Anantapur

News June 23, 2024

హైదరాబాద్‌లో అనంత జిల్లా వాసి సూసైడ్

image

హైదరాబాదులో అనంత జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్ చేసుకున్నాడు. CI ఆదిరెడ్డి వివరాలు.. సురేశ్(36) HYDలో ఉంటున్నాడు. ఈనెల 20న షాద్‌నగర్ వెళ్తునట్లు భార్యకు చెప్పి వెళ్లిన సురేశ్ జడ్చర్లలో హైవే పక్కన హోటల్‌లో రూం తీసుకున్నాడు. అదేరోజు రాత్రి పురుగు మందుతాగి సూసైడ్ చేసుకోగా సిబ్బంది గుర్తించారు. ఆత్మహత్యకు చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ దొరికిందని భార్య మంజుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

News June 23, 2024

అనంత:గుండెపోటుతో వ్యక్తి మృతి

image

సీపీఎం అనంతపురం జిల్లా కమిటీ సభ్యులు ముష్కిన్ గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం ఉదయం ఆయన అనంతపురంలోని మార్కెట్ యార్డు వద్ద అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ముస్లిం మైనార్టీ విభాగం ఆవాజ్ రాష్ట్ర నాయకులుగా ఉన్నారు.

News June 23, 2024

అనంతపురం: రేపటి నుంచి మీకోసం కార్యక్రమం

image

ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం అడుగులేస్తోంది. ప్రతి సోమవారం తహశీల్దార్, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో ‘మీకోసం’ అనే కార్యక్రమాన్ని ఈనెల 24 నుంచి ప్రారంభించనుంది. దీనిపై ఇది వరకే కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. జిల్లా మండల కేంద్రంలో ప్రజలు స్థానికంగా సమస్యలను అర్జీల రూపంలో ఇచ్చుకోవచ్చు అన్నారు.

News June 23, 2024

ఉమ్మడి అనంతలో శ్రేష్ఠ ప్రవేశ పరీక్షలో 30 మంది అర్హత

image

అనంతపురం జిల్లా నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కార్పొరేట్ సీబీఎస్ఈ పాఠశాలల్లో ప్రవేశానికి ఉమ్మడి జిల్లా నుంచి 30 మంది అర్హత సాధించినట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సమన్వయకర్త ఎ. మురళీకృష్ణ తెలిపారు. జాతీయస్థాయిలో నిర్వహించిన శ్రేష్ఠ ప్రవేశ పరీక్షలో 30 మంది 3వేల లోపు ర్యాంకులు సాధించారని ఆయన తెలిపారు.

News June 23, 2024

తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

image

తాడిపత్రి మండలంలోని బ్రాహ్మణపల్లిలో శనివారం రాత్రి వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్త చెన్నారెడ్డి ఇంటి ముందు ఉన్న రహదారిపై వర్షపునీరు నిలబడుతున్నాయని మట్టిని ఎత్తుగా వేశారు. దీంతో ఆ నీరంతా టీడీపీ నాయకుడు కథాలప్ప ఇంటి ముందుకు రావడంతో మట్టిని ట్రాక్టర్ తో తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఐదు మందికి గాయాలయ్యాయి.

News June 23, 2024

డయేరియా ప్రబలకుండా చర్యలు: జిల్లా కలెక్టర్

image

జిల్లాలో డయేరియాతో ఏ ఒక్కరూ బాధపడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డయేరియాపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలను అనుసరించి ఆయా శాఖల జిల్లా అధికారులు వారి శాఖల పరిధిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు.

News June 22, 2024

రేపు పెనుకొండకు మంత్రి సవిత రాక

image

బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రేపు జిల్లాకు రానున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆమె తొలిసారి జిల్లాకు వస్తున్నారు. ఉదయం 6.15 గంటలకు విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి ఉ.9.20 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో ఉ.11 గంటలకు బాగేపల్లి టోల్గేట్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా పెనుకొండకు చేరుకుంటారు. నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. సోమవారం తిరిగి విజయవాడ వెళ్లనున్నారు.

News June 22, 2024

అనంతపురం వైసీపీ కార్యాల‌యానికి నోటీసులు

image

తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యాన్ని ఇవాళ ఉద‌యం కూల్చివేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అనంతపురం ప‌రిధిలోని HLC కాలనీలో వైసీపీ కార్యాల‌యానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమ‌తులు లేకుండా నిర్మించార‌ని అభ్యంత‌రం వ్యక్తం చేశారు. నోటీసుకు ఏడురోజుల్లో వివరణ ఇవ్వాలని లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపల్ అధికారులు వైసీపీ జిల్లా అధ్యక్షుడికి ఈ నోటీసులు జారీ చేశారు.

News June 22, 2024

రాయలసీమ మాండలికం

image

★ బొరుగులు – మరమరాలు
★ ఎచ్చులు/ఎచ్చలు – ఆడంబరం
★ శెనక్కాయలు/బుడ్డలు – వేరుశనగ
★ చెనిక్కాయ పప్పులు – పల్లీలు
★ పొద్దుగొంకులూ – రోజంతా
★ బారాకట్ట – అష్టాచెమ్మ
★ జాంకులు – మాటిమాటికీ
★ ఊరిబిండి/పచ్చడి – చట్నీ
★ ఊపిరిబుడ్డ – బెలూన్ ★ తావు – చోటు

News June 22, 2024

సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కారాలకు దరఖాస్తులు

image

2025 సంవత్సరానికి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. విపత్తు నిర్వహణ రంగంలో వ్యక్తులు, సంస్థలు చేసిన అద్భుతమైన కృషిని గుర్తించి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. జులై 1 నుంచి ఆగస్టు 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.