Anantapur

News June 18, 2024

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. సత్యసాయి, అనంత జిల్లాకు 9, 11వ స్థానం

image

ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో సత్యసాయి జిల్లాలో 2524 మంది పరీక్షలు రాయగా 1557 మంది పాసయ్యారు. 62 % ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. అనంత జిల్లాలో 4811 మంది పరీక్షలు రాయగా 2920 మంది పాసయ్యారు. 61 % ఉత్తీర్ణతతో జిల్లా 11వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ కోర్సులో సత్యసాయి జిల్లాలో 310 మంది పరీక్ష రాయగా 183 మంది, అనంత జిల్లాలో 445 మంది పరీక్ష రాయగా 264 మంది పాసయ్యారు.

News June 18, 2024

అకౌంట్‌‌కు ఆధార్ అనుసంధానం చేయించుకోండి: డీఈఓ

image

నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ = ఎంపికైన విద్యార్థులు స్కాలర్ షిప్ కోసం ఎంపికైన విద్యార్థులు స్కాలర్ షిప్ కొరకు బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను అనుసంధానం చేయించుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి పేర్కొన్నారు. 2019, 2020, 2021, 2022 సంవత్సరాల్లో 9, 10, 11,12 తరగతులు చదువుతూ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్‌లో నమోదుచేసుకున్న విద్యార్థులు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలన్నారు.

News June 18, 2024

గార్లదిన్నెలో తప్పిన ప్రమాదం.. లారీ బోల్తా

image

చీని కాయల లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి మంగళవారం బోల్తా పడింది. లారీ తిమ్మంపేట నుంచి గార్లదిన్నెలోకి వస్తుండగా శింగనమల క్రాస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News June 18, 2024

భారత సాఫ్ట్ టెన్నిస్ జట్టుకి అనంత కుర్రాడు ఎంపిక

image

అనంతపురానికి చెందిన ఆరోన్ రోనాల్డిన్ భారత సాఫ్ట్ టెన్నిస్ జట్టుకు ఎంపికైనట్లు ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దారం దిలీప్ కుమార్ విజయవాడ రాష్ట్ర సాఫ్ట్ టెన్నీస్ కార్యాలయంలో తెలిపారు. జూన్ 18 నుంచి 23 వరకు కొరియాలోని ఇంచియాన్‌లో జరుగనున్న నొంగ్యుప్ బ్యాంక్ ఇంచియాన్ కొరియా కప్ పోటీలలో భారతజట్టుకి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడని పేర్కొన్నారు.

News June 18, 2024

సత్యసాయి: యువతి మృతి.. కారణమిదే

image

ఓబుళదేవరచెరువు మండలం చౌడంపల్లిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఎస్ఐ వంశీకృష్ణ వివరాలు..యువతి ఇంట్లో తరచూ ఫోన్‌లో మాట్లాతుండగా తల్లిదండ్రులు దండించారు. దీంతో ఆమె ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. వెతికినా కనబడలేదన్నారు. సోమవారం గ్రామ సమీపంలోని చెక్‌‌డ్యాం వద్ద యువతి మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని అనుమానిస్తున్నట్లు తెలిపారు.

News June 18, 2024

అనంత: రానున్న రెండు రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు

image

రానున్న రెండు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే సూచన ఉందన్నారు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News June 18, 2024

ధర్మవరం: మంత్రి సత్యకుమార్ పర్యటన నేటి షెడ్యూల్ ఇదే

image

మంగళవారం మంత్రి సత్యకుమార్ ధర్మవరంలో పర్యటించనున్నారు. తొలుత కదిరి గేటు వద్దనున్న చేనేత విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి దిమ్మెల సెంటర్ మీదుగా తేరుబజారుకు వెళతారు. అనంతరం దుర్గమ్మగుడిలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. అక్కణ్నుంచి కళాజ్యోతి సర్కిల్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పిస్తారు. మారుతీనగర్‌లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు.

News June 17, 2024

ధర్మవరం : రోడ్డు ప్రమాదంలో బేల్దారి మృతి

image

ధర్మవరంలో బైకుపై వెళుతున్న కంసల లక్ష్మీనారాయణ చారి (39)ని ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స కోసం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సోమవారం సాయంత్రం మృతిచెందాడు. లక్ష్మీనారాయణ బేల్దారి పనిచేస్తూ జీవనం గడుపుతున్నాడు. మృతుడికి భార్య కొడుకు, కూతురు ఉన్నారు.

News June 17, 2024

ATP: ఎన్నికల వేళ రాజీనామా.. ఖాళీలు ఎన్నంటే?

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాలంటీర్ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందు వందల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తీరా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలంటూ రాజీనామా చేసిన వాలంటీర్లు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఉమ్మడి అనంత జిల్లాలో 8591 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

News June 17, 2024

అనంతపురం జిల్లా రైతులకు గుడ్‌న్యూస్

image

పీఎం కిసాన్ నిధులను కేంద్ర ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. రూ.2 వేలు చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమకానున్నాయి. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 5 లక్షల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. 2024-25 వ్యవసాయ సీజన్‌లో తొలి విడత పీఎం కిసాన్ సాయం కింద ఈ నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.