Anantapur

News November 24, 2024

IPL వేలానికి మన కదిరి యువకుడు..!

image

ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరికి చెందిన క్రికెటర్ గిరినాథ్ రెడ్డి ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్నారు. రూ.30 లక్షల బెస్ ప్రైస్ తో అతడు తన పేరును వేలంలో రిజిస్టర్ చేసుకున్నారు. నేడు, రేపు దుబాయ్ వేదికగా ఐపీఎల్-2025 మెగా వేలం జరగనుంది. గిరినాథ్ రెడ్డిని ఏ జట్టు కొనుగోలు చేస్తుందో ఇవాళ లేదా రేపు తెలియనుంది.

News November 24, 2024

అనంతపురం జిల్లా విషాద ఘటనలో మృతులు వీరే!

image

అనంతపురం జిల్లా పుట్లూరు మండల పరిధిలోని <<14693066>>ఎల్లుట్ల <<>>గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిన్న గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు వీరే.. నాగన్న, నాగమ్మ (భార్యాభర్తలు), ఈశ్వరయ్య, కొండమ్మ (దంపతులు), రామాంజనమ్మ, బాలపెద్దయ్య, జయరాముడు, పెద్ద నాగమ్మ. ఒకే ప్రమాదంలో వీరంతా మృతి చెందడంతో గ్రామం కన్నీటి పర్యంతమవుతోంది.

News November 24, 2024

అనంతపురం: ఘోర రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి

image

గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను బస్సు ఢీకొన్న ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సాయంత్రం వరకు ఏడుగురు మరణించగా.. ప్రస్తుతం అనంతపురంలోని సవేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరయ్య మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ఈశ్వరయ్యకు మెరుగైన వైద్యసేవలు అందించినా.. దురదృష్టవశాత్తు అతను కూడా మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

News November 23, 2024

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం: వైయస్ జగన్

image

అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం తలగాసిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మత్యువాత పడ్డారు. వీరంతా కూలీ పనులకు వెళ్ళొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం మాజీ సీఎం జగన్ తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News November 23, 2024

ATP: ఘోరం.. ఒకే ఊరిలో ఏడుగురి మృతి

image

అనంతపురం జిల్లాలో మధ్యాహ్నం జరిగిన <<14686395>>ఘోర రోడ్డు ప్రమాదం<<>> ఓ ఊరినే విషాదంలోకి నెట్టేసింది. ఈ ఘటనలో పుట్లూరు(M) ఎల్లుట్ల గ్రామానికి చెందిన ఏడుగురు చనిపోయారు. మృతులు డి.నాగమ్మ, బి.నాగమ్మ, బి.నాగన్న, రామాంజినమ్మ, బాల పెద్దయ్య, కొండమ్మ, జయరాముడిగా గుర్తించారు. కాగా ఇందులో నాగమ్మ, నాగన్న భార్యాభర్తలు. అరటికాయల కూలీ పనులకు ఆటోలో వెళ్తుండగా బస్సు ఢీకొని వీరంతా చనిపోయారు.

News November 23, 2024

గార్లదిన్నె: రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

image

గార్లదిన్నె మండలం తలగాసిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై  జరిగిన రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ పి.జగదీష్ పరిశీలించారు. ఈ ప్రమాద ఘటనలో మొత్తం నలుగురు చనిపోయారు. కూలి పనుల కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News November 23, 2024

వచ్చే ఏడాది పుట్టపర్తిలో రుద్ర మహా యాగం

image

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అతి పెద్ద రుద్ర మహా యాగం నిర్వహిస్తున్నట్లు శ్రీసత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు నిమిష్ పాండే పేర్కొన్నారు. ప్రపంచ శాంతి కోసం పుట్టపర్తిలో యోగం చేస్తున్నామని చెప్పారు. దేశంలోని అన్ని దేవాలయాల నుంచి ప్రముఖ పండితులు తరలి వచ్చి ఈ యాగంలో పాల్గొంటారన్నారు.

News November 23, 2024

SKU బ్యాడ్మింటన్ జట్టు ఇదే..!

image

శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అంతర కళాశాలల బ్యాడ్మింటన్ జట్టు ప్రకటించారు. ఇందులో జాహ్నవి(వాణి డిగ్రీ కళాశాల), తన్మయి (SSGS డిగ్రీ కళాశాల గుంతకల్), సమీరా (SSBN డిగ్రీ కళాశాల) ఉన్నారు. ఈ జట్టు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ, జట్లతో తలపడనుంది. విశ్వేశ్వరయ్య యూనివర్సిటీ బెల్గావ్ యూనివర్సిటీ లో 26 నుంచి 28 వరకు పోటీలు జరగుతాయని రిజిస్టార్ రమేశ్ బాబు తెలిపారు.

News November 23, 2024

అనంతపురం జిల్లా ప్రజలకు గమనిక

image

ఓటు నమోదుకు నేడు, రేపు ప్రత్యేక ప్రచార క్యాంపులు నిర్వహించనున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి 2025 జనవరి 1వ తేదీ నాటికి వయసు 18 ఏళ్లు నిండిన లేదా నిండనున్న వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ప్రతి గ్రామంలోని బీఎల్వోలు వద్ద నేడు, రేపు దరఖాస్తు ఫారాలు ఉంటాయని.. సంప్రదించి ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు.

News November 23, 2024

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

image

పెద్దపప్పూరు మండలం సింగనగుట్ట పల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సునీత(30) అనే మహిళ గ్రామ శివారులోని పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అయితే సునీత గురువారం రాత్రి నుంచి కనిపించడం లేదు. పొలంలో మృతదేహాన్ని గమనించి కుటుంబ సభ్యులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మృతదేహం పక్కన పురుగుల మందు డబ్బా లభించింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.