Anantapur

News June 22, 2024

అనంత: తొలిసారి అసెంబ్లీలోకి 8మంది ఎమ్మెల్యేలు

image

జిల్లాలో తొలిసారి అసెంబ్లీలోకి 8మంది ఎమ్మెల్యేలుగా అడుగు పెట్టారు.☞అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా దగ్గుపాటి వెంకటశ్వరప్రసాద్ ☞శింగనమల ఎమ్మెల్యేగా బండారు శ్రావణిశ్రీ☞పెనుకొండ ఎమ్మెల్యేగా సవిత☞పుట్టపర్తి ఎమ్మెల్యేగా పల్లె సింధూరరెడ్డి ☞కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా అమిలినేని సురేంద్రబాబు☞తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ అస్మిత్ రెడ్డి☞ధర్మవరం ఎమ్మెల్యేగా వై.సత్యకుమార్ యాదవ్☞ మడకశిర ఎమ్మెల్యేగా ఎంఎస్ రాజు.

News June 22, 2024

సత్యసాయి: భూ సేకరణపై జేసీ సమావేశం

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని జాతీయ రహదారులకు సంబంధించి భూ సేకరణపై జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెనుకొండ సబ్ కలెక్టర్‌తో కలిసి పెనుకొండ, కదిరి, ధర్మవరం ఆర్డీవోలతో పాటు సంబంధిత మండలాల తహాసిల్దార్లతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. భూ సేకరణకు సంబంధించి పలు సూచనలు చేశారు.

News June 21, 2024

మా తాత కల నెరవేరింది: ఎమ్మెల్యే బండారు శ్రావణి

image

ఇవాళ తమ తాత కల నెరవేరిందంటూ శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ట్వీట్ చేశారు. ‘నేను ఎమ్మెల్యే కావాలన్నది మా తాత బండారు నారాయణ స్వామి కల. అది నెర వేర్చేందుకు నా వెన్నంటి ఉన్న తల్లిదండ్రులు, నాకు తోడుగా నిలిచిన శింగనమల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నా. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ చేయూతతో అసెంబ్లీలో శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశా’ అని పోస్ట్ పెట్టారు.

News June 21, 2024

మడకశిర టీడీపీ ఎమ్మెల్యే బంపరాఫర్

image

మడకశిర నుంచి విజయం సాధించిన ఎంఎస్ రాజు డీఎస్సీకి సిద్ధమవుతున్న వారికి బంపరాఫర్ ప్రకటించారు. డీఎస్సీ కోసం ఉచితంగా శిక్షణ ఇస్తామని ప్రకటించారు. మడకశిర నియోజకవర్గంలో డీఎస్సీ ఎస్జీటీ పోస్టులకు సన్నద్ధమవుతున్న వారికి మాత్రమే ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆయన కార్యాలయ సిబ్బంది ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

News June 21, 2024

అనంత జిల్లాలో బీసీ సంక్షేమ హాస్టల్ కోసం దరఖాస్తు చేసుకోండి

image

అనంత జిల్లాలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం అర్హులైన విద్యార్థుల దరఖాస్తులు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బుకొఠారి తెలిపారు. తాడిపత్రి, కళ్యాణదుర్గం, అనంతపురం డివిజన్ల పరిధిలోని 38 ప్రీమెట్రిక్ వసతి గృహాల్లో బాలురకు 3,103, బాలికలకు 1,364 సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు. 17 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో బాలురకు 622, బాలికలకు 547 సీట్లు ఉన్నట్లు తెలిపారు.

News June 21, 2024

సవిత అనే నేను

image

పెనుకొండ ఎమ్మెల్యేగా సవిత ప్రమాణం స్వీకారం చేశారు. అసెంబ్లీలో ఆమె చేత ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయించారు. కాగా ఆమె బీసీ సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

News June 21, 2024

అనంతపురం: నేటి నుంచి కిలో పచ్చిమిర్చి రూ.42

image

పచ్చిమిర్చి ధరలు ఆకాశనంటుతున్నాయి. సామాన్య ప్రజలు కొనలేక ఇబ్బందులు పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.42కే ఇవ్వాలని నిర్ణయించింది. రైతు బజార్లలో విక్రయాలు చేపట్టాలని జిల్లా మార్కెటింగ్ శాఖ ఆదేశించింది. కడప జిల్లా పులివెందుల నుంచి పచ్చిమిర్చిని తెప్పించింది. బహిరంగ మార్కెట్‌లో పచ్చిమిరప రూ.70 నుంచి 80 ఉండడంతో శుక్రవారం నుంచి అనంత ఎన్టీఆర్ రైతు బజార్‌లో రూ.42కే విక్రయాలు ప్రారంభమవుతున్నాయి.

News June 21, 2024

ATP: డ్రైవింగ్ స్కూల్‌లోనే రెన్యువల్

image

అనంతపురం నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్‌లోనే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌ను పొందవచ్చని ఆర్టీసీ డిపో మేనేజర్ నాగ భూపాల్ ప్రకటనలో తెలిపారు. అనంతపురం రవాణా శాఖ ఉత్తర్వుల మేరకు ఒక రోజు నాన్ రెసిడెన్సియల్ ట్రైనింగ్ ఇచ్చి రెన్యువల్‌ను అందిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆర్టీసీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

News June 20, 2024

ATP: పింఛన్ పెంపు.. 5.60 లక్షల మందికి లబ్ధి?

image

జులై 1 నుంచే పింఛన్ పెంపును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. జులై 1న ఇచ్చే రూ.4 వేలు, ఏప్రిల్ నుంచి 3 నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ లెక్కన అవ్వతాతలకు జులై 1న ₹7 వేల పింఛన్ అందనుంది. ఈ పెంపుతో అనంతపురం జిల్లాలో సుమారు 2.80 లక్షలు, సత్యసాయి జిల్లాలో 2.72 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 5.60 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.

News June 20, 2024

గవర్నర్‌ను కలిసిన అనంతపురం జిల్లా మంత్రులు

image

అనంతపురం జిల్లా మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌నును మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్ భవన్‌లో ఆయన్ను కలిసి పూలమొక్కను అందించారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని వారికి గవర్నర్ సూచించారు. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వారు గవర్నర్‌ను కలిశారు.