India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లాలోని ఎన్డీఏ కూటమి నాయకులతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. మంగళవారం కడపలోని రహదారులు భవనాల శాఖ అతిథి గృహం నందు ఎన్డీఏ కూటమి నాయకులతో నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూటమినేతలు కలిసికట్టుగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచార ఘటన మరువక ముందే మరో దారుణం జరిగింది. సోమందేపల్లి మండలంలోని ఓ గ్రామంలో సోమవారం రాత్రి ఓ మూగ మహిళపై ఆదే గ్రామానికి చెందిన రామాంజి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఉమ్మడి అనంత జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి మోటార్ వాహనాల ప్రమాద కేసులు, సివిల్, చెక్‌బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలు, పారిశ్రామిక వివాదాలు, రాజీ చేయదగిన క్రిమినల్ కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ చేస్తారని తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతిలో వివాహిత చైత్ర(25) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. భర్త ప్రేమ్ కుమార్‌తో వేరు కాపురం పెట్టాలని మృతురాలు ఒత్తిడి తెచ్చారు. కొద్ది రోజులు ఆగాలని చెప్పినా వినకుండా క్షణికావేశంలో ఇంట్లో ఉరేసుకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అనంతపురంలోని కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.30తో అమ్ముడుపోయినట్లు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. మార్కెట్‌కు నిన్న 1050 టన్నుల టమాటా దిగుబడులు రాగా కిలో సరాసరి రూ.20, కనిష్ఠ ధర రూ.10 పలికినట్లు చెప్పారు. ఇక చీనీ కాయలు టన్ను గరిష్ఠంగా రూ.30 వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి గోవిందు తెలిపారు. కనిష్ఠ రూ.12 వేలు, సరాసరి రూ.22 వేలు పలికిందన్నారు.
పుట్టపర్తి నియోజకవర్గంలోని 195 చెరువులకు హంద్రీనీవా ద్వారా సాగునీటిని ఇవ్వాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర కోరారు. సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పుట్టపర్తి మున్సిపాలిటీకి శాశ్వత నీటి పథకానికి మంజూరైన 1.38 కోట్ల నిధులు మంజూరుకు ప్రత్యేక కృషి చేయాలని కోరారు.
అనంతపురం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష చేపట్టారు. సోమవారం రాత్రి ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న హోం మంత్రి అనితకు పోలీస్ అధికారులు స్వాగతం పలికారు. రాయలసీమ ఐజి శ్రీకాంత్, అనంతపురం రేంజ్ డీఐజీ ఫేమస్, అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్, శ్రీసత్య సాయి జిల్లా ఎస్పీ రత్నతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన డీఎస్పీలు, సీఐలు సమీక్షలో పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ‘మీ కోసం’ కార్యక్రమంలో 100 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదులు పంపించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
అనంతపురం నగరంలోని కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. త్వరలోనే ప్రజలు ఇచ్చిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి, సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా కేంద్రంలోని ఆరామ్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కి జిల్లా టీడీపీ అంజినప్ప పుష్పగుచ్చాన్ని అందజేశారు.
Sorry, no posts matched your criteria.