India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 12న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

పండుగ పూట పలు కుటుంబాల్లో విషాదం నిండింది. కూడేరు(M) జల్లిపల్లికి చెందిన ఉదయ్ కిరణ్(12) ఆటోలో ఆడుకుంటుండగా ఇంజిన్ స్టార్ట్ అయ్యింది. ముందుకెళ్లి బోల్తాపడి బాలుడు మృతిచెందాడు. బ్రహ్మసముద్రం(M) పోలేపల్లి వద్ద BTP కాలువలోకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో నీటిలో ఊపిరాడక కపటలింగనపల్లికి చెందిన నితిన్(15) మరణించాడు. అనంతపురం పోలీస్ కంట్రోల్ రూములో ఎస్సైగా పనిచేస్తున్న మోహన్ ప్రసాద్(61) గుండెపోటుతో మృతిచెందారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా అనంతపురం జిల్లా ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించింది. హైదరాబాద్, చెన్నై, విజయవాడ, బెంగళూరు వంటి దూర ప్రాంతాలకైనా సాధారణ ఛార్జీలే ఉంటాయని పేర్కొంది. పండుగకు ముందు 39, తర్వాత 38 బస్సులు వివిధ ప్రాంతాలకు నడపనుంది. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.

అనంతపురం జిల్లాలోని KGBVల్లో 60 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టే ఈ నియామకాల్లో టైప్-3 కేజీబీవీల్లో 40, టైప్-4 కేజీబీవీల్లో 20 ఖాళీలు ఉన్నాయి.
★ అర్హులు: మహిళా అభ్యర్థులు మాత్రమే..
★ దరఖాస్తు గడువు: జనవరి 11 వరకు..
★ దరఖాస్తు కేంద్రం: జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అప్లికేషన్లు అందజేయాలని అధికారులు సూచించారు.

అనంతపురం జిల్లాలో రీసర్వే పనులను వేగంగా పూర్తి చేయాలని ఇన్‌ఛార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రీసర్వే, ఆర్‌ఓఆర్, మీసేవ, భూసేకరణ అంశాలపై సమీక్షించారు. డీఎల్‌ఆర్ పెండింగ్ గ్రామాల్లో ప్రతిరోజు ఒక గ్రామం డేటా పంపాలని సూచించారు. రైతులకు ముందస్తు నోటీసులు ఇచ్చి గ్రౌండ్ సర్వే పనులను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అన్ని శాఖల అధికారులు ప్రాధాన్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాఖల పనితీరును సమీక్షించిన ఆయన, ఉపాధి హామీ పనుల్లో శ్రామికుల హాజరు పెంచాలని, ఫారం పాండ్లు, కంపోస్ట్ పిట్‌లు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గోకులం షెడ్లను జనవరి 15 నాటికి ప్రారంభించి, మార్చి 10లోగా పూర్తి చేయాలన్నారు.

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అన్ని శాఖల అధికారులు ప్రాధాన్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాఖల పనితీరును సమీక్షించిన ఆయన, ఉపాధి హామీ పనుల్లో శ్రామికుల హాజరు పెంచాలని, ఫారం పాండ్లు, కంపోస్ట్ పిట్‌లు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గోకులం షెడ్లను జనవరి 15 నాటికి ప్రారంభించి, మార్చి 10లోగా పూర్తి చేయాలన్నారు.

ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 629 అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీకి ఎండార్స్మెంట్ ఇవ్వాలని, బియాండ్ ఎస్ఎల్ఏ లేకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు సీఎంఓ, ఎమ్మెల్యే, ఎంపీ పెండింగ్ ఫిర్యాదులను పూర్తి చేయాలన్నారు.

17 పారామెడికల్ కళాశాలల్లో 2025-26 అకాడమిక్ ఇయర్‌కు సంబంధించి GNM కోర్సులో అడ్మిషన్స్ కోసం గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసినట్లు DMHO దేవి తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 761 మంది విద్యార్థినులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. కన్వీనర్ కోటాలో 594 సీట్లకు మెరిట్ కమ్ రిజర్వేషన్ ప్రాతిపదికన ఈనెల 6, 7వ తేదీలలో DMHO కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి కౌన్సిలింగ్ నిర్వహించి భర్తీ చేస్తామని DMHO తెలిపారు.

అనంతపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరోసారి వై. మధుసూదన్ రెడ్డికే అధిష్టానం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై మరోసారి నమ్మకం ఉంచిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని పేర్కొన్నారు. ఈ నియామకంపై ఉరవకొండ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
Sorry, no posts matched your criteria.