Anantapur

News June 13, 2024

సౌత్ జోన్ అండర్-19 బాలికల క్రికెట్ ఛాంపియన్ అనంతపురం జట్టు

image

వెంకటగిరిలో జరిగిన సౌత్ జోన్ వన్ డే బాలికల క్రికెట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను అనంతపురం జిల్లా అండర్-19 బాలికల క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. అనంతపురం జట్టు 14 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సౌత్ జోన్ ఛాంపియన్‌గా నిలిచిన అనంతపురం జట్టును జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి మధు ఆచారి, కోచ్ ఆర్.కుమార్ అభినందించారు.

News June 13, 2024

అనంత: 39 ఏళ్ల తర్వాత దక్కిన మంత్రి పదవి

image

ఉరవకొండ నియోజకవర్గానికి 39 ఏళ్ల తర్వాత మంత్రి పదవి దక్కింది. ఇక్కడి నుంచి గెలిచిన గుర్రం నారాయణప్ప 1985లో మంత్రి అయ్యారు. ఆ తరువాత ఎవరినీ అదృష్టం వరించలేదు. ఇన్నేళ్ల తరువాత టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కింది. 1994లో కేశవ్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత మరో 4సార్లు గెలిచారు. ఉరవకొండ నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు ఆయన పోటీ చేశారు.

News June 13, 2024

నేడు ఉమ్మడి అనంత జిల్లాలో తెరుచుకోనున్న 5,127 పాఠశాలలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నేడు 5,127 పాఠశాలలు వేసవి సెలవులు అనంతరం తెరుచుకోనున్నాయి. అందులో ప్రభుత్వానివి 3,855 పాఠశాలలు కాగా, ప్రైవేట్ పాఠశాలలు 1,272 ఉన్నాయి. మొత్తం 5.88 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే విద్యార్థులకు అందాల్సిన విద్యా కానుక కిట్లు మాత్రం పూర్తిస్థాయిలో రాలేదని అధికారులు చెబుతున్నారు.

News June 13, 2024

వానొస్తే.. వాగుగా మారి దర్శనమిస్తున్న హైవే రోడ్డు

image

అధికారుల నిర్లక్ష్యం, దూరదృష్టి లోపంతో వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. యాడికి మండలం పెద్దపేట గుండా వెళ్లే రాష్ట్రీయ రహదారి వానొస్తే చాలు వాగులా మారుతోంది. పెద్దపేట ఎస్సీ కాలనీ వద్ద రహదారి మడుగులా మారుతోందని, వాహనాల రాకపోకలకు, చోదకులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. రెండేళ్లుగా ఈ దుస్థితి ఇలాగే కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

News June 13, 2024

పెనుకొండ: మంత్రిని ఓడించి మంత్రి అయ్యారు

image

పెనుకొండ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటి చేసి సవిత ఘన విజయం సాధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ తరుపున పోటీ చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన ఉషా శ్రీ చరణ్‌ను ఓడించి అత్యధిక మెజారిటితో గెలుపొందింది. ఈ సందర్భంగా ఆమెను ఎమ్మెల్యేలు టీడీపీ నాయకులు, ఘనంగా సన్మానించారు.

News June 12, 2024

తాడిపత్రి: ఇది చెరువు కాదు.. కళాశాల క్రీడామైదానం.!

image

తాడిపత్రి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం జలమయమైంది. పట్టణంలోని విద్యార్థులకు, క్రీడాకారులకు ఇదొక్కటే క్రీడా మైదానం. చిన్నపాటి వర్షాలకే మడుగులా మారుతోంది. విద్యార్థులు ఆటలకు దూరం కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా డైలీ వాకర్స్ సైతం నీరు నిలిచి ఉండడంతో వాకింగ్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.

News June 12, 2024

ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడపాలి: కలెక్టర్ వినోద్ కుమార్

image

ఏపీఎస్ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంటల్ యాక్టివిటీలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతపురం నుంచి హైదరాబాద్, బెంగళూరులకు వోల్వో బస్సులను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలను పంపించాలన్నారు.

News June 12, 2024

ఈఏపీ సెట్‌లో సత్తా చాటిన అనంత జిల్లా విద్యార్థులు

image

ఈఏపీసెట్‌లో ఉమ్మడి అనంత జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. ఔషధ విభాగంలో తలుపుల మండలానికి చెందిన దివ్యతేజ 2వ ర్యాంకు, అనంతపురం గణేశ్ నగర్‌కు చెందిన భాను తేజసాయి 6వ, ఇంజినీరింగ్ విభాగంలో సతీశ్ రెడ్డి 4వ, కుశాల్ కుమార్ 8వ, యాడికికి చెందిన సాయిజశ్వంత్ రెడ్డి 61వ ర్యాంక్ సాధించారు. తాడిపత్రికి చెందిన సాయి హనీశ్ రెడ్డి 28వ, పెద్దవడుగూరు మండలం తెలికికి చెందిన అనీషా 187వ ర్యాంకు సాధించారు.

News June 12, 2024

సవిత అనే నేను..

image

పెనుకొండ ఎమ్మెల్యే ఎస్.సవిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ‘సవిత అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని’ అంటూ మొదలు పెట్టి దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నానని తెలిపారు. కాగా.. ఈమెకు మంత్రి పదవి రావడం తొలిసారి.

News June 12, 2024

పయ్యావుల కేశవ్ అను నేను..

image

ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పయ్యావుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ‘పయ్యావుల కేశవ్ అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత ర్యాగ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని’ అంటూ మొదలు పెట్టి దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నానని తెలిపారు. కాగా పయ్యావులకు మంత్రి పదవి రావడం తొలిసారి.