India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మైనర్లు వాహనాలు డ్రైవ్ చేయడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇది చట్టరీత్యా నేరమని SP జగదీశ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో గురువారం “స్టాప్ మైనర్ డ్రైవింగ్ ” నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా 98 కేసులు నమోదు చేశామని, 97 వాహనాలు సీజ్ చేశామన్నారు. తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని SP కోరారు.

అనంతపురం జేఎన్టీయూ ఓటీపీఆర్ఐ విద్యార్థులు GPAT-2026లో సత్తా చాటారు. గ్రీష్మ (ర్యాంక్-935), చంద్రశేఖర్ రెడ్డి (ర్యాంక్-2351), మహమ్మద్ యూసఫ్ (ర్యాంక్-3381), షేక్ జమీలా (ర్యాంక్-4929), కిరణ్ (ర్యాంక్-9570) సాధించారు. ఓటీపీఆర్ఐ డైరెక్టర్ సుబ్బారెడ్డి విద్యార్థులను అభినందించారు.

దేశంలో మొట్ట మొదటిసారి పూర్తిగా డిజిటల్ విధాన జనగణన జరుగుతోందని జిల్లా రెవెన్యూ అధికారి మలోల పేర్కొన్నారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాల, జేఎన్టీయూలో జరుగుతున్న జనగణన నమోదు ప్రక్రియపై ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు అవగాహన శిక్షణ జరుగుతోంది. ఈ శిక్షణ తరగతులను RIO పరిశీలించారు. ఈ ప్రక్రియపై ప్రజలు ఎలాంటి అనుమానాలు, అపోహలను పెట్టుకోవద్దన్నారు.

జిల్లా అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ చేసిన సేవలు వెలకట్టలేనివని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కొనియాడారు. ఫెర్రర్ 106వ జయంతి సందర్భంగా అనంతపురంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం FCRA అనుమతులు మంజూరు చేయడం వల్ల ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా అందుతాయని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

పుట్లూరు మండలంలో విద్యుత్ కేబుల్ వైర్ల చోరీలు పెరగడంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. నిన్న చింతలపల్లె ఘటన మరువకముందే పుట్లూరులోని వ్యవసాయ పొలాల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు కేబుల్ వైర్లు దోచుకెళ్లారు. రైతులు లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, పెద్దయ్యలకు చెందిన వైర్లు పోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరుస దొంగతనాలతో సాగుకు ఆటంకం కలుగుతోందని రైతులు వాపోతున్నారు.

ఇంజినీరింగ్ విద్యార్థులు ఐటీ రంగంలో రాణించేందుకు అవసరమైన శిక్షణ అందించాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కోరారు. బుధవారం జేఎన్‌టీయూ వీసీ సుదర్శన్ రావును కలిసి బెంగళూరు ఐటీ నిపుణుల బృందాన్ని పరిచయం చేశారు. చివరి ఏడాది విద్యార్థులకు ఏఐ వంటి ఆధునిక అంశాలపై శిక్షణ ఇస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన విసి, త్వరలోనే కమిటీ వేసి శిక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు.

అనంతపురం జేఎన్టీయూలోని పరిపాలన భవనంలో మంగళవారం వీసీ హంచాటే సుదర్శన రావు, యూనివర్సిటీ సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ.. 15వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజులలో యూనివర్సిటీకి మరిన్ని విజయాలను సాధించేందుకు కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, యూనివర్సిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.

Sorry, no posts matched your criteria.