Anantapur

News October 29, 2024

అనంత జిల్లాలో కరవు మండలాలు ఇవే..!

image

ఖరీఫ్ సీజన్‌లో కరవు మండలాలు..
➤నార్పల➤అనంతపురం
➤ తాడిమర్రి ➤ముదిగుబ్బ ➤తలుపుల➤
☞ విడపనకల్లు ☞ యాడికి ☞ గార్లదిన్నె
☞ బీకేసముద్రం ☞ రాప్తాడు
☞ కనగానిపల్లె
☞ ధర్మవరం ☞ నంబులపూలకుంట
☞ గాండ్లపెంట ☞ బుక్కపట్నం ☞ రామగిరి
☞ పరిగి
➤ (తీవ్రమైన కరవు) ☞ (మధ్యస్త కరవు) అని ప్రభుత్వం ప్రకటించింది.

News October 29, 2024

సెల్ ఫోన్ల రికవరీలో అనంతపురం పోలీసుల అగ్రస్థానం

image

పోగొట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీలో అనంతపురం జిల్లా పోలీసులు దేశంలో అగ్రస్థానంలో నిలిచారని జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. ఇప్పటి వరకు 10 వేల మొబైల్ ఫోన్లు రికవరి చేసినట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.18.85 కోట్లు ఉంటుందని వెల్లడించారు. మంగళవారం 1,309 మొబైల్ ఫోన్లను బాధితులకు అందించారు. మొబైల్స్ అందుకున్న బాధితులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

News October 29, 2024

విద్యార్థులు పరిశోధనల వైపు ఆసక్తి పెంచుకోండి: ఇన్‌ఛార్జ్ వీసీ

image

అనంతపురం JNTUలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో మంగళవారం DYNAMECHS-2K24 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జేఎన్టీయూ ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శన రావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులు సాఫ్ట్‌వేర్ రంగం వైపు మాత్రమే కాకుండా.. పరిశోధనల వైపు కూడా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

News October 29, 2024

విద్యార్థులు చేసే పరిశోధనా ఫలితాలు ప్రజలకు ఉపయోగపడాలి: కలెక్టర్

image

విద్యార్థులు చేసే పరిశోధన ఫలితాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం గోరంట్ల మండలంలోని బెస్ట్ ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం నందు స్వర్ణాంధ్ర-2047 విజన్ కార్యక్రమాలు అమలుపై విద్యార్థుల పాత్ర గురించి కలెక్టర్ మాట్లాడారు. విజన్ డాక్యుమెంట్ ను తయారు చేయడంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక స్థిరమైన అభివృద్ధిని సృష్టించే దృక్పథం అన్నారు.

News October 29, 2024

అనంత: స్నేహితురాలితో మాట్లాడుతూ యువకుడి మృతి

image

అనంతపురానికి చెందిన హరి(21) మంగళవారం ఉదయం అన్నమయ్య జిల్లాలో మృతిచెందాడు. కురబలకోట మండలం అంగళ్లుకు స్నేహితురాలిని కలవడానికి వెళ్లాడు. బస్టాండు వద్ద నిలబడి మాట్లాడుతుండగా ఉన్నట్లుండి ఫిట్స్ వచ్చాయి. కిందపడి గాయపడడంతో వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మార్గమధ్యలోనే హరి మృతిచెందినట్లు నిర్ధారించారు.

News October 29, 2024

జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం

image

అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో మంగళవారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, నగర మేయర్ వసీం, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డిఆర్ఓ ఏ.మలోల, జడ్పి సిఈఓ వెంకటసుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

News October 29, 2024

తాడిపత్రిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్‌ స్కూల్‌

image

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్‌ స్కూల్‌ ఏర్పాటు కానుంది. ఈ మేరకు సొసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజ్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌ ఏపీ(సీడాప్‌) నిర్ణయం తీసుకుంది. ఈ స్కూల్‌లో విదేశాల్లో డ్రైవింగ్‌ అవకాశాలు పొందేలా శిక్షణ ఇవ్వనున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీడాప్‌ ఛైర్మన్‌ దీపక్‌రెడ్డి ప్రకటించారు.

News October 29, 2024

అనంతపురంలో టమాటా ధర ఢమాల్‌

image

అనంతపురం జిల్లాలో క్రమంగా టమాటా ధరలు పడిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ పంటను రైతులు విస్తారంగా సాగు చేశారు. అయితే పంట చేతికి వచ్చిన సమయంలో ధరలు కలవర పెడుతున్నాయి. కక్కలపల్లి మండీలో కిలో టమాటా గరిష్ఠ ధర రూ.26 పలుకుతుండగా కనిష్ఠ రూ.13, సరాసరి రూ.20 ప్రకారం క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

News October 29, 2024

ఫ్రీ గ్యాస్ బుకింగ్ నేటి నుంచే.. అనంతపురం జిల్లాలో ఈ కుటుంబాలకు లబ్ధి!

image

మహిళలకు దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. అర్హులైన వారికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. ‘దీపం పథకం’ కింద ఈ దీపావళికి తొలి సిలిండర్ అందజేయనుండగా నేటి నుంచి బుకింగ్ ప్రక్రియ మొదలుకానుంది. తెల్లరేషన్ కార్డుదారులు ఈ పథకానికి అర్హులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు 12,08,293 కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి.

News October 29, 2024

నవంబర్ 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు: కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ నవంబర్ 1న ఉదయం 6 గంటలకే మొదలు కావాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 2,85,004 పెన్షన్లు ఉండగా, అందుకు సంబంధించి రూ.120,09,75,000 పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. బ్యాంకులలో నగదు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఈనెల 30వ తేదీనే బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలన్నారు.