India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లా క్రీడాకారులు కుస్తీ పోటీల్లో పట్టు పట్టారంటే మెడల్ రావాల్సిందే అన్నట్లు దూసుకెళ్తున్నారు. కొద్దిరోజులుగా జరుగుతున్న స్కూల్ గేమ్స్ల్లో అండర్ -17 బాలుర విభాగంలో రోహిత్, బాలికల విభాగంలో రాణి గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి ఇవాళ రాష్ట్ర స్థాయిలో పోటీ పడి గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో వారు ఢిల్లీలో డిసెంబర్ 23న జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని కుస్తీ కోచ్ రాఘవేంద్ర తెలిపారు.
జిల్లాలో అపార్ జనరేషన్ సకాలంలో పూర్తిగా జరగకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో పాఠశాల విద్యా శాఖపై విద్యా, అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పాఠశాలలోనే నిర్వహించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. కుప్పం, దగదర్తి, మూలపేటల్లో విమానాశ్రయాలు, అనంతపురం-తాడిపత్రి మధ్య ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో కదలిక కోసం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.792.72 కోట్లు కేటాయించింది. దీంతో ఆయా చోట్ల అనుకూలతలపై త్వరలో కేంద్రం అధ్యయనం చేయనుంది.
➤ హంద్రీనీవాకు రూ.1,867 కోట్లు
➤ HLC ఆధునికీకరణ పనులకు ₹30 కోట్లు
➤ జిల్లా సాగునీటి రంగానికి ₹2వేల కోట్లు
➤ SKUకు రూ.100 కోట్లు, JNTUకు రూ.58కోట్లు
➤ రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రూ.19కోట్లు
➤ బిందు సేద్యం ప్రోత్సాహానికి ₹2,700కోట్ల నిధులు
➤ అన్నదాత సుఖీభవ పథకానికి ₹4,500 కోట్లు
☞ జిల్లాలోని 5లక్షల మంది రైతులకు లబ్ధి
➤ తల్లికి వందనం పథకానికి రూ.6వేల కోట్లు
☞ ఉమ్మడి జిల్లాలో 4 లక్షల మంది లబ్ధిదారులు
అనంతపురం జిల్లాలో NH-544D, NH-67, NH-544DD, NH-42, NH-150A జాతీయ రహదారులకు సంబంధించి వచ్చే డిసెంబర్ నెలాఖరులోపు భూసేకరణ పనులు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టర్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. పలు సూచనలు చేశారు.
స్కేటింగ్లో బుడతడు సత్తా చాటుతూ అందరినీ ఔరా.. అనిపిస్తున్నాడు. అనంతపురానికి చెందిన హంజా హుస్సేన్ అనే చిన్నారి 36వ ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో రెండు బంగారు, ఒక వెండి పతకాలను సాధించాడు. కాకినాడలో జరిగిన 7 నుంచి 9 ఏళ్ల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ చాటడంతో పాటు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు జిల్లా కార్యదర్శి రవి బాల, కోచ్ నాగేంద్ర, హేమంత్ తెలిపారు.
బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్ ప్రారంభిస్తామని అన్నారు. ఒక్కొక్క కేంద్రంలో 200 మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,200 మందికి శిక్షణ ఇస్తామని, అభ్యర్థులకు నెలకు రూ.1,500 స్టైపండ్ అందజేస్తామన్నారు.
రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరయ్యారు. మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం శాసనసభ వాయిదా పడింది. సభ నుంచి బయటకు వస్తున్న సమయంలో వారు శాసనసభ ప్రాంగణంలో సహచర మహిళా ఎమ్మెల్యేలతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు.
SKU పరిధిలో డిగ్రీ విద్యార్థులకు ఈ నెల 26వ తేదీ నుంచి మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ బీ.అనిత ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వివిధ కారణాల వలన పెండింగ్లో పడిన సబ్జెక్టులను పూర్తి చేసుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు డిసెంబర్ 23వ తేదితో ముగియనున్నట్లు పేర్కొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదమా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారణ చేపట్టారు.
Sorry, no posts matched your criteria.