India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు డా.వినోద్ కుమార్, టీఎస్ చేతన్ విజయవాడకు వెళ్లారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.

సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు మంగళవారం గెజిట్ నోటిఫికేషన్‌ను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ విడుదల చేశారు. సాగునీటి సంఘాలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. జిల్లాస్థాయిలో మైనర్ ఇరిగేషన్ సంఘాలు 214, మీడియం ఇరిగేషన్ సంఘాలు 16.. మొత్తం 230 ఉన్నాయని తెలిపారు. ఈనెల 14న సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువుకు చెందిన జ్యోతి అనే మహిళ తన ఇద్దరు పిల్లలు తేజ, సాహితితో కలిసి అదృశ్యమైంది. ఈనెల 3న ఆమె పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రాలేదు. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలించారు. అయినా లభించలేదు. జ్యోతి తల్లి లక్ష్మీదేవి మంగళవారం యాడికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కూతురు, ఇద్దరు పిల్లలతో అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయండంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

రైతాంగం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 13వ తేదీన నిర్వహించనున్న ‘అన్నదాతకు అండగా వైసీపీ’ ర్యాలీకి సంబంధించి పోస్టర్లు ఆ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి ఆవిష్కరించారు. కళ్యాణదుర్గం, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తలు తలారి రంగయ్య, విశ్వేశ్వరరెడ్డి, వీరాంజనేయులు, ఎమ్మెల్సీ మంగమ్మ, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీం పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సులలో వస్తున్న ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం శనివారం గ్రామ సచివాలయంలో తహశీల్దార్ సౌజన్య లక్ష్మీ అధ్యక్షతన జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ప్రజల కోసం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుల్లో 56 రకాల సర్వీసులు ఉచితంగా పొందవచ్చన్నారు.

వసతి గృహాల నిర్మాణ మరమ్మత్తు పనులు వచ్చే సంక్రాంతి లోపు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన విద్య అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

టమాటా ధరలు పడిపోయాయి. అనంతపురం కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న మొన్నటి వరకు కిలో రూ.30 నుంచి రూ.40 వరకు పలుకుతుండగా తాజాగా రూ.20కి చేరింది. కనిష్ఠంగా రూ.5, సరాసరి రూ.10తో విక్రయాలు సాగుతున్నాయి. మరోవైపు చీనీ ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. నిన్న టన్ను గరిష్ఠంగా రూ.37,280 పలికాయి.

టమాటా ధరలు పడిపోయాయి. అనంతపురం కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న మొన్నటి వరకు కిలో రూ.30 నుంచి రూ.40 వరకు పలుకుతుండగా తాజాగా రూ.20కి చేరింది. కనిష్ఠంగా రూ.5, సరాసరి రూ.10తో విక్రయాలు సాగుతున్నాయి. మరోవైపు చీనీ ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. నిన్న టన్ను గరిష్ఠంగా రూ.37,280 పలికాయి.

కదిరి మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో నిందితుడు నాగరాజును అరెస్టు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. సీఐ వివరాల మేరకు.. నాగరాజు ఆటో నడుపుకుంటూ జీవనం గడుపుతున్నాడు. 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను మభ్యపెట్టి మోసం చేశాడని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. రిమాండ్‌కు పంపినట్లు వివరించారు.

మిస్సింగ్ ఎంప్లాయిస్ అండ్ సిటిజన్స్ మ్యాపింగ్, హౌస్ ఇమేజ్ & జియో కోఆర్డినేట్స్, ఎన్పీసీఐ లింక్, సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ అటెండెన్స్, ఎంఎస్ఎంఈ సర్వే స్టేటస్ కింద కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో మిస్సింగ్ ఎంప్లాయిస్ అండ్ సిటిజన్స్ మ్యాపింగ్, హౌస్ ఇమేజ్ పై సమీక్ష చేశారు.
Sorry, no posts matched your criteria.