India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా పోటీల్లో అనంతపురం జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. విజయవాడలోని జడ్పీహెచ్ఎస్ పటమటలో సోమవారం నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో అనంతపురం జిల్లా అండర్14 బాలుర జట్టు రెండవ స్థానంలో నిలిచినట్లు కోచ్ మారుతి ప్రసాద్, మంజునాథ్ తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరచిన జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులను జాతీయ స్థాయికి ఎంపిక చేసినట్లు వారు పేర్కొన్నారు.
స్పందన అర్జీలకు పోలీసు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజలను నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి 82 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. అర్జీదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అర్జీలను సంబంధిత పోలీసు అధికారులకు పంపించారు.
శ్రీశైలంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లికి చెందిన మల్లికార్జున(56) అనే భక్తుడు సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. మల్లన్న దర్శనానికి వచ్చిన ఆయన కళ్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పిస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తోటి భక్తులు తెలిపారు. దేవస్థానం అధికారులు, పోలీసులు పరిశీలించి, మృతుడి బంధువులకు సమాచారం అందించారు.
ఉన్నత పాఠశాలల వేళలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడానికి శ్రీ సత్యసాయి జిల్లాలో 32 మండలాల్లో నేటి నుంచి పైలెట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్టు డీఈవో కిష్ణప్ప తెలిపారు. 32 మండలాల్లోని పాఠశాలల్లో ఒక్కో ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి, ఆ వివరాలను ఆయా మండలాల ఎంఈవోలు, పాఠశాల హెచ్ఎంలకు పంపామన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు పాఠశాల పనివేళలను పాటించాలని ఆదేశించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ కాలేదని డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల యజమానులు హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ ఆదివారం పేర్కొన్నారు. హాల్ టికెట్లు నిరాకరించడం, తరగతులు, ప్రాక్టికల్ పరీక్షలకు అనుమతించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం వంటివి చేస్తే సంబంధిత కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పరామర్శించారు. ఎల్లుట్ల గ్రామానికి వెళ్ళి ఎమ్మెల్యే బండారు శ్రావణ శ్రీ తో కలిసి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. ఐదు లక్షల నష్ట పరిహారం చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ తదితర అధికారులు ఉన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యల కారణంగా ఏ విద్యార్థికి హాల్ టిక్కెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాకుండా నిరోధించడం చేయరాదని కలెక్టర్ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఏ డిగ్రీ, ఇంటర్మీడియట్ కళాశాలలలో అయినా విద్యార్థులకు హాల్ టిక్కెట్లు నిరాకరించడం, తరగతులకు/ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాకుండా నిరోధిస్తే సంబంధిత కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతపురం జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిన్న గార్లదిన్నె వద్ద జరిగిన ఘోర ఘటనను మరువక ముందే పుట్లూరు మండలంలోని నారాయణరెడ్డిపల్లి వద్ద మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని నారాయణరెడ్డిపల్లి వద్ద బైకు ఎద్దుల బండిని ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా మరొకరికి త్రీవ గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరికి చెందిన క్రికెటర్ గిరినాథ్ రెడ్డి ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్నారు. రూ.30 లక్షల బెస్ ప్రైస్ తో అతడు తన పేరును వేలంలో రిజిస్టర్ చేసుకున్నారు. నేడు, రేపు దుబాయ్ వేదికగా ఐపీఎల్-2025 మెగా వేలం జరగనుంది. గిరినాథ్ రెడ్డిని ఏ జట్టు కొనుగోలు చేస్తుందో ఇవాళ లేదా రేపు తెలియనుంది.
అనంతపురం జిల్లా పుట్లూరు మండల పరిధిలోని <<14693066>>ఎల్లుట్ల <<>>గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిన్న గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు వీరే.. నాగన్న, నాగమ్మ (భార్యాభర్తలు), ఈశ్వరయ్య, కొండమ్మ (దంపతులు), రామాంజనమ్మ, బాలపెద్దయ్య, జయరాముడు, పెద్ద నాగమ్మ. ఒకే ప్రమాదంలో వీరంతా మృతి చెందడంతో గ్రామం కన్నీటి పర్యంతమవుతోంది.
Sorry, no posts matched your criteria.