India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు, రైళ్లను తరచూ తనిఖీలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

సీఎం కార్యాలయం నుంచి వచ్చే ప్రజా వినతులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా భూ సమస్యల్లో రికార్డులు తప్పనిసరిగా కలిగి ఉండాలని ఆయన ఆదేశించారు. తహశీల్దార్లు 22A భూముల జాబితా శనివారం సమర్పించాలన్నారు.

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిపై వైసీపీ సంచలన ఆరోపణ చేసింది. ఎమ్మెల్యే తల్లి నీలావతి రూ.5లక్షలకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టును అమ్ముకున్నారని ఆరోపించింది. ‘ఎమ్మెల్యే శ్రావణి టీడీపీ కార్యకర్తకే వెన్నుపోటు పొడిచారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టునే రూ.5 లక్షలకి అమ్ముకున్నారంటే.. కూటమి నేతల దందాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థమవుతోంది. సంపద సృష్టిస్తానన్నావ్.. ఇలాగేనా చంద్రబాబూ’ అని ట్వీట్ చేసింది.

అనంతపురం(D) వజ్రకరూర్ మం. చాబాల గ్రామంలో ఘరానా మోసం బయటపడింది. గ్రామ రైతులు కందులను వ్యాపారులకు విక్రయించారు. ఎలక్ట్రానిక్ కాటా యంత్రంలో తూకం వేయగా అందులో తేడాను రైతులు గమనించారు. వ్యాపారస్థులు తీసుకొచ్చిన కాటా యంత్రం, కందులు తరలించడానికి వచ్చిన లారీలను రైతులు వజ్రకరూర్ పోలీసులకు అప్పగించారు. తూనికల శాఖ అధికారులు యంత్రాన్ని పరిశీలించగా అందులో చిప్ అమర్చినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ పోలీసులకు సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు మద్యం తాగి డ్రైవింగే చేయడమే ప్రధాన కారణంగా ఉందని తెలిపారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు వాహనాలు నడపకుండా ఆ కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే జరిమానాలను 3నెలల్లోపు చెల్లించకపోతే వాహనాన్ని జప్తు చేస్తామని స్పష్టం చేశారు.

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97055 22122కు వాట్సాప్ చేయండి.

హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆయనను నియమించారు. వైఎస్ జగన్ ఆదేశాలతో ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నిన్న జిల్లా నేతలతో సమావేశమైన జగన్ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ అన్ని అంశాలలో పూర్తిగా వెనుకబడినట్లు గుర్తించామని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. గురువారం పుట్టపర్తి కలెక్టరేట్లో ఐసీడీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల పనితీరు గురించి ఇన్‌ఛార్జ్ పీడీ వరలక్ష్మితో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

భూముల మార్కెట్ విలువల ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గ దర్శకాలకు అనుగుణంగా మార్కెట్ విలువలు నిర్ణయించాలని ఆదేశించారు. ఈనెల 27 లోపు పూర్తి చేసి నివేదికలు సమర్పించాలన్నారు.

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగింది. జిల్లాలోని నియోజకవర్గ బాధ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలోని రాజకీయ పరిణామాలు, భవిష్యత్తులో చేయబోయే ధర్నాలు, పార్టీ కార్యక్రమాలు, పలు అంశాలపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
Sorry, no posts matched your criteria.