Anantapur

News July 6, 2024

అనంత: జాతీయ రహదారిపై లారీ బోల్తా

image

చెన్నేకొత్తపల్లి వద్ద జాతీయ రహదారిపై లారీ బోల్తా పడిన ఘటన శనివారం జరిగింది. మట్టి లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి జాతీయ రహదారిపై బోల్తా పడింది. దీంతో ఎన్‌ఎస్ గేటుకు రాకపోకలు కొద్దిసేపు స్తంభించిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

News July 6, 2024

శ్రీసత్యసాయి: రైలు కింద పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

image

రైలు కిందపడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. నల్లమాడ మండలం ఎర్రవంకపల్లికి చెందిన ప్రభాకర్ కుమారుడు వినోద్ కుమార్(26) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ముదిగుబ్బ మండలంలోని మలకవేముల క్రాస్ రైల్వేగేట్ సమీపాన రైలు కిందపడి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న కదిరి రైల్వే ఎస్సై రహీం ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

గుంతకల్లు: హత్య కేసును ఛేదించిన పోలీసులు

image

గుంతకల్లు మండలంలోని నల్లదాసరిపల్లి గ్రామ సమీపంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం ఉదయం బోయ ఆవుల లక్ష్మన్నను కొందరు హత్య చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. అల్లుడు చంద్రశేఖర్, రాజశేఖర్, సతీశ్‌లను అరెస్టు చేశారు. హత్యకు గల కారణం భార్యను కాపురానికి పంపలేదని, తనను అవమానించినందుకు హత్య చేసినట్లు రూరల్ సీఐ మహేశ్వర్ రెడ్డి, ఎస్ఐ సురేశ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

News July 6, 2024

అనంత: తండ్రిపై కుమార్తె కత్తితో దాడి

image

తాడిపత్రి మండలంలో తండ్రిపై కుమార్తె కత్తితో దాడి చేసింది. మండల పరిధిలోని ఆలూరులో శుక్రవారం రాత్రి తండ్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి తల్లి సుభద్రమ్మను కొడుతుండగా కుమార్తె శాంతి అడ్డుకోబోయింది. ఆమెను తోసివేయడంతో తండ్రిని ఆపేందుకు పక్కనే ఉన్న కత్తి తీసుకుంది. పెనుగులాటలో కత్తి గుచ్చుకుని ఆయనకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News July 6, 2024

బాలికపై వేధింపులు.. నిందితుడికి రిమాండ్

image

తన కోరిక తీర్చాలంటూ బాలికను నిర్బంధించి వేధించిన కేసులో పాస్టర్ కొల్లప్పను రిమాండ్‌కు తరలించినట్లు కళ్యాణదుర్గం రూరల్ సీఐ హరినాథ్ తెలిపారు. బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లికి చెందిన కొల్లప్ప ప్రార్థనల పేరుతో ఓ గదిలో నిర్బంధించి ఆమెను వేధించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి కళ్యాణదుర్గం కోర్టు ఎదుట హాజరు పరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారని తెలిపారు.

News July 6, 2024

అంతర్జాతీయ పోటీలకు ద్వారకనాథరెడ్డి ఎంపిక

image

బాస్కెట్‌బాల్‌ కీర్తి కిరీటంలో ఒక ఆణిముత్యం చేరింది. 26 ఏళ్ల తర్వాత అనంతపురానికి చెందిన క్రీడాకారుడు ద్వారకానాథ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో జిల్లా కీర్తిని రెపరెపలాడించాడు. జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ ప్రాబబుల్స్‌ జట్టుకు ఎంపికైన ఈ క్రీడాకారుడు అద్వితీయ ఆటతీరుతో అందరినీ మెప్పించి శ్రీలంకలో పర్యటించనున్న జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ సాబ టోర్నీకి ఎంపికయ్యాడు. కొలంబోలో ఈ నెల 10 నుంచి 13 వరకు టోర్నీ జరగనుంది.

News July 6, 2024

అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటుచేయండి: ఎంపీ అంబికా

image

అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేయవలసిందిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామమోహన్ నాయుడుని శుక్రవారం అనంతపురం ఎంపీ ఢిల్లీలో అంబికా లక్ష్మి నారాయణ కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హిందూపూర్ ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి త్వరితగతిన అవసరమైన అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

News July 5, 2024

గుత్తి: సిమెంటు లారీ బోల్తా

image

గుత్తి శివారులోని గుంతకల్లు రోడ్డులో చెరువు కట్ట వద్ద సిమెంటు లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. సిమెంట్ లోడుతో తాడిపత్రి నుంచి గుంతకల్లు వైపు వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ బాలకృష్ణ స్వల్పంగా గాయపడ్డాడు. లారీ పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News July 5, 2024

పుట్టపర్తిలో విచక్షణ రహితంగా కొట్టుకున్న హిజ్రాలు

image

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో హిజ్రాలు కట్టెలతో, కత్తులతో విచక్షణ రహితంగా కొట్టుకున్న ఘటన ఇవాళ జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. పుట్టపర్తికి చెందిన హిజ్రా పల్లవి పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన హిజ్రాలు ఆధిపత్యం కోసం దాడికి తేగబడ్డారని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి కేసు నమోదుచేసి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

News July 5, 2024

కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన పయ్యావుల

image

ఢిల్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ బిజీబిజీగా గడుపుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన వివిధ శాఖల మంత్రులను కలుస్తున్నారు. ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై మెమోరాండాన్ని అందజేశారు. ఏపీకి నిధుల కేటాయింపు గురించి చర్చించారు.