India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురంలో ‘అనంత ఉద్యాన సమ్మేళనం’ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. ఈ క్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ దృశ్యం అక్కడున్న వారందరినీ ఆకర్షించింది. గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య వైరం ఉందన్న చర్చ ఉంది. 2014లో జేసీ ఫ్యామిలీ టీడీపీలో చేరగా అప్పటి నుంచి రెండు కుటుంబాలు ఒకే పార్టీలో ఉన్నాయి.

కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు 8వ ఏపీ యూత్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నారు. బుధవారం అనంతపురంలో జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.శ్రీకాంత్ రెడ్డి, సెక్రటరీ కే.నరేంద్ర చౌదరి మాట్లాడారు. ఛాంపియన్ షిప్‌నకు స్థానిక అశోక్ నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 6న 8 గంటలకు బాలురు, బాలికల టీమ్‌లను ఎంపిక చేస్తామని తెలిపారు.

అనంతపురం సమీపంలోని బుక్కరాయసముద్రం మండల కేంద్రం చెరువు కట్ట వద్ద ఇటీవల ఓ ఆటో డ్రైవర్‌పై హిజ్రాలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హిజ్రాలు వివరణ ఇచ్చారు. తమ ఆత్మ రక్షణ కోసమే అలా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తమ వల్ల ఎవరికీ హాని జరగదని అన్నారు. బీ.సముద్రం పోలీసులు మాట్లాడుతూ.. హిజ్రాలు ఇబ్బందులు కలిగిస్తే తమకు తెలపాలన్నారు. తప్పు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అనంతపురంలోని MYR ఫంక్షన్ హాలులో ఇవాళ ఉదయం 9 గంటలకు హార్టికల్చర్ కాంక్లేవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కాంక్లేవ్ సమావేశంలో హార్టికల్చర్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్‌లతో పాటు 16 మంది దేశ, విదేశాలకు చెందిన కార్పొరేట్ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాతో 6 MOUలు కురుర్చుకోనున్నారు.

అనంతపురం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం డీవై కుళ్లాయప్ప నేత్ర స్వీకరణ కేంద్రం ప్రారంభమైంది. కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రెడ్ క్రాస్ శరవేగంగా దూసుకుపోతోందని, ఇప్పటికే మెంబర్షిప్, సీఎస్ఆర్ కార్యక్రమంలో రాష్ట్రంలోనే ముందు ఉన్నామని తెలిపారు. కంటి దాన అంగీకార పత్రాల సేకరణలోనూ మన రెడ్ క్రాస్ ముందుండాలన్నారు.

అనంతపురంలో టమాటా ధరలు రైతులకు నిరాశే మిగిలిస్తున్నాయి. కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న కిలో టమాటా రూ.14 పలికింది. సరాసరి ధర రూ.11, కనిష్ఠ ధర రూ.7తో విక్రయాలు జరిగాయి. టమాటా కోత కూలీలు, ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు.
➤ ఇక చీనీ ధరలు కూడా భారీగా పడిపోయాయి. నిన్న టన్ను గరిష్ఠంగా కేవలం రూ.19వేలతో అమ్ముడయ్యాయి. కనిష్ఠంగా రూ.8వేలు పలికాయి.

తనను తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు అడ్డకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య అంటూ తనను వెళ్లనివ్వట్లేదని తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలను సొంత నియోజకవర్గంలోకి వెళ్లకుండా ఎక్కడా అడ్డుకోవడం లేదని తెలిపారు. జేసీ కారణంగా తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని విమర్శించారు.

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రికి వస్తున్నారు. తిమ్మంపల్లి నుంచి కొండాపురం మీదుగా ఆయన పట్టణానికి రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పట్టణంలో పోలీసులు బందోబస్తును పెంచారు. మరోవైపు పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వమంటూ జేసీ వర్గీయులు ప్రకటించడంతో పట్టణంలో పొలిటికల్ హీట్ నెలకొంది. గతంలో పెద్దారెడ్డి రాకతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

SCRలో ఉద్యోగం చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో 31, సికింద్రాబాద్ డివిజన్‌లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5, నాందేడ్-5, గుంతకల్‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 03, 2025.

అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా 86 లఘు చిత్రాలు 18 విభాగాలలో పోటీ పడుతున్నాయని డైరెక్టర్ రషీద్ బాషా తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొన్న లఘు చిత్రాలను జ్యూరీ సభ్యులు చూసి అవార్డులకు ఎంపిక చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఫిల్మ్ సొసైటీ సభ్యులు తోట బాలన్న, యాంకర్ రమేశ్, గోపాల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.