India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్ ప్రారంభిస్తామని అన్నారు. ఒక్కొక్క కేంద్రంలో 200 మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,200 మందికి శిక్షణ ఇస్తామని, అభ్యర్థులకు నెలకు రూ.1,500 స్టైపండ్ అందజేస్తామన్నారు.
రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరయ్యారు. మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం శాసనసభ వాయిదా పడింది. సభ నుంచి బయటకు వస్తున్న సమయంలో వారు శాసనసభ ప్రాంగణంలో సహచర మహిళా ఎమ్మెల్యేలతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు.
SKU పరిధిలో డిగ్రీ విద్యార్థులకు ఈ నెల 26వ తేదీ నుంచి మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ బీ.అనిత ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వివిధ కారణాల వలన పెండింగ్‌లో పడిన సబ్జెక్టులను పూర్తి చేసుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు డిసెంబర్ 23వ తేదితో ముగియనున్నట్లు పేర్కొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదమా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారణ చేపట్టారు.
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉరవకొండ నుంచి 5వసారి గెలుపొంది తొలిసారి క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న పయ్యావుల కేశవ్ కూటమి ప్రభుత్వ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సూపర్-6 పథకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సుమారు ₹2.9లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడతారు. మన జిల్లా నేత బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. మరి పయ్యావుల పద్దులో అనంతపురానికి సరైన బెర్త్ దక్కేనా?
ధర్మవరంలోని చెరువులో పడి బాలుడు మృతిచెందాడు. లుక్మాన్ (14) ఆదివారం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయాడు. స్నేహితులు, స్థానికులు వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ, డీఎస్పీ, పోలీసులు హుటాహుటిన చెరువు వద్దకు చేరుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో ఫైర్ ఆఫీసర్ రాజు ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెతికి తీశారు.
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారికి నేడు అవార్డులను అందజేస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా నలుగురు ఎంపికయ్యారన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్ ఆధ్వర్యంలో పుట్టపర్తిలోని సాయి ఆరామంలో వారికి అవార్డులను అందజేస్తారన్నారు.
నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికల అనంతరం జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశం కావడంతో ప్రజల్లోనూ, నాయకుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ముందు గ్రామ సమస్యలు, యువతకు ఉద్యోగాలు వంటి అంశాలపై ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు గుమ్మరించారు. మరి వాటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో గళం వినిపిస్తారా, లేదా? మీరేమంటారు?
తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురం ఐదో రోడ్డులో ఆదివారం రాత్రి గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. కొందరి యువకులు గంజాయి సేవించి కేకలు వేస్తూ బైకులపై తిరుగుతూ హల్‌చల్ చేశారు. ప్రశ్నించిన కాలనీవాసులపై దాడికి తెగబడ్డారు. ఒక బైక్‌ను ధ్వంసం చేశారు. కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కృష్ణాపురం కాలనీకి వెళ్లి విచారణ చేపట్టారు.
నంద్యాల మీదుగా ప్రయాణించే మచిలీపట్నం-ధర్మవరం రైలును బెంగళూరు వరకు పొడిగించాలని సౌత్ వెస్ట్రన్ రైల్వేను దక్షిణ మధ్య రైల్వే కోరింది. ఈ రైలు ధర్మవరం చేరుకున్న తర్వాత 7.40 గంటల పాటు ట్రాక్‌పై ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ రైలును బెంగళూరు వరకు పొడిగించాలని అభ్యర్థించింది. SWR అంగీకారంతో ఇది సాకారం కానుంది.
Sorry, no posts matched your criteria.