India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డిని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో సర్వైకల్ ఆపరేషన్ చేయించుకున్న వైవీఆర్‌ను అర్ధరాత్రి వీడియో కాల్ ద్వారా యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని, 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని వైవీఆర్ వివరించారు.
గత ప్రభుత్వం విచ్చల విడిగా అప్పులు చేసిందని, ఈ ఏడాది జూన్ నాటికి రూ.9 లక్షల 74 వేల కోట్లుగా తేలాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. బుధవారం శాసనమండలిలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తే చట్టసభల అనుమతితో చేయాలని కానీ.. గత ప్రభుత్వం చట్టసభల అనుమతి లేకుండా రూ.వందల కోట్లు అప్పు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంత జిల్లా వాసులను విద్యుత్ ప్రమాదాల రూపంలో మృత్యువు వెంటాడుతోంది. ఐదేళ్లలో విద్యుత్ ప్రమాదాల కారణంగా వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిన్న విద్యుత్ తీగలు తెగిపడి తండ్రి, కొడుకు మరణించారు. 2022లోనూ దర్గాహొన్నూర్‌లో పనులకు వెళ్తున్న కూలీల ట్రాక్టర్‌పై తీగలు తెగిపడి ఆరుగురు మరణించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కనేకల్ మండలం రచ్చుమర్రి గ్రామంలోని ఇసుక రీచ్‌ను బుధవారం జేసీ శివ నారాయణ శర్మ ఆకస్మికంగా సందర్శించారు. ఇసుక రీచ్‌లో కెమెరాల బిగింపు, ఇసుక నిల్వలు, తరలింపు ప్రక్రియ, తదితర వివరాలను ఆర్డీవో వసంత్ బాబు, భూగర్భ గనుల శాఖ ఏడీఏ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ ఫణికుమార్‌లను అడిగి తెలుసుకున్నారు. ఇసుక రీచ్‌పై టెండర్లు ఆహ్వానించినట్లు జేసీ పేర్కొన్నారు.
పంటల బీమా రైతులకు రక్షణ కవచంలా ఉంటుందని, బీమాపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురంలోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో క్రాప్ ఇన్సూరెన్స్‌పై జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ (డీఎల్ఎంసీ) సమావేశాన్ని నిర్వహించారు. పంటల బీమా పథకం, రబీ 2024- 25, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఎమ్మెల్యేలకు విందు ఇచ్చారు. అమరావతిలోని తన నివాసంలో జరిగిన ఈ స్నేహపూర్వక విందుకు కూటమిలోని మహిళా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రుచికరమైన వంటలను వారికి వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అందరూ గ్రూప్ ఫొటో దిగారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22న ముగియనుండటంతో మంత్రి సవిత ఈ ఆతిథ్యం ఇచ్చారు.
అనంతపురం జిల్లాలో హంద్రీనీవా కాలువ ఆధునికీకరణ పనులను ఏడాదిలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. హంద్రీనీవా ద్వారా రాయదుర్గం నియోజకవర్గంలోని బైరావని తిప్ప, రాప్తాడు నియోజకవర్గంలోని పెరురు రిజర్వాయర్, మడకశిరకు సాగునీరు అందించిన తర్వాత చిత్తూరు జిల్లా కుప్పానికి సాగునీరు తీసెళ్తామని తెలిపారు.
అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎల్లనూరు మండలం దంతాలపల్లి గ్రామ సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో బైక్‌పై వెళ్తున్న తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు అంకెవారిపల్లికి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
వైసీపీ సభ్యులపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు. బుధవారం శాసన మండలిలో బడ్జెట్‌పై, గత ప్రభుత్వ లోపాలు, తప్పిదాలపై ఆయన ప్రసంగింస్తుండగా.. వైసీపీ సభ్యులు కలగజేసుకుని గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నా. వినే బాధ్యత మీకుంది. ఇక్కడ మాట్లాడుకునే ప్రతి విషయం రాష్ట్ర ప్రజలకు తెలియాలి’ అంటూ ఫైరయ్యారు.
పామిడి మండలం పాలెం తండా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రమేశ్ నాయక్ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. పలువురు గిరిజన నాయకులు, కూటమి నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. రమేశ్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు. నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.