India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ సత్యసాయి జిల్లాలో రేపటి నుంచి ఉచిత గ్యాస్ కు బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ కార్యాలయ వర్గాలు ఓ ప్రకటన ద్వారా సోమవారం తెలిపారు. ఈ పథకం 31వ తేదీ నుంచి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. జిల్లాలో 5,36,289 గ్యాస్ కనెక్షన్ దార్లకు సబ్సిడీ అందనుందని, రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అర్హులని పేర్కొన్నారు. బుక్ చేసుకున్న తర్వాత డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో డబ్బు వారి ఖాతాల్లో తిరిగి జమ చేస్తారు.
ర్యాగింగ్ భూతానికి మెడికల్ విద్యార్థులు దూరంగా ఉండాలని అనంతపురం ఎస్పీ జగదీశ్ పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాలలో ప్రిన్సిపల్ మాణిక్య రావు అధ్యక్షతన ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ జగదీశ్, న్యాయసేవ సాధన కార్యదర్శి శివ ప్రసాద్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. కళాశాలలో జూనియర్, సీనియర్ భేదం లేకుండా సోదర భావంతో ఉండాలని సూచించారు.
కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామ్మోహన్(47) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు. రామ్మోహన్ బ్రహ్మసముద్రం మండలం రాయలదొడ్డిలోని జడ్పీ పాఠశాలలో తెలుగు టీచర్‌గా పని చేస్తూ, కళ్యాణదుర్గంలో నివాసముంటున్నారు. స్నానానికి వెళ్లే సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రామ్మోహన్ మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఉరవకొండ: అమరావతిలోని సచివాలయంలోఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల పాల్గొని రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు గురించి చర్చించారు. సమావేశంలో ఇతర శాఖల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 45 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, ఆస్తి వివాదాలు, తదితర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చునన్నారు.
ప్రజలకు భద్రత కల్పించడం, రక్షించడంతో పాటు ప్రాణాలను నిలబెట్టడం తమ కర్తవ్యమని అనంతపురం ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో పలువురు పోలీసు అధికారులు రక్తదానం చేశారు. పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
గుంతకల్లులోని టీటీడీ కళ్యాణ మండపంలో సోమవారం గుంతకల్లు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి కలెక్టర్ వినోద్ కుమార్ అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి 410 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు.
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ అనంతపురం జిల్లాలో పెట్టుబడులు పెట్టాలని టెస్లా సీఎఫ్‌వో వైభవ్ తనేజాను కోరారు. ఆస్టిన్‌లోని టెస్లా కార్యాలయంలో ఆ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. టెస్లా EV తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు అనంతపురం జిల్లా వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుందని అన్నారు. 2029 నాటికి ఏపీలో 72గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఆరేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈఘటన అనంతపురం జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. బాలిక ఆడుకుంటుండగా వృద్ధుడు(70) మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అసభ్యంగా ప్రవర్తించగా బాలిక తప్పించుకుని ఇంటికెళ్లి తల్లికి చెప్పింది. చిన్నారి కుటుంబ సభ్యులు వృద్ధుడిని నిలదీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని A1 స్టీల్ ఫ్యాక్టరీ వద్ద రెండు బైక్‌లు ఢీకొని ఓ బాలిక మృతి చెందింది. ఆదివారం సాయంత్రం ఎదురుగా వస్తున్న బైక్‌లు ఢీకొనడంతో అలియా(8) అక్కడికక్కడే మృతి చెందగా.. తల్లిదండ్రులతో పాటు నాలుగేళ్ల చిన్నారికి గాయాలయ్యాయి. మరో ద్విచక్ర వాహన దారుడూ గాయపడ్డాడు.
Sorry, no posts matched your criteria.