Anantapur

News June 4, 2024

ధర్మవరంలో సత్యకుమార్ యాదవ్ ముందంజ

image

ధర్మవరం నియోజకవర్గ 19వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి వై.సత్యకుమార్ యాదవ్ ముందంజలోకి వచ్చారు. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై 3300 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒకానొక దశలో 11 వేల ఓట్ల లీడ్లోకి కేతిరెడ్డి వెళ్లగా.. బత్తలపల్లె, ధర్మవరం రూరల్ ప్రజలు బీజేపీవైపు మొగ్గుచూపారు.

News June 4, 2024

పయ్యావుల కేశవ్ గెలుపు

image

ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలిచారు. 15 రౌండ్లకుగాను పయ్యావులకు 1,00,550 ఓట్లు, వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డికి 79,746 ఓట్లు వచ్చాయి. మొత్తం 21,704 మెజారిటీ వచ్చింది. ఉమ్మడి అనంతలో 12 చోట్ల టీడీపీ విజయం దిశగా దూసుకెళ్లింది. టీడీపీ శ్రేణులు భారీగా సంబరాలు చేసుకుంటున్నాయి. అనంతపురం పట్టణంలోని పయ్యావుల ఇంటి వద్ద ఇప్పటికే సంబరాలు ప్రారంభమయ్యాయి.

News June 4, 2024

ఐదో రౌండ్ పూర్తి.. 10,935 ఓట్లతో ఆధిక్యంలో బాలకృష్ణ

image

హిందూపురం బిట్ కాలేజీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఐదో రౌండ్ ముగిసేసరికి హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ 10, 935 ఓట్లతో ముందంజలో ఉన్నారు. హిందూపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీ.ఎన్. దీపికపైన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ముందంజలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

News June 4, 2024

1880 ఓట్ల అధిక్యంలో నందమూరి బాలకృష్ణ ముందంజ

image

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌లో భాగంగా హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి టి.ఎన్ దీపికపై 1880 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

272 ఓట్ల ముందంజలో పయ్యవుల కేశవ్

image

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌లో భాగంగా ఉరవకొండ టీడీపీ పయ్యావుల కేశవ ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిపై 272 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

అదృష్టం పరీక్షించుకొనున్న 134మంది అభ్యర్థులు

image

అనంతపురం జిల్లాలో 8 అసెంబ్లీ, అనంతపురం పార్లమెంట్ నుంచి 134మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో అనంతపురం పార్లమెంట్ నుంచి 21మంది, 8 అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి 113మంది అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. జూన్ 4 జరగనున్న ఎన్నికల కౌంటింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. ఇప్పటికే అధికారులు కౌంటింగ్‌కు సర్వం సిద్ధం చేశారు. మరి కొన్ని గంటల్లో భవితవ్యం తెలనుంది.

News June 4, 2024

అనంత: గరిష్ఠ ధర రూ.38,000

image

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.38 వేలు, కనిష్ఠంగా రూ.15 వేలు, సరాసరి రూ.25 వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్‌ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. సోమవారం అనంతపురం మార్కెట్‌కు మొత్తంగా 720 టన్నుల చీనీకాయలు వచ్చాయని జయలక్ష్మి తెలిపారు. మార్కెట్లో చీనీకాయలు గరిష్ఠంగా రూ. 38 వేలతో అమ్ముడు పోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

News June 4, 2024

7వ తేదీ నుంచి పాలిసెట్ వెబ్ ఆప్షన్లు

image

పాలిసెట్ అర్హత సాధించి కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు 7వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పాలిసెట్ కౌన్సెలింగ్ కోఆర్డినేటర్ జయచంద్రారెడ్డి తెలిపారు. నేడు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌన్సెలింగ్ తేదీలను వాయిదా వేసినట్లు తెలిపారు. ఈమేరకు 6న సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, 7న వెబ్ ఆప్షన్లు 13న సీట్ల కేటాయింపు, 14న సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రారంభమవుతాయని విద్యార్థులు గమనించాలని కోరారు.

News June 4, 2024

జిల్లాలో ఎన్నికల ఫలితాలు తేల్చనున్న 16,36,648 మంది ఓటర్లు

image

అనంతపురం జిల్లాలోని 8అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 26,900 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు. జిల్లావ్యాప్తంగా 20,18,162 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 9,97,792 మంది పురుషులు,10,20,124 మంది మహిళలు, 246 మంది ఇతరులు ఉండగా అందులో మొత్తం 16,36,648 మంది, 8,17,536 మంది పురుషులు, 8,19,004 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News June 4, 2024

అనంతపురం జిల్లా అంతటా హై అలర్ట్..!

image

జిల్లా అంతటా హై అలర్ట్ ప్రకటించారు. 144 సెక్షన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. మండల కేంద్రాల్లోని తహసీల్దారు కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో 315 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల్లో అధికారులను అప్రమత్తం చేశారు. అక్కడి పరిస్థితులపై సమాచారం గంటకొకసారి జిల్లా కంట్రోల్ రూమ్ కు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని 280 ప్రాంతాలలో డ్రోన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.