Anantapur

News June 30, 2024

ధర్మవరంలో ముగిసిన హాకీ పోటీలు.. విజేత తిరుపతి జిల్లా జట్టు

image

ధర్మవరం పట్టణం ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో 14వ హాకీ ఏపీ స్టేట్ ఇంటర్ జిల్లా సీనియర్ మెన్ హాకీ ఛాంపియన్‌షిప్ పోటీలు 27 నుంచి 30వ తేదీ వరకు జరిగాయి. ఫైనల్ పోటీల్లో తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లా జట్లు తలపడగా.. 4-1 గోల్డ్ తేడాతో తిరుపతి జట్టు విన్నర్‌గా, శ్రీ సత్యసాయి జిల్లా జట్టు రన్నర్‌గా నిలిచింది. విశాఖపట్నం జిల్లా, ఎన్టీఆర్ జిల్లాపై విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది.

News June 30, 2024

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్టు కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలలో, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News June 30, 2024

అనంత: రూ.11 లక్షలతో ఉడాయించిన ఆర్బీకే అధికారి

image

కుందుర్పి మండలం జంబుగుంపుల రైతు భరోసా కేంద్రం విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ (వీహెచ్ఏ) ప్రవీణ్ రూ.11 లక్షల నగదుతో 10 రోజుల క్రితం ఉడాయించాడు. ఈ ఘటనపై మండల వ్యవసాయ అధికారి మహేశ్ ఆదివారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయితీ విత్తనాలు విక్రయించగా రూ.17 లక్షలు వచ్చాయని, అందులో ప్రవీణ్ రూ.11 లక్షలు తీసుకొని పరారయ్యాడని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News June 30, 2024

కోటంక సుబ్రమణ్యేశ్వర స్వామికి వెండి ఆభరణాల వితరణ

image

గార్లదిన్నె మండలంలోని కోటంక సుబ్రమణ్య స్వామికి ఆదివారం భక్తులు వెండి ఆభరణాలు వితరణ చేశారు. ఆకులేడుకు చెందిన కాశిరెడ్డి మదనమోహన్ రెడ్డి, సావిత్రమ్మ దంపతులు రూ.1,33,000 విలువ చేసే వెండి అర్ఘ్య పాత్ర ఉద్ధరిణి సమర్పించారు. కలుగూరు దేవా, వరలక్ష్మి దంపతులు రూ.23 వేలు విలువ గల వెండి అర్ఘ్య పాత్ర ఉద్దరిణి ఆలయ ప్రధాన అర్చకులు రామాచారులకు అందజేశారు.

News June 30, 2024

అనంతపురంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

image

అనంతపురంలో రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందన్నారు. రాత్రి ఒంటి గంట సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 30, 2024

అనంత: చీనీకాయల గరిష్ఠ ధర రూ.19,000

image

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో శనివారం చీనీకాయలు టన్నుకు గరిష్ఠంగా రూ.19వేలు, కనిష్ఠంగా రూ.8వేలు, సరాసరి రూ.12వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్‌ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. శనివారం అనంతపురం మార్కెట్‌కు మొత్తంగా 305 టన్నుల చీనీకాయలు వచ్చాయని జయలక్ష్మి వెల్లడించారు. చీనీకాయలు ధరలు క్రమేణా తగ్గుతుండడంతో రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News June 30, 2024

అనంత: వ్యవసాయ సలహా బోర్డులు రద్దు

image

అనంతపురం జిల్లాలో గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా బోర్డులను రద్దు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. ఒక బోర్డులో ఛైర్మన్‌తో పాటు పదిమంది సభ్యులు ఉంటారు. జిల్లా స్థాయిలో 2, మండల స్థాయిలో 63, గ్రామ పంచాయతీ స్థాయిలో 864 వ్యవసాయ సలహా బోర్డులు ఉండేవని.. ప్రభుత్వం వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

News June 30, 2024

8 నుంచి SKU తరగతులు ప్రారంభం

image

ఎస్కేయూ యూనివర్సిటీలో జులై 8 నుంచి తరగతులను ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపల్ కృష్ణకుమారి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మే 15 నుంచి యూనివర్సిటీలో వేసవి సెలవులు ఇచ్చామన్నారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉండగా యూనివర్సిటీలో తాగునీటి సమస్య కారణంగా తరగతులు ప్రారంభించలేదు. జులై 8 నుంచి యూనివర్సిటీలో తరగతులతో పాటు వసతిగృహాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

News June 30, 2024

జూలై 1న ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ: కలెక్టర్

image

జూలై 1న ఉదయం 6 గంటల నుంచే సామాజిక పెన్షన్ల పంపిణీ మొదలు కావాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ, రేషన్ పంపిణీపై జేసీ కేతన్ గార్గ్, తదితరులతో సమీక్ష నిర్వహించి పింఛన్ల పంపిణి సజావుగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

News June 29, 2024

జాతీయ లోక్ అదాలత్‌లో 4,254 కేసులు పరిష్కారం

image

అనంతపురంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 4,254 కేసులకు న్యాయమూర్తులు పరిష్కారం చూపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 27 బెంచ్‌లు నిర్వహించారు. రాజీ పడదగిన 707 క్రిమినల్ కేసులు, 69 సివిల్ కేసులు, 26 మోటారు వాహనాల పరిహారం కేసులు, 3,254 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయి. లోక్ అదాలత్ నిర్వహణను జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు సత్యవాణి పర్యవేక్షించారు.