Anantapur

News June 16, 2024

ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ జరుపుకోండి: ఎస్పీ

image

మత సామరస్యానికి ప్రతిగా నిలిచే బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రధాన మసీదులు, మదర్సాలు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

News June 16, 2024

తాను చనిపోయి నలుగురికి అవయవదానం

image

పామిడికి చెందిన నితిన్(20) 4 రోజుల క్రితం పెయింటింగ్ పని చేస్తూ మూడంతస్తుల భవనం నుంచి కిందపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే తాను చనిపోయాక అవయవాలను దానం చేయాలని, ఇదే చివరి కోరిక అని తల్లికి చెప్పి చనిపోయాడు. తన కొడుకు కోరిక మేరకు నితిన్ అవయవాలను శనివారం దానం చేశారు.

News June 16, 2024

అనంత: భార్యపై అనుమానంతో కత్తితో భర్త దాడి

image

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాడిపత్రిలోని పాతకోటకు చెందిన దాదాపీర్.. అనుమానంతో భార్య రమీజాను అర్ధరాత్రి కత్తితో గొంతు కోశాడు. ఆమెను స్థానికులు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అనంతపురానికి తీసుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వీరికి వివాహం జరిగి కేవలం 5 నెలలు అయినట్లు తెలుస్తోంది.

News June 16, 2024

బీటెక్, ఫార్మా-డీ పరీక్షా ఫలితాల విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ పరిధిలో ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన బీటెక్ రెండో సంవత్సరం మొదటి, రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు కేశవరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వీటితో పాటు ఫార్మా-డీ 5వ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలనూ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఫలితాలను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని వెల్లడించారు.

News June 16, 2024

సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలకు సర్వం సిద్ధం: అనంత కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు-2024ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని ట్రెజరీలో ఉన్న ప్రశ్న పత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. జూన్ 16వ తేదీన 9:30 నుంచి 11:30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

News June 15, 2024

ధర్మవరంలో బాలుడి అదృశ్యం 

image

ధర్మవరం పట్టణంలోని కేతిరెడ్డి కాలనీకి చెందిన బాలుడు శనివారం అదృశ్యమయ్యాడు. బాలుడు విహాన్ రాజు ఇంటి బయట ఆడుతూ ఉండగా కొద్దిసేపటికి చూసేలోపే అదృశ్యం అయ్యాడని తల్లిదండ్రులు హరి ప్రసాద్, రామలక్ష్మి పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు ధర్మవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కి అప్పగించాలని పోలీసులు తెలిపారు .

News June 15, 2024

60మందికి ప్రశంసా పత్రాలను అందజేసిన సత్యసాయి ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల సమయంలో జిల్లా పోలీస్ శాఖ యంత్రాంగం సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ కార్యాలయంలో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో సమర్థవంతంగా పనిచేసిన 60 మందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు, రివార్డులను అందజేశారు.

News June 15, 2024

రాప్తాడు వద్ద ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

image

హిందూపురం ఆర్టీసీ డిపో బస్సుకు అనంతపురం సమీపంలోని రాప్తాడు వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు రాంగ్ రూట్లో వెళ్లి రివర్స్ తీసుకుంటుండగా డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్ల రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి బస్సు వాలింది. ప్రయాణికుల కేకలు వేసి డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయట పడ్డారు. ప్రమాదానికి గురైన బస్సులో సుమారు 40మంది దాకా ప్రయాణికులు ఉన్నారు.

News June 15, 2024

30 తులాల బంగారు నగలు స్వాధీనం

image

అనంతపురంలో శుక్రవారం పట్టపగలే చోరీ జరిగింది. అయితే గంటల వ్యవధిలోనే పోలీసులు ఆ కేసును ఛేదించారు. డీఎస్పీ ప్రతాప్ అందించిన వివరాల మేరకు.. భవానీ నగర్‌కు చెందిన చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో ఖాజాపీర్ 30 తులాల బంగారు నగలు, రూ.50 వేల నగదును దొంగలించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

News June 15, 2024

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 2,795 మంది అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 8500292992కు సంప్రదించాలన్నారు.