India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. రొద్దం మండలం శేషాపురం గ్రామానికి చెందిన శిల్ప బుధవారం రాత్రి పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో సాధారణ ప్రసవంలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారని డా.నీరజ తెలిపారు. శిశువుల బరువు తక్కువ ఉండటంతో అనంతపురం రెఫర్ చేశామన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
వేసవి సెలవుల్లో పిల్లలను పిల్లలను విహారయాత్రలకు తీసుకెళ్లేందుకు పేరెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. రొటీన్ లైఫ్ నుంచి వెరైటీ కోరుకునే వారికి మన జిల్లాలో ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అవి.. పెన్నహోబిలం, లేపాక్షి, పెనుకొండ కోట, తిమ్మమ్మ మర్రిమాను, గుత్తికోట, పుట్టపర్తి, ఆలూరుకోన, కసాపురం, జంబు ద్విపా, యోగివేమన సమాధి, కదిరి నరసింహస్వామి, తాడిపత్రి చింతల వెంకటరమణ దేవాలయం.
పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో 900 కారు ఇంజిన్ల చోరీ కేసులో పురోగతి లభించింది. తమిళనాడుకు చెందిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి కోర్టు రిమాండ్ విధించడంతో పెనుకొండ సబ్ జైలుకు తరలించారు. వారిని విచారించిన తర్వాత మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీని వెనుక కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.
ధర్మవరం రైల్వే స్టేషన్లో పుట్టపుర్తి-తిరుపతి కనెక్షన్ పాయింట్స్, పాయింట్ ఛేంజింగ్ పనులు బుధవారం మొదలయ్యాయి. దీంతో గుంతకల్లు-తిరుపతి, తిరుపతి-కదిరిదేవరపల్లి ప్యాసింజర్ రైళ్లు బుధవారం నుంచి మే 17వరకు రద్దయ్యాయి. ఈ మార్గంలో వెళ్లే మరిన్ని రైళ్లను గుత్తి మీదుగా రేణిగుంటకు మళ్లించారు. ఇక నర్సాపూర్ ఎక్స్ప్రెస్ కదిరి-నర్సాపూర్ మధ్య రాకపోకలు సాగించనుంది.
అనంతపురం జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సంక్లిష్టమైన అర్జీలను వదిలిపెట్టకుండా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం గుంతకల్లు రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామస్థాయిలో నాణ్యతగా సమస్యలను పరిష్కరించాలన్నారు. వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఏపీ ప్రభుత్వం వాట్సాప్ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ సేవలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్) 95523 00009 కు హాయ్ అనండి… హాయిగా సేవలు పొందాలన్నారు.
దోమల నివారణే ధ్యేయంగా పనిచేయాలని DMO ఓబులు పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి అనంతపురం జిల్లాలోని 32 మండలాలలోని 64 గ్రామాలలో ఫైలేరియా వ్యాధి రక్తపూతల సర్వే నిర్వహించాలన్నారు. జిల్లా DMHO కార్యాలయంలో సబ్ యూనిట్ మలేరియా అధికారుల సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ.. గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా హెలికాప్టర్ విండో షీల్డ్కు ఎయిర్ క్రాక్ ఘటనప్తె పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు పైలెట్, కోపైలెట్ను చెన్నేకొత్తపల్లి పోలీసులు విచారిస్తున్నారు. హెలిప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలపై పోలీసులు నిగ్గు తేల్చనున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ రామగిరి పర్యటన సందర్భంగా హెలికాప్టర్ విండో షీల్డ్కు ఎయిర్ క్రాక్ ఘటనప్తె పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియజేయాలని పైలెట్, కోపైలెట్కు చెన్నేకొత్తపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. హాజరైతే హెలిప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలపై పోలీసులు నిగ్గు తేల్చనున్నారు.
అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 19న కళాశాల 79వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్.వసుంధర్ తెలిపారు. దీనికి సంబంధించి కళాశాలలో ఏర్పాటు చేసే సాంస్కృతిక, వికాసిక, క్రీడా కార్యక్రమాలలో ప్రతి విద్యార్థి, సిబ్బంది ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.