India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీఎస్ఆర్టీసీ రాయలసీమ జోనల్ ఛైర్మన్‌గా పూల నాగరాజును ప్రభుత్వం నియమించింది. రాయదుర్గానికి చెందిన పూల నాగరాజు గతంలో గుమ్మగట్ట మండల జెడ్పీటీసీ సభ్యులుగా, అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా పని చేశారు. అలాగే టీడీపీ వాల్మీకి హక్కుల సాధన సమితి రాష్ట్ర కన్వీనర్గా కూడా పనిచేశారు. టీడీపీలో సుదీర్ఘకాలం సేవలందించిన నాగరాజును ఆర్టీసీ జోనల్ ఛైర్మన్గా నియమించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా నలుగురు ఎంపికైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు. గోరంట్లకు చెందిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి విజయకుమార్, రెడ్డిపల్లికి చెందిన షేక్ మొహమ్మద్ యాసీన్, కేసాపురానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ చెన్న కృష్ణారెడ్డి, ధర్మవరం మోడల్ పాఠశాలకు చెందిన శిరీష ఎంపికయ్యారన్నారు. రేపు పుట్టపర్తిలో జరిగే కార్యక్రమంలో అవార్డులు ప్రధానం చేస్తారన్నారు.
కుందుర్పి మండలం జమ్ము గుంపుల పంచాయతీ పరిధిలోని కొలిమిపాలెం శివారులో శనివారం రాత్రి చిరుత సంచారం కలకలం రేపింది. దాని దాడిలో దూడ మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు చిరుతను బంధించి అటవీ ప్రాంతంలో వదిలేయాలని వారు కోరుతున్నారు.
➔ ఉమ్మడి అనంత జిల్లాలో రానున్న 3 రోజుల్లో వర్షాలు.!
➔ అనంతపురం: ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. కీలక సూచన
➔ హిందూపురం: ‘తప్పు చేస్తే పోలీసులనూ వదలిపెట్టం’
➔ శ్రీ సత్యసాయి జిల్లాలో 42 మంది హెడ్ కానిస్టేబుళ్ల బదిలీ
➔ టీసీ వరుణ్‌కు వరించిన అహుడా ఛైర్మన్ పదవి
➔ ముదిగుబ్బ: బాలికల హాస్టల్‌లో నీటికోసం కటకట
➔ సత్యసాయి: చేనేత మగ్గానికి ఉరివేసుకున్న నేతన్న
పోలీసులు విధి నిర్వహణలో ఏ చిన్న తప్పు చేసినా వదిలేపెట్టేది లేదని ఎస్పీ రత్న హెచ్చరించారు. విధి నిర్వహణలో నీతి, నిజాయతీ, నిబద్ధతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. శనివారం హిందూపురం రెండో పట్టణ స్టేషన్ డీఎస్పీ మహేశ్‌తో కలిసి పోలీసులతో సమావేశమయ్యారు. హిందూపురంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల దృష్ట్యా పోలీసులు అసాంఘిక శక్తులతో చేతులు కలిపినా, నేరాలను ప్రోత్సహించినా క్షమించమన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోయే ముందు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం రాష్ట్ర గవర్నర్‌కు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూపకల్పన, ప్రభుత్వం ప్రాధాన్యతలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పయ్యావుల కేశవ్ వివరించారు.
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అమలులో అనంతపురం జిల్లాను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం అనంతపురంలోని జెఎన్టీయూ రోడ్‌లో ఉన్న ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ప్రధానమంత్రి సూర్యఘర్ మేళా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లి యోజన ఎంతో మంచి పథకం అని అన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రత్న ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో హెడ్ కానిస్టేబుళ్ల బదిలీల్లో కొందరికి నిర్దేశిత కాల పరిమితి పూర్తయిన వారు ఉన్నారు. ఆయా పోలీస్ స్టేషనల్లో పనిచేస్తూ బదిలీ అయిన వారిని రిలీవ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఏపీలో 59 మందికి నామినేటెడ్ పదవులను ప్రకటించింది. ఇందులో భాగంగానే అనంతపురానికి చెందిన టీసీ వరుణ్‌కు నామినేటెడ్ పదవి దక్కింది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌కు అహుడా ఛైర్మన్ పదవిని కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనసేన నాయకులు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నీరుగట్టువారిపల్లెలో చేనేత మగ్గానికి ఉరివేసుకుని ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల మేరకు.. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లికి చెందిన సీ.హరి(45) మారుతీ నగర్‌లో ఉంటున్నాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో నేడు ఆయన చేనేత మగ్గానికి ఉరివేసుకుని మృతిచెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.