Anantapur

News July 31, 2024

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

image

ఉరవకొండ మండల కేంద్రంలోని డా.బి.ఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, వంటగదిని ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు తరగతులు ఎలా నిర్వహిస్తున్నారు, పాఠాలు ఎలా బోధిస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు.

News July 30, 2024

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి కీలక బాధ్యతలు?

image

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీలో కీలక మార్పులకు సిద్ధమైనట్లు సమాచారం. త్వరలోనే పలు జిల్లాలకు అధ్యక్షులను మార్చనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎం.శంకరనారాయణకు పార్టీలో మరో బాధ్యత అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News July 30, 2024

సత్యసాయి జిల్లాకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే

image

సీఎం చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 1న మడకశిర మండలం గుండుమల గ్రామానికి రానున్నారు. నంద్యాల జిల్లా సున్నిపెంట నుంచి హెలికాప్టర్‌లో మ.12.20 గంటలకు పయనమై మ.1.45 గంటలకు గుండుమలకు చేరుకుంటారు. మ.2.20 నుంచి ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేస్తారు. అనంతరం కావేరమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. సా.4.55 గంటలకు పుట్టపర్తికి చేరుకుని ఫ్లైట్‌లో విజయవాడకు వెళ్తారు.

News July 30, 2024

స్వీడన్ బ్యాచ్ ప్రోగ్రాం కోర్సుకు 13 అడ్మిషన్లు

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్వీడన్ బ్యాచ్ ప్రోగ్రాం కోర్సుకు 13మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. దీనికి సంబంధించి మొత్తం 4సంవత్సరాల బీటెక్ కోర్సుకు గాను.. 3 సంవత్సరాలు జేఎన్టీయూ క్యాంపస్‌లో చదివిన అనంతరం మిగిలిన 1 సంవత్సరం స్వీడన్‌లో చదువుతారు. ఈ మేరకు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఎస్.కృష్ణయ్య విద్యార్థులకు తమ అడ్మిషన్ పత్రాలను అందజేశారు.

News July 30, 2024

గంజాయి తరలిస్తున్న అనంత బాలుడి అరెస్ట్

image

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిసర ప్రాంతాల నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్న అనంతపురం బాలుడిని అరెస్ట్ చేశామని సీఐ రామకృష్ణ తెలిపారు. అనంతపురం పట్టణానికి చెందిన పదహారేళ్ల బాలుడు 4.9 కిలోల గంజాయి తరలిస్తుండగా తుని రైల్వే పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం పట్టుకున్నామన్నారు. ఘటనకు సంబంధించి మరో ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. మంగళవారం బాలుడిని కోర్టులో హాజరపరుస్తామన్నారు.

News July 30, 2024

శ్రీకృష్ణదేవరాయ డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్ష ఫలితాలు విడుదల

image

అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్ష ఫలితాలు సోమవారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. పరీక్ష ఫలితాలలో 98.46 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు ఎస్కేయూ ఇన్‌ఛార్జ్ వీసీ అనిత తెలిపారు. మొత్తం 324మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 319మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు తెలిపారు.

News July 30, 2024

పెనుకొండ రోడ్డు ప్రమాదంలో.. ఆర్టీసీ డ్రైవర్‌కు రెండు గంటల నరకయాతన

image

పెనుకొండ సమీపంలో జరిగి<<13726628>> ఆర్టీసీ బస్సు- లారీ ఢీ<<>> కొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌‌ రెండు గంటలు బస్సుల్లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు. చివరకు పోలీసులు క్రేన్ సహాయంలో అతడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అతడి కాలు విరగడంతో ప్రాథమిక చికిత్స అనంతరం అనంతపురానికి తరలించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

News July 30, 2024

మహిళా కానిస్టేబుల్‌కు కలెక్టర్ అభినందన

image

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గార్లదిన్నె మండలం కల్లూరు సచివాలయం మహిళా కానిస్టేబుల్ షేక్ రజియా బేగంను అభినందించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాల్య వివాహాలపై అవగాహన కల్పించడంలో మంచి ప్రతిభ చూపించారని తెలిపారు. అందరూ అదే స్ఫూర్తితో పని చేసి బాల్య వివాహాలు నియంత్రించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

News July 29, 2024

కళ్యాణదుర్గం హత్య.. ముగ్గురికి జీవిత ఖైదు

image

కళ్యాణదుర్గం హత్య ఘటనలో ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ అనంతపురం మహిళా కోర్టు తీర్పు చెప్పింది. అనంతపురం టౌన్‌కు చెందిన భీమేశ్ మరో ముగ్గురు స్నేహితులు. చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. ఓ చోరీ కేసులో భీమేశ్ మిగతా ముగ్గురి పేర్లు చెప్పారు. వారు భీమేశ్‌పై పగ పెంచుకుని రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటనలో నిందితులు ముగ్గురికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా విధించారు.

News July 29, 2024

జేసీ ఫ్యామిలీని కలిసిన మంత్రి మండిపల్లి

image

జేసీ కుటుంబ సభ్యులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిశారు. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఆహ్వానం మేరకు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు మంత్రి ట్వీట్ చేశారు. ఇంటికి చేరుకున్న మంత్రికి జేసీ పవన్ స్వాగతం పలికారు. అనంతరం ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డితో పలు అంశాలపై చర్చించారు. పవన్‌కు కీలక నామినేటెడ్ పోస్ట్ దక్కే అవకాశముందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి కలవడం ఆసక్తికరంగా మారింది.