India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పుట్టపర్తి సమీపంలోని సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి ప్రేమ సాయి సహచర విద్యార్థుల దాడిలో గాయపడి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహంతో విద్యార్థి సంఘం నేతలు ఆందోళనకు దిగారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రేమ సాయి మృతదేహాన్ని రహదారిలో ఉంచి ధర్నా చేశారు. విద్యార్థి మృతికి కారణమైన కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మెరుగైన సమాజం కోసం పోలీసు, ప్రజల మధ్య సత్సంబంధాలు కలిగి ఉండటం అవసరమని జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. విడపనకల్లు మండలం పాల్తూరులో కడ్లే గౌరమ్మ జాతర సందర్భంగా పోలీసు, మైత్రి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా శుభపరిణామం అన్నారు.
అనంతపురం పర్యటనకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వచ్చారు. ఆయనకు రాష్ట్ర సరిహద్దులోని బాగేపల్లి చెక్ పోస్టు వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో MJF నాయకులు ఎల్లంరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చెప్పిన టైంలోపు లేపేస్తామని మెసేజ్‌లు రావడం అనంతపురంలో కలకలం రేపింది. బాధితుడి వివరాల మేరకు.. నగరంలోని కురుబ గేరికి చెందిన నాగార్జున బంగారు నగలు తయారు చేస్తుంటాడు. రెండు వారాలుగా ఆయనకు ఓ నంబర్ నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. ‘డిసెంబర్ 16వ తేదీ లోపు నిన్ను చంపేస్తాం’ అని అందులో ఉంది. ఆ నంబర్‌కు కాల్ చేస్తే లిప్ట్ చేయడం లేదు. కంగారుతో నాగార్జున అనంతపురం ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల కాలంలో పలువురు వైసీసీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లకు అండగా నిలిచేందుకు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేశ్ గౌడ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కార్యకర్తలకు వీళ్లు అండగా ఉంటారని చెప్పారు. లీగల్ సెల్‌ను సమన్వయం చేసుకుంటూ కేడర్‌కు భరోసా ఇవ్వాలని జగన్ సూచించారు.
ఆడపిల్లల రక్షణ, భద్రతకు అధికారులు కృషి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం “మిషన్ శక్తి” ఇంటిగ్రేటెడ్ మహిళాసాధికారత కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. హింసకు గురవుతున్న మహిళలు, సహాయం కావలసిన వారికి పునరావాసం, భద్రత కల్పించడానికి పథకాన్ని ప్రవేశ పెట్టారని చెప్పారు.
అనంతపురం: నవజాత శిశువుల్లో సోకే వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని DMHO దేవి సూచించారు. సర్వజన ఆసుపత్రిలో వైద్య, ఆరోగ్య అధికారులతో సమావేశమయ్యారు. నవజాత శిశువులు, గర్భిణీల ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నవజాత శిశువులు వ్యాధులు బారిన పడినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యులతో చికిత్స చేయించాలన్నారు. అత్యధిక మోతాదులో యాంటీబయాటిక్స్ వాడకం అరికట్టాలని సూచించారు.
అనంతపురం నగరంలోని ఆర్డీటీ స్టేడియంలో ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ సంతోశ్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. దీనిని శుక్రవారం ప్రారంభించారు. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కళ్యాణ్ చోటే, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని టోర్నమెంట్‌ను ప్రారంభించారు.
గుత్తి-పెండేకల్లు రైల్వే డబుల్ లైన్ పనులు త్వరలో జరగనున్నాయి. వీటికి చెట్నేపల్లి సమీపంలోని భూములను కేటాయించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ శుక్రవారం వీటిని పరిశీలించారు. మ్యాపులను వీక్షించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహశీల్దార్ ఓబులేసు, రైల్వే సెక్షన్ ఆఫీసర్ విమలేష్ కుమార్, సర్వేయర్ శేష సాయి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో శనివారం ఉదయం 10.00 గంటలకు M.Tech స్పాట్ అడ్మిషన్స్ ప్రారంభిస్తున్నట్లు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సోమశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ఏపీపీజీఈసెట్‌లో అర్హత సాధించి ఉండాలన్నారు. ఆసక్తి గల విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జీరాక్స్ కాపీలను కూడా తీసుకొని రావాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.