Anantapur

News November 17, 2024

24 గంటల్లో 513 కేసులు పెట్టిన అనంతపురం పోలీసులు

image

అనంతపురం జిల్లాలో నేరాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై పోలీసులు దృష్టిసారించారు. ఇందులో భాగంగా హెల్మెట్/ సీటు బెల్టు ధరించని వారు, ట్రిపుల్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, డ్రంకన్ డ్రైవింగ్‌పై తనిఖీలు చేపట్టారు. ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు 513 కేసులు నమోదు చేశారు. వీరికి రూ.1.10 లక్షల ఫైన్ వేశామని ఎస్పీ జగదీశ్ తెలిపారు. అలాగే రాత్రి జిల్లా వ్యాప్తంగా 154 ఏటీఎంలను తనిఖీ చేశారు.

News November 17, 2024

అనంత: నేడు నిశ్చితార్థం.. అంతలోనే విషాదం

image

తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి వద్ద నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన గీతా అనే యువతి మృతిచెందిన విషయం విధితమే. ఆ యువతికి నేడు నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గీత, ఆమె తమ్ముడు నారాయణరెడ్డి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి.

News November 17, 2024

రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి:  ఎస్పీ

image

అనంతపురం జిల్లాలో రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వారి పై 24 గంటల్లో 513 కేసులు నమోదు చేసి రూ.1.10 లక్షలు జరిమానాలు వేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 50 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. మద్యం తాగి అతివేగంగా వాహనాలు నడపరాదని తెలిపారు.

News November 16, 2024

డీఎస్సీ కోచింగ్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీఎస్సీ కోచింగ్ సెంటర్‌ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ వినోద్ కుమార్‌తో కలిసి కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులు ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

News November 16, 2024

తాడిపత్రి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

image

తాడిపత్రి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని వెంకటరెడ్డిపల్లి గ్రామం వద్ద అక్క, తమ్ముడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంలో ట్రాక్టర్ ఢీకొనడంతో అక్క అక్కడికక్కడే మృతిచెందగా.. తమ్ముడు నారాయణరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తాడిపత్రి రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

News November 16, 2024

పుట్టపర్తి: మృతదేహంతో విద్యార్థుల ఆందోళన

image

పుట్టపర్తి సమీపంలోని సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి ప్రేమ సాయి సహచర విద్యార్థుల దాడిలో గాయపడి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహంతో విద్యార్థి సంఘం నేతలు ఆందోళనకు దిగారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రేమ సాయి మృతదేహాన్ని రహదారిలో ఉంచి ధర్నా చేశారు. విద్యార్థి మృతికి కారణమైన కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

News November 16, 2024

మెరుగైన సమాజం కోసం కృషి చేయాలి: ఎస్పీ

image

మెరుగైన సమాజం కోసం పోలీసు, ప్రజల మధ్య సత్సంబంధాలు కలిగి ఉండటం అవసరమని జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. విడపనకల్లు మండలం పాల్తూరులో కడ్లే గౌరమ్మ జాతర సందర్భంగా పోలీసు, మైత్రి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా శుభపరిణామం అన్నారు.

News November 16, 2024

మందకృష్ణ మాదిగకు ఘన స్వాగతం

image

అనంతపురం పర్యటనకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వచ్చారు. ఆయనకు రాష్ట్ర సరిహద్దులోని బాగేపల్లి చెక్ పోస్టు వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో MJF నాయకులు ఎల్లంరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News November 16, 2024

ATP: 16వ తేదీలోపు చంపేస్తామని వార్నింగ్

image

చెప్పిన టైంలోపు లేపేస్తామని మెసేజ్‌లు రావడం అనంతపురంలో కలకలం రేపింది. బాధితుడి వివరాల మేరకు.. నగరంలోని కురుబ గేరికి చెందిన నాగార్జున బంగారు నగలు తయారు చేస్తుంటాడు. రెండు వారాలుగా ఆయనకు ఓ నంబర్ నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. ‘డిసెంబర్ 16వ తేదీ లోపు నిన్ను చంపేస్తాం’ అని అందులో ఉంది. ఆ నంబర్‌కు కాల్ చేస్తే లిప్ట్ చేయడం లేదు. కంగారుతో నాగార్జున అనంతపురం ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 16, 2024

కేతిరెడ్డికి కీలక బాధ్యతలు

image

ఇటీవల కాలంలో పలువురు వైసీసీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లకు అండగా నిలిచేందుకు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేశ్ గౌడ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కార్యకర్తలకు వీళ్లు అండగా ఉంటారని చెప్పారు. లీగల్ సెల్‌ను సమన్వయం చేసుకుంటూ కేడర్‌కు భరోసా ఇవ్వాలని జగన్ సూచించారు.