Anantapur

News June 3, 2024

కౌంటింగ్‌కు ఇవి తీసుకెళ్తే కేసులు తప్పవు: అనంతప ఎస్పీ

image

అనంతలో ఎన్నికల కౌంటింగ్‌కు వెళ్లే అభ్యర్థులు, ఏజెంట్లు నీటి సీసాలు, ఇంక్ పెన్నులు, ఫోన్‌లు తీసుకెళ్లరాదని ఎస్పీ గౌతమి శాలి సూచించారు. కౌంటింగ్ కేంద్రంలో ఏ చిన్న గొడవ జరిగినా వెబ్‌కాస్టింగ్‌లో రికార్డవుతుందన్నారు. అక్కడ తోసుకోవడం, కౌంటింగ్ ప్రాంతంలో మెష్ పడేయడం వంటివి చేస్తే ఫిర్యాదు తీసుకుని కేసులు నమోదు చేస్తామన్నారు. అందరూ శాంతియుత వాతావరణానికి సహకరించాలన్నారు.

News June 3, 2024

పెద్దపప్పూరు ఎస్‌ఐ శరత్ చంద్ర సస్పెండ్

image

పెద్దపప్పూరు మండలంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శరత్ చంద్ర ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తాడిపత్రి రాళ్ల దాడి కేసులో నిందితుడుగా ఉన్న సోమశేఖర్ నాయుడు, కొంత మంది పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట సమీప ప్రాంతాలలో ఉన్నప్పటికీ కదలికలను పసిగట్టక పోవడం, విధులలలో నిర్లక్ష్యం వహించారన్న కారణాలతో ఎస్సైను సస్పెండ్ చేశారు.

News June 3, 2024

అనంతపురాన్ని 8 గ్రిడ్‌లుగా విభజించి మూడంచెల భద్రత: ఎస్పీ

image

అనంతపురం నగరం 16 చదరపు కిలో మీటర్లు ఉండగా 8 గ్రిడ్లుగా విభజించామని జిల్లా ఎస్పీ గౌతమి శాలి పేర్కొన్నారు. ఒక్కో గ్రిడ్‌కు ఒక ఇన్‌ఛార్జ్ అధికారిని నియమించి మొబైల్, స్టాటిక్ పికెట్లు పరిశీలించేలా చర్యలు తీసుకున్నామన్నారు. 1వ గ్రిడ్‌లో ఉన్న జేఎన్టీయూ (కౌంటింగ్ కేంద్రం) చుట్టూ సీఏపీఎఫ్, ఏపీఎస్పీ, సివిల్ పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు.

News June 3, 2024

శాంతిభద్రతల విషయంలో రాజీ వద్దు: అనంత ఎస్పీ

image

కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలో బందోబస్తు విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని అనంత ఎస్పీ గౌతమిశాలి అధికారులను హెచ్చరించారు. ఈ మేరకు ఆమె సిబ్బందితో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. చట్టాన్ని ఎవరు అతిక్రమించకుండా చూడాలన్నారు. సిబ్బంది తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.

News June 2, 2024

కుందుర్పి: 600 మందిపై బైండోవర్ కేసులు

image

ఎస్పీ ఆదేశాలు మేరకు కౌంటింగ్ నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా 600 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు కుందుర్పి ఎస్‌ఐ వెంకట స్వామి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో 144 సెక్షన్ అమలులో ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరన్న నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

News June 2, 2024

గుత్తిలో సైబీరియన్ కొంగల సందడి

image

గుత్తి పట్టణంలోని కోర్టు ఆవరణలో ఆదివారం సైబీరియన్ కొంగలు సందడి చేశాయి. చాలా అరుదుగా కనిపించే ఈ కొంగలు కోర్టు ఆవరణలో చెట్లపై కనిపించాయి. దీంతో పక్షుల  ప్రేమికులు ఆనందం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణతో పాటు చుట్టుపక్కల  ప్రాంతాల్లో చెట్లపై కొంగలు కనిపించాయి. వాటి రాకతో కోర్టు ఆవరణం ఆహ్లాదకరంగా కనిపించింది.

News June 2, 2024

అనంత, హిందూపురం MP సీట్లపై ఉత్కంఠను రేకెత్తిస్తున్న Exit Polls

image

ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. పలు సర్వేలు కూటమి అధికారంలోకి రాబోతోందని వెల్లడించగా.. మరికొన్ని మరోసారి YCP ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పాయి. మరోపక్క లోక్‌సభ స్థానాల్లోనూ చాలా వ్యత్యాసంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అనంతపురం, హిందూపురం MP స్థానాలను TDP కైవసం చేసుకుంటుందని చాణక్య X సర్వే.. YCP ఖాతాలో పడతాయని సీ-ప్యాక్ సర్వే పేర్కొన్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌తో ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

News June 2, 2024

హిందూపురం సీటుపై Exit Polls Opinion

image

హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గెలిచే అవకాశం ఉందని పోస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ, వైసీపీ నుంచి కురబ దీపిక పోటీలో ఉన్నారు. కాగా.. మరో సర్వే చాణక్య X కూడా బాలకృష్ణ గెలుస్తారని పేర్కొంది. ఈ సర్వేలపై మీ COMMENT.

News June 2, 2024

Exit Polls: అనంతలో TDPకే మొగ్గు.. YCPకి ఎన్ని సీట్లు అంటే?

image

గత నెలలో జరిగిన సాధారణ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వేలను పలు సంస్థలు నిన్న సాయంత్రం విడుదల చేశాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజలు ఈసారి TDP వైపే మొగ్గు చూపారని చాణక్య X సర్వే అంచనా వేసింది. మొత్తం 14 నియోజకవర్గాల్లో 8 స్థానాల్లో TDP, 3 స్థానాల్లో YCP గెలుస్తుందని పేర్కొంది. మిగిలిన 3 చోట్ల టఫ్ ఫైట్ ఉండగా.. వాటిలో 2 చోట్ల TDP, ఒక చోట YCPకి ఎడ్జ్ ఉన్నట్లు వెల్లడించింది. ఈ సర్వేపై మీ COMMENT

News June 2, 2024

ఆదాయకుల ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు పడిగాపులు

image

కళ్యాణదుర్గం : ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలలో ప్రభుత్వ అధికారుల సంతకం కోసం కళ్యాణదుర్గం తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పరిష్కారం కావడం లేదని విద్యార్థులు వాపోయారు. ఎన్నికల సాకుతో అధికారులు ఉదయం కార్యాలయానికి వచ్చి అరగంటలోపే వెళ్ళిపోతున్నారని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని అన్నారు.