Anantapur

News November 29, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో 37 మంది హెడ్ కానిస్టేబుళ్ల బదిలీ

image

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో స్టేషన్లలో 37 మంది హెడ్ కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ వీ.రత్న ఉత్తర్వులు జారీ చేశారు. ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు బదిలీ అయిన హెడ్ కానిస్టేబుళ్లు పోస్టింగ్ అయిన స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News November 29, 2024

BREAKING: అనంత జేఎన్టీయూ ఫార్మా డీ ఫలితాల విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని ఫార్మా డీ 1వ సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ (R17) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News November 29, 2024

మీటర్ రీడర్ల సమస్యలపై అనంతపురంలో నిరసన

image

విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనంతపురంలోని ఎస్ఈ విద్యుత్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేశ్ గౌడ్ మాట్లాడుతూ.. మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. విధుల్లో వారిని ఒత్తిడికి గురిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News November 29, 2024

మడకశిర వద్ద బాలుడి దారుణ హత్య!

image

మడకశిర మండలం ఆమిదాలగొంది గ్రామ ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చేతన్ కుమార్ నిన్న అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేడు మడకశిర సరిహద్దులోని కర్ణాటక అటవీ ప్రాంతంలో బాలుడు మృతిచెంది కనిపించాడు. దుండగులే ఎత్తుకెళ్లి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో హత్యకు సంబంధించి వాస్తవ వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

News November 29, 2024

రాయలసీమలో వర్షాలు

image

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో నేడు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రేపు అనంతపురం, సత్యసాయి, డిసెంబర్ 1న అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News November 29, 2024

జేసీ vs ఆది.. నేడు సీఎం వద్దకు బూడిద పంచాయితీ

image

జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య బూడిద పంచాయితీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. నేడు ఇరువురు నేతలూ సీఎంను కలవనున్నారు. వారంరోజులుగా కొనసాగుతున్న ఈ వివాదానికి తెరదించే అవకాశముంది. ప్రభుత్వంలోని నేతల వ్యవహారమే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాశం కావడం, స్థానికంగా 144 సెక్షన్ విధించే పరిస్థితులు రావడంపై ఇదివరకే సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

News November 29, 2024

వైఎస్ జగన్ ప్రకటన పచ్చి అబద్ధం: మంత్రి సత్యకుమార్

image

మాజీ సీఎం వైఎస్ జగన్‌ మొహంలో అధికారం లేదన్న నిరాశ స్పష్టంగా కనిపిస్తోందని వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గురువారం తాడేపల్లిలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి, కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య రంగంలో 52 వేల మందిని నియమించామంటూ వైఎస్ జగన్ ప్రకటన చేయడం పచ్చి అబద్ధమని పేర్కొన్నారు.

News November 29, 2024

ధర్మవరం సీఐ తల్లి హత్య కేసులో నిందితుడి అరెస్ట్

image

సంచలనం రేకెత్తించిన ధర్మవరం సీఐ నాగేంద్ర తల్లి స్వర్ణకుమారి హత్యకేసులో నిందితుడు అనిల్‌ను అరెస్టు చేసినట్లు మదనపల్లె సీఐ కళా వెంకటరమణ తెలిపారు. నీరుగట్టుపల్లిలో సెప్టెంబర్ 28న జగన్ కాలనీకి చెందిన వెంకటేశ్, గజ్జలకుంట అనిల్‌తో కలిసి నగల కోసం ఇంట్లోనే ఆమెను హత్యచేశారు. ఈ కేసులో వెంకటేశ్ అరెస్ట్ కాగా, పరారీలో ఉన్న అనిల్‌ ములకలచెరువు వద్ద ఈనెల 24న విషంతాగి ఆస్పత్రిలో చేరి పోలీసులకు చిక్కి అరెస్టయ్యాడు.

News November 29, 2024

ఇంటర్ పరీక్ష పరీక్ష ఫీజు డిసెంబర్ 5 వరకు చెల్లించవచ్చు: డీఈవో

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ పరీక్ష ఫీజులు డిసెంబర్ 5వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చునని డీఈవో రఘునాథరెడ్డి తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ సంకల్ప-2025 కార్యక్రమం చేపట్టింది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు విద్యార్థులకు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్స్ ఉంటాయన్నారు.

News November 29, 2024

జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యం: టీజీ భరత్

image

జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 1,000 హెక్టార్ల భూమి ఉంటే పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చని తెలిపారు.

error: Content is protected !!