India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం రూరల్ పరిధిలోని పంగల్ రోడ్ లో ఉన్న టీటీడీసీ కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రశాంతి జిల్లా పరస్పర సహాయ సహకార సంఘాల ఫెడరేషన్ లిమిటెడ్ 20వ వార్షిక మహాసభలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సంఘాల అభివృద్ధి చెందాలంటే అధికారులకు, పాలకవర్గాల మధ్య సంబంధం దగ్గరగా ఉండాలని, అందరూ కలిసి పనిచేసే సంస్థ అభివృద్ధి వైపు తీసుకోరావాలని కోరారు.
వివక్ష, అణచివేతకు గురైన వర్గాల నుంచి వచ్చిన తనకు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు అని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు అన్నారు. బుధవారం టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి సన్నిధిలో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమితులవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు బెయిల్ మంజూరైంది. సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసులో హైదరాబాద్ సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సూరి హత్య కేసులో గతంలో జీవిత ఖైదు శిక్ష పడటంతో అతడు జైలులోనే ఉండనున్నాడు. 2011 జనవరి 4న భాను కిరణ్ చేతిలో సూరి హత్యకు గురైన విషయం తెలిసిందే. భాను కిరణ్ 12 ఏళ్లుగా చంచల్‌గూడ జైలులో ఉంటున్నాడు.
అనంతపురం జిల్లా గుత్తికి చెందిన 15 ఏళ్ల బాలుడు ఇంటి నుంచి పారిపోయి విశాఖ నగరానికి చేరుకున్నాడు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో కూర్చుని ఉన్న బాలుడిని స్థానికులు గుర్తించి టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలుడి వివరాలు అడిగి తెలుసుకుని పాపా హోంలో ఆశ్రయం కల్పించారు. మంగళవారం ఉదయం నగరానికి చేరుకున్న తండ్రికి బాలుడిని అప్పగించారు.
కనగానపల్లి మండలంలో ముగ్గురు వైసీపీ నేతలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బద్దలాపురంలో దామోదర్ రెడ్డి, దినేశ్ రెడ్డి, శంకర్ రెడ్డి.. లక్ష్మీనరసమ్మ, నరసింహులు అనే దళిత దంపతుల మధ్య పొలం విషయమై గొడవ జరిగింది. తమను కులం పేరుతో తిట్టారని వారు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై ఇషాక్ బాషా తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని 230 సాగునీటి సంఘాల ఛైర్మన్‌లు, డైరెక్టర్ల స్థానాలకు ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు రెవెన్యూ, మైనర్ ఇరిగేషన్ అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల నిర్వహణలో జలవనరుల శాఖ అధికారులు కూడా నిబంధనల మేరకు వ్యవహరించాలని తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ అభిషేక్ కుమార్, శ్రీనివాసులు, పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్, ఆర్డీవోలు, నూతన కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 104 హెల్త్ అంబులెన్స్ ఉద్యోగులు నిరసన ప్రదర్శించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాల పెంపు, మూడు నెలల జీతాల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లకు 104 సిబ్బంది వినతి పత్రాలు అందజేశారు. మూడు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని, కుటుంబాలను పోషించడం కష్టమవుతోందని 104 అంబులెన్స్ ఉద్యోగులు పేర్కొన్నారు.
రాష్ట్రంలో పోలీసుల గౌరవాన్ని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో డీఎస్పీల పాసింగ్ అవుట్ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నామన్నారు. పోలీసు వ్యవస్థపై గురుతర బాధ్యత ఉన్నదని, అందరూ సమర్థవంతంగా పని చేయాలని కోరారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో త్వరలో నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు నిర్వహించనున్నామని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలలో ఇరిగేషన్ అధికారులు ప్రతి ఉత్సాహం చూపకూడదని కలెక్టర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా జల వనరుల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి సంఘం ఎన్నికల మొదటి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.