India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్‌లో “ఎన్టీఆర్ భరోసా” పథకంపై సమావేశం జరిగింది. సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మంగళవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఫిబ్రవరి 1న పెన్షన్ల పంపిణీకి సంబంధించి డిఆర్డీఏ, పీడీ, మండల ప్రత్యేక అధికారులు, బ్యాంకు నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు, ఎపీఎంలతో సమావేశం జరిగింది.

గుత్తి మండలం రజాపురం గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గుత్తి మండలం కొత్తపల్లికి చెందిన చాకలి పవన్, గొల్ల పవన్ బైక్‌లో గుంతకల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా మట్టి కుప్పను ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చాకలి పవన్ మృతి చెందగా గొల్ల పవన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

నూతన ఎక్సైజ్ డిపో ప్రారంభ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అనంతపురం రూరల్‌లోని సోములదొడ్డి వద్దనున్న నూతన ఎక్సైజ్ డిపోను, పాత ఎక్సైజ్ డిపోలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ డిపోలలో కార్యకలాపాలు ఏ విధంగా సాగుతున్నాయో తెలుసుకున్నారు.

యాడికి మండలం సాగర్ సిమెంట్ ఏరియా, పంట పొలాల్లో గత 2రోజులుగా చిరుతలు సంచరిస్తున్నాయని గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గుత్తి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నారపరెడ్డి, బీట్ ఆఫీసర్ మాధవి, సీఐ వీరన్న, ఫారెస్ట్ సిబ్బంది మంగళవారం చిరుతల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడైనా చిరుతలు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు గ్రామస్థులకు సూచించారు.

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో మంగళవారం ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌కు చిరు సత్కారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా.. ఉత్తమ ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అవార్డు అందుకున్న విషయం విధితమే. ఏపీ జేఏసీ అమరావతి కమిటీ సభ్యులు కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపును విరమించుకోవాలని రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడారు. సంపదను సృష్టిస్తా అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ఆస్తులకు కన్నం వేస్తారా? అని ప్రశ్నించారు. వెంటనే రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

SUV సెగ్మెంట్‌లో Kia Syros కారును ఎంజీ బ్రదర్స్ కియా అనంతపురం ప్రతినిధులు మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఈ కారు అద్భుతమైన ఫీచర్స్, పెట్రోల్ & డీజిల్, మాన్యువల్ & ఆటోమేటిక్ వేరియంట్లతో అందుబాటులో ఉందని సీఈఓ ఆదిత్య మాచాని తెలిపారు. ఎస్బీఐ చీఫ్ మేనేజర్, ప్రముఖ యూట్యూబర్ వైభవ్, జీఎం ఎల్లన్న, జీఎం సేల్స్ గిరిప్రసాద్, సేల్స్ మేనేజర్ సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం-గుంటూరు మధ్య ప్రయాణం మరింత సులభం కానుంది. ఎన్‌హెచ్-544డి విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.5,417 కోట్లతో 219.8 కిలోమీటర్లను 21 బైపాస్‌లతో 4 లేన్లుగా అప్ గ్రేడ్ చేయనున్నారు. బుగ్గ నుంచి గిద్దలూరుకు 135 కి.మీ, వినుకొండ నుంచి గుంటూరుకు 84.8 కి.మీ మేర నాలుగు వరుసల రహదారి నిర్మించనున్నారు.

అనంతపురం జిల్లా కంబదూరు మండలం అండేపల్లి సమీపంలో ఉన్న రామప్ప కొండకు ప్రత్యేక చరిత్ర ఉంది. అనాది కాలం నుంచి ఈ కొండపై ఒక్క కాకి కూడా వాలదని వినికిడి. త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ కొండపై కాలు మోపారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అప్పటి నుంచి కాకి వాలని కొండగా దీనిని పిలుస్తూ ఉంటారు. ఇప్పటికీ ఈ కొండపై కాకి వాలకపోవడం గమనార్హం. శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడని చరిత్ర.

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజల తమ సమస్యలను అర్జీల రూపంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌కు, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మకు అందజేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామని బాధితులకు తెలిపారు.
Sorry, no posts matched your criteria.