India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉద్యోగ సాధనలో పట్టుదల ఉంటే సాధ్యంకానిది ఏదీ లేదని అనంతపురం ఎస్పీ జగదీశ్ అభిప్రాయపడ్డారు. కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో అర్హత సాధించి మెయిన్స్‌కు ఎంపికైన ఎస్కేయూ విద్యార్థులు 150 మందికి, జిల్లా హోమ్ గార్డులు 20 మందికి ఎస్పీ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ అందించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పట్టుదల, అంకిత భావంతో ఏదైనా సాధించవచ్చని అన్నారు.

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనంత జిల్లా పరిపాలన విభాగం జిల్లా అభివృద్ధికి విశేష సేవలు అందించిన వ్యక్తులను సత్కరించింది. జేఎన్‌టీయూఏ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ జాతీయ సేవా పథకం అధికారి డాక్టర్ జి.మమత, జిల్లాలో సమగ్ర అభివృద్ధి కోసం అందించిన సేవలకు గుర్తింపుగా మెరిటోరియస్ డిపార్ట్మెంట్ సర్వీస్ విభాగంలో సత్కారాన్ని అందుకున్నారు.

బత్తలపల్లి మండల కేంద్రంలో తమ చిన్నారిని త్రివర్ణ పతాకం డ్రస్సుతో అలంకరించి భారతదేశంపై ఉన్న అభిమానాన్ని ఓ ముస్లిం కుటుంబం చాటుకుంది. సయ్యద్ దాదాపీర్, సయ్యద్ ఫర్హాన దంపతులు తమ చిన్నారి అర్ఫాకు త్రివర్ణ పతాకం రంగులతో కూటిన డ్రెస్‌ను అలంకరించారు. జాతీయ జెండాను పట్టుకొని బత్తలపల్లి 4 రోడ్ల కూడలిలో జై భారత్.. జై భారత్.. అంటూ భారతదేశం గొప్పతనం గురించి కొనియాడారు.

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో రేపు (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశము సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

అనంతపురం నగర సమీపంలోని రైల్వే ట్రాక్ పై తోపుదుర్తి మహేశ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున నాగిరెడ్డిపల్లి – సోములదొడ్డి మధ్య ఉన్న రైల్వే ట్రాక్ పై మృతదేహం కనిపించిందని స్థానికులు తెలిపారు. అయితే మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

అనంతపురం(D) పుట్లూరు(M) కడవకల్లుకు చెందిన మాడుగుల నాగఫణిశర్మ ఆర్ట్ విభాగంలో పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. నాగభూషణశర్మ, సుశీలమ్మకు 1959లో జన్మించారు. పదో తరగతి పుట్లూరులో చదివి, సాహిత్య శిరోమణి పట్టా కోసం తిరుపతి వెళ్లారు. ఆంధ్ర, మైసూర్, ఢిల్లీ విశ్వవిద్యాలయాలలో చదివారు. 1985-90లో కడపలో సంస్కృత ఉపన్యాసకుడిగా చేశారు. 1990-92 మధ్యకాలంలో టీటీడీ ధర్మప్రచార పరిషత్తు అడిషనల్ కార్యదర్శిగా పనిచేశారు.

జనవరి 26న పురస్కరించుకొని రిపబ్లిక్ వేడుకలకు అనంతపురం జిల్లా సర్వం సిద్ధమైంది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాన్ని జాతీయ పతాకం లోని కాషాయపు రంగు, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన విద్యుత్ దీపాలను అలంకరించారు. విద్యుత్ దీపాలు సుందరంగా అలంకరించడంతో కలెక్టర్ కార్యాలయం ఆకట్టుకుంటోంది. రేపు ఉదయం జాతీయ జెండా త్రివర్ణ పతాకాలు ఎగరనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించగా ఏపీ నుంచి ఐదుగురికి వరించాయి. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లు గ్రామానికి చెందిన మాడగుల నాగఫణిశర్మ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆర్ట్ విభాగంలో నాగఫణిశర్మకు కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ప్రకటించింది.

నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ‘పద్మభూషణ్’ పురస్కారం వరించడంపై అనంతపురం జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. 1960లో జన్మించిన బాలయ్య 14ఏళ్ల వయసులోనే తాతమ్మకల చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు 109 సినిమాల్లో నటించారు. సినీరంగంలో రాణిస్తూ 2014లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన హ్యాట్రిక్ గెలుపు సాధించారు. బసవతారకం ఆసుపత్రితో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇద్దరు నేతలను వైసీపీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో కళ్యాణదుర్గం మున్సిపల్ వైస్ ఛైర్మన్ జయం ఫణీంద్ర, బ్రహ్మసముద్రం జడ్పీటీసీ ప్రభావతమ్మను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఇటీవల జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే సురేంద్రబాబుకు వైస్ ఛైర్మన్ జయం ఫణీంద్ర సన్మానం చేసినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.