్టిఫికెట్లు అందుకుంది. ఈ మేరకు శనివారం ISO బృంద సభ్యులు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హంచాటే సుదర్శన రావుకు అందజేశారు. వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో యూనివర్సిటీని మరింత మెరుగైన ప్రమాణాలను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, యూనివర్సిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
రెవెన్యూ పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం అవసరమైన భూమిని సిద్ధంగా పెట్టుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం తాడిపత్రి మండలం పెద్దపొలమడ పరిధిలో అనంతపురం -తాడిపత్రి జాతీయ రహదారి పక్కన సర్వే నంబర్ 1,390లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే పెట్రోల్ బంక్ కోసం కలెక్టర్ స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మెగా డీఎస్సీ ఫలితాల్లో అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మం. జూటూరుకు చెందిన వసుంధర సత్తా చాటారు. జిల్లా స్థాయిలో 59వ ర్యాంకుతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలి (SGT)గా ఎంపికయ్యారు. అయితే వసుంధర ఇప్పటికే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పుట్లూరు, పెద్దపప్పూరు, యాడికి మండలాల్లో పనిచేశారు. ప్రజల రక్షణలో కీలకంగా పనిచేస్తూ లక్ష్యాన్ని మరవకుండా టీచర్ జాబ్ సాధించారు.
బీజేపీ నేత సందిరెడ్డి శ్రీనివాసులు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. శ్రీనివాసులు 1985లో అఖిల భారత విద్యార్థి పరిషత్‌లో చేరి కళాశాల కార్యదర్శిగా పనిచేశారు. 1990లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. అనంతరం బీజేపీలో చేరారు. అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా 2సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.
రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, సరిపడా యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. రైతులు మీ గ్రామ పరిధిలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి ఎరువులను తీసుకోవచ్చన్నారు. రైతు సేవా కేంద్రం వద్ద సరిపడ స్టాక్ ఉందన్నారు. గ్రామ, మండల వ్యవసాయ అధికారులను, రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించాలన్నారు.
అనంతపురం JNTUలో జులైలో నిర్వహించిన M.Tech 1, 2, 3వ సెమిస్టర్ల, M.Phamarcy 1, 2, 3వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ విడుదల చేశారు. విద్యార్థులు https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌లో తమ రిజల్ట్స్ చూసుకోవచ్చన్నారు.
శ్రీకృష్ణ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల బీపీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలను పరీక్షల విభాగంలో డైరెక్టర్ జీవి రమణ, కంట్రోలర్ శ్రీరామ్ నాయక్, అసిస్టెంట్ రిజిస్టార్ శంకర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ బాలాజీ నాయక్ గురువారం ప్రకటించారు. మొత్తం 70 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 60 మంది ఉత్తీర్ణత సాధించారని వారు తెలిపారు. ఫలితాల కోసం ఎస్కేయూ వెబ్‌సైట్‌ను చూడాలన్నారు.
Sorry, no posts matched your criteria.